నేనేం నీ అగ్రిమెంట్ భార్యని కాదు కదా మురారి!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-90 లో.. ఇంట్లో ఎవరు నా మాట వినట్లేదని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు చేస్తున్నారని భవాని అంటుంది. రేవతి నువ్వు కృష్ణని కూడా వాళ్ళిద్దరితో పాటుగా ఢిల్లీకి పంపిద్దామని అనుకుంటున్నట్టు నాకొక మాటైనా చెప్పొచ్చు కదా అని భవాని అడుగగా..