రేవతి పంతంతో ఏడ్చేసిన కృష్ణ!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ భిన్నమైన కథతో మొదలై.. అత్యంత వీక్షకాదరణ పొందుతూ ఎపిసోడ్ -74 లోకి అడుగు పెట్టింది. కాగా మంగళవారం నాటి ఎపిసోడ్ లో..మురారి గురించి ఆలోచిస్తూ ముకుంద పరధ్యానంలో ఉండగా, అంతలోనే అలేఖ్య వచ్చి.. ఏంటి ముకుంద అలా ఉన్నావ్.. నీకు ఆదర్శ్ రావడం ఇష్టం లేదా.. కనీసం నీ గురించి పూజ చేసిన కృష్ణ, మురారి లకు థాంక్స్ కూడా చెప్పలేదని అంటుంది.