English | Telugu

కాబోయే వాళ్ళను పరిచయం చేస్తాను అన్న ప్రదీప్

సర్కార్ సీజన్ 3 ప్రదీప్ కామెడీతో షోకి వచ్చే కంటెస్టెంట్స్ పంచ్ డైలాగ్స్ తో ప్రతీ వారం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని అందిస్తోంది. ఈ వారం ఈ షోకి గీత సుబ్రహ్మణ్యం సీజన్ 3  వెబ్ సిరీస్ నుంచి  సుప్రజ - అభిజ్ఞ, అర్దమయ్యిందా అరుణ్ కుమార్ వెబ్ సిరీస్ నుంచి  తేజస్విని మాదివాడ- హర్షిత్ వచ్చారు. వీళ్ళతో గేమ్ ఆడించాడు ప్రదీప్. మధ్యమధ్యలో పంచ్ డైలాగ్స్ కూడా బాగా పేలాయి. ఈ వారం కోటి రూపాయల ప్రశ్నకు ఆన్సర్ చెప్పలేకపోయింది అభిజ్ఞ..అలా ఈ వారం ఈ రెండు టీమ్స్ గెలవలేదు. "గీత సుబ్రహ్మణ్యం" టీమ్ నుంచి ఇద్దరూ వచ్చి కాసేపు మల్లెపూలు పట్టుకుని  డాన్స్ చేశారు.

శైలేంద్ర దెబ్బకి రిషి కాలేజీ నుండి అవుట్!

స్టార్ మా టీవీలో ప్రసరమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -773 లో....రిషి ని శైలేంద్ర నుండి కాపాడుకోవడానికి.. వసుధార దగ్గర మాట తీసుకొని అబద్ధం చెప్పమని జగతి అడుగుతుంది. అయితే వసుధార మొదట్లో వద్దని చెప్పినా తర్వాత కన్నతల్లిగా రిషి కోసం జగతి పడే తపనకి వసుధారకి తలవంచక తప్పలేదు. అబద్దం చెప్తానని మాట ఇచ్చింది. ఇక మీటింగ్ లో అందరూ రిషి తప్పు చేసాడని అంటారు. మిషన్ ఎడ్యుకేషన్ ఫండ్స్ మెడికల్ కాలేజీకి ఉపయోగించుకుంటున్నాడని అభియోగం చేసారని జగతి అంటుంది. అందుకు సంబంధించిన సాక్ష్యాలుగా రిషి, వసుధారలు సంతకం చేసిన చెక్ ఉందని జగతి అంటుంది.

మురారికి మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేసిన కృష్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -166 లో.. మధు ఫోన్ పట్టుకొని కృష్ణకి సంబంధించిన ఫన్నీ వీడియోస్ తీస్తుంటే నీ ఫోన్ పడేస్తానని కృష్ణ అంటుంది. ప్లీజ్ వదిన అలా అనకండి.. మొన్న మీరు చేసిన లవ్ ప్రపోజల్ వీడియోకి వ్యూస్ బాగా వచ్చాయి.. నేను ఒక కాన్సెప్ట్ అనుకుంటున్నాను నాకు సపోర్ట్ చేస్తారా అంటూ కృష్ణని మధు అడుగుతాడు. దానికి కృష్ణ ఒప్పుకోదు.. ప్లీజ్ వదిన మీరు భార్య భర్తలులా కాకుండా లవర్స్ లాగా యాక్ట్ చెయ్యాలని అనగానే.. కృష్ణ హ్యాపీగా ఫీల్ అవుతుంది. వద్దు.. నేను డాక్టర్ ని యాక్టర్ ని కాదని కృష్ణ అంటుంది. ప్లీజ్ వదిన అంటూ రిక్వెస్ట్ చేసేసరికి సరేనంటుంది కృష్ణ.

అంత ఓపిక, తీరిక లేదు...

టాలీవుడ్ లో ఉన్న ప్లే బ్యాక్ సింగర్స్ లో చెప్పుకోదగ్గ పేరు లిప్సిక..మూవీస్ లో ఎన్నో సాంగ్స్ పాడి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఎంతో మంది హీరోయిన్స్ కి ఆమె డబ్బింగ్ చెప్తూ ఉంటుంది. వీటికన్నిటికంటే కూడా సోషల్ మీడియాలో చెప్పే మోటివేషనల్ వాక్యాలకు మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఉంది. అలాంటి లిప్సిక "చాలా గ్యాప్ వచ్చేసింది మనం మాట్లాడుకుని" కాబట్టి "ఆస్క్ మీ ఏ క్వశ్చన్" అంటూ ఇన్స్టాగ్రామ్ పేజీలోని  ఫాన్స్ కి, ఆడియన్స్ కి, నెటిజన్స్ కి అనౌన్స్ చేసేసరికి వాళ్ళు కూడా జోష్ తో చాలా ప్రశ్నలే అడిగారు.."మీరు చాలా సింపుల్ గా ఉంటారు కారణమేంటి" " మెయింటైన్ చేసేంత ఓపిక, తీరిక లేదు...నాకంత సినిమా లేదు...అందుకే సింపుల్ గా ఒక లిప్ స్టిక్ మాత్రమే పెట్టుకుంటా" అని చెప్పింది.

‘నీతోనే డాన్స్’.. సరికొత్త డాన్స్ షో త్వరలో...

డాన్స్ లవర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి స్టార్ట్ మాలో సరికొత్త డాన్స్ షో రాబోతోంది. దానికి సంబంధించిన ప్రోమో ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ కొత్త డాన్స్ షో పేరు "నీతోనే డాన్స్" . బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో బీబీ జోడి ఎలా వచ్చి హిట్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. దానికి ఇండికేషన్ గా సీరియల్ యాక్టర్స్ నిఖిల్-కావ్య చేసిన డాన్స్ నే ప్రోమోగా రిలీజ్ చేశారు. ఈ ఇద్దరూ ఐస్ క్రీం తింటూ అలా నడుస్తూ వస్తుంటే వర్షం స్టార్ట్ అవుతుంది. "నీకు గుర్తుందా..ఫస్ట్ టైం మనం కలిసి ఐస్క్రీమ్ తినేటప్పుడు కూడా ఇలాగే వర్షం పడింది..ఆ జర్నీ ఇక్కడి వరకు వచ్చింది...

ఉత్కంఠభరితంగా కృష్ణ ముకుంద సీరియల్.. అసలేం జరిగిందంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ కృష్ణ ముకుంద మురారి. ఓ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్‌-165లో.. నీ దారి నువ్వు చూసుకోమని ముకుందతో మురారి చెప్పి కార్ లో ఇంటికి తీసుకొస్తాడు. అలా కార్ లో వస్తున్నప్పుడు మురారి  తనతో అనేసిన మాటలన్నీ గుర్తుచేసుకుంటూ ఏడుస్తుంది ముకుంద. మరోవైపు కృష్ణ ఒక్కతే తన గదిలో ఉన్న వాళ్ళ నాన్న ఫోటోతో మాట్లాడుతుంది. మా అగ్రిమెంట్ అయిపోతుంది నాన్న.. ఏసీపీ సర్ వెళ్ళిపోమంటే నేనేం చేయాలి.. నేనొక్కదాన్నే ఉండాలా? అలా కృష్ణ ఒంటరిగా మిగిలిపోయిందని అందరూ అనుకుంటారేమో అని కృష్ణ వాళ్ళ నాన్న ఫోటోతో మాట్లాడుతుంది. అప్పుడే మురారి వస్తాడు.