English | Telugu

పింక్ లో స్మైలింగ్ అనసూయ

అనసూయ ఈ మధ్య స్పీడ్ బాగా పెంచింది. యాంకర్స్ అందరిలోకి అనసూయ కొంచెం డిఫరెంట్. అందానికి అందం, మంచి నవ్వు, ఎవరేమన్నా అంటే కౌంటర్ ఇచ్చి పడేసే ఆటిట్యూడ్ , ఫుల్ జోష్ తో ఎంటర్టైన్ చేసే తత్త్వం వెరసి హోమ్లీ అనసూయ. బుల్లితెర మీద చిన్నా చితక యాంకరింగులు చేసుకునే అనసూయకు టర్నింగ్ పాయింట్ జబర్దస్త్ వల్ల వచ్చింది. ఇక అంతే అప్పటినుంచి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు అనసూయ. ఈమె డ్రెస్సింగ్ స్టైల్ మీద ఎన్నో రూమర్స్, కామెంట్స్ వచ్చినా అరే చోడ్ దో అనుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. తర్వాత మూవీ ఇండస్ట్రీకి కూడా వెళ్లి అక్కడ కూడా తానేంటో నిరూపించుకుంది. అనసూయ ఎప్పటికప్పుడు ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది.

కైలాష్ నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెట్టిన వేద‌

స్టార్ మా లో ప్ర‌సారం అవుతున్న సీరియ‌ల్ `ఎన్నెన్నో జ‌న్మ‌ల బంధం`. గ‌త కొన్ని వారాలుగా విజ‌య‌వంతంగా ప్ర‌సారం అవుతున్న ఈ సీరియ‌ల్ మ‌హిళా ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. నిరంజ‌న్, డెబ్జాని మోడ‌క్ కీల‌క జంట‌గా న‌టించారు. ఇత‌ర పాత్ర‌ల్లో బెంగ‌ళూరు ప‌ద్మ‌, జీడిగుంట శ్రీ‌ధ‌ర్‌, ప్ర‌ణ‌య్ హ‌నుమండ్ల‌, ఆనంద్‌, బేబీ మిన్ను నైనిక‌, సుమిత్ర‌, రాజా శ్రీ‌ధ‌ర్ న‌టించారు. పేమ‌గా తీసుకొచ్చిన గౌన్ వేసుకుంటే య‌ష్ చెప్పాపెట్టకుండా ముంబై వెళ్లిపోయాడ‌ని వేద ఫీల‌వుతూ వుంటుంది. అయితే య‌ష్ మాత్రం త‌న ద‌గ్గ‌రికే వ‌చ్చి ష‌ర్ట్ బ‌ట‌న్ ఊడింద‌ని చెబుతాడు.