English | Telugu

ట్రెండింగ్ లో గుప్పెడంత మనసు సీరియల్.. ఫ్యాన్స్ ఎమోషనల్ కామెంట్స్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ అత్యంత ప్రేక్షకాధారణ పొందుతూ రేటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది. అయితే ఈ సీరియల్ గత కొన్నిరోజులుగా రోజుకొక ట్విస్ట్ తో ముందుకు సాగుతుంది. స్క్రీన్ మీద రిషి, వసుధారల లవ్ స్టోరీకి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. అయితే ఇందులో  రిషి మ్యానరిజంకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని అనడంలో ఆశ్చర్యం లేదు. రిషి, వసుధారల లవ్ స్టోరీని ఫ్యామిలీ మొత్తం ఇష్టపడతారు. కాగా ఈ సీరియల్ ఇప్పుడు ఒక ఎమోషనల్ గా మారిపోయింది. తాజాఅ గుప్పెడంత మనసు సీరియల్ టైమింగ్ స్లాట్ చేంజ్ పై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు. స్లాట్ టైమింగ్ చేంజ్ చెయ్యొద్దంటూ పెద్ద ఎత్తున మా టీవీ యాజమాన్యంకి రిక్వెస్ట్ చేసుకున్నారు. అయితే తాజాగా గుప్పెడంత మనసు సీరియల్, బ్రహ్మముడి సీరియల్ ఫ్యాన్స్ కి మధ్య చిన్నపాటి మాటల యుద్ధం జరిగింది. ఈ రెండు సీరియల్స్ ప్రోమోలకి కామెంట్ సెక్షన్ లో మా సీరియల్ బాగుందంటూ ఫ్యాన్స్ మధ్య వాగ్వాదం జరిగింది.

బొమ్మరిల్లు  సిద్దార్ధ్ కి కోపమొచ్చింది

"బొమ్మరిల్లు" సిద్దార్ధ్ అంటే చాలు తెలుగు ఆడియన్స్ కి ఒక లవర్ బాయ్ గుర్తొస్తాడు. తర్వాత చేసిన మూవీస్ లో కూడా ఆ ఇమేజ్ కంటిన్యూ అయ్యింది. ఐతే ఇప్పుడు సరికొత్త గెటప్ తో న్యూ ట్రెండ్ కి తగ్గట్టుగా "టక్కర్" అనే మూవీతో రాబోతున్నాడు. ఈ మూవీకి సంబందించిన ప్రొమోషన్స్ కూడా చేస్తున్నారు మూవీ టీమ్. ఇందులో భాగంగా ఒక ప్రెస్ మీట్ లో అడిగిన ఒక ప్రశ్న మీద ఫుల్ ఫైర్ అయ్యాడు. దిమ్మతిరిగే ఆన్సర్ కూడా ఇచ్చాడు.  "తెలుగు ఆడియన్స్ కి మీరొక  లవర్ బాయ్ అనే ముద్ర పడిపోయింది. మెంటల్ గా కూడా సిద్దార్ధ్ అంటే ఒక లవర్ బాయ్ అని ఫిక్స్ ఐపోయాం..అందుకేనేమో మీరు చేస్తున్న యాక్షన్ మూవీస్ రీచ్ కావట్లేదు. నెక్స్ట్ టైం ఏమన్నా మంచి లవ్ స్టోరీతో వద్దామనే ఆలోచన ఏమన్నా ఉందా" అని ఒక వ్యక్తి అడిగేసరికి  "ఫస్ట్ ..ఈ మూవీ ఆడుతుందిరా బాబు. నువ్వు ముందే  మూవీ రిజల్ట్ చెప్పమాకే...మీరు ట్రై చేసింది ఫెయిల్ అవుతుంది సర్...నెక్స్ట్ ఎప్పుడు సక్సెస్ అవుతారు సర్ అని అడుగుతున్నావ్..జూన్ 9 న ఎగ్జామ్ ఇచ్చానురా బాబు.

వెంకటేష్, జూనియర్ ఎన్టీఆర్ ఇన్స్పిరేషన్...

బెల్లంకొండ గణేష్ "స్వాతిముత్యం" మూవీతో తానేంటో తన నటన ఏంటో నిరూపించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు "నేను స్టూడెంట్ సర్" అనే మూవీ చేసాడు. అది రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ప్రొమోషన్స్ లో భాగంగా టేస్టీ తేజతో చిట్ చాట్ చేశారు. ఆడియన్స్ అడిగిన ఎన్నో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ కూడా చెప్పాడు.  "అన్న లాగా కమర్షియల్ స్క్రిప్ట్స్  కాకుండా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ని ఎంచుకుంటున్నారు..కారణం ఏమిటి" అని అడిగిన ప్రశ్నకు " కమర్షియల్ మూవీస్ చేయకపోవడానికి రీజన్ అంటూ ఏమీ లేదు. డిఫరెంట్ జానర్స్ లో మూవీస్ చేసి ఆడియన్స్ కి చూపించాలంటే ఇష్టం నాకు. ప్రస్తుతానికి నాకు మార్కెట్ లేదు.