English | Telugu

మీనాక్షితో కనకం ఆడించిన టెంట్ డ్రామా సక్సెస్.‌. దిగొచ్చిన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-89లో.. కనకం వాళ్ళ అక్క మీనాక్షి దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఎందుకొచ్చావని అపర్ణ అడుగగా.. కావ్యకి పెళ్ళైయింది కానీ పదహారు రోజుల పండుగ జరుగలేదని అంటుంది. అయితే ఇప్పుడు మీకేం కావాలని అడుగగా.. మీరంతా కనకం వాళ్ళ ఇంటికి వస్తే కావ్యకి నల్లపూసలు గుచ్చి మెడలో పసుపు తాడుకి బదులు నల్లపూసలు గుచ్చిన బంగారు తాళిని వేసి పంపిస్తామని మీనాక్షి చెప్పగానే.. మేం రాము.. మా పిల్లల్ని పంపించం.. మిమ్మల్ని ఇక్కడికి రానివ్వమని అపర్ణ అంటుంది.