ప్రభాస్ 'కల్కి'లో పరశురాముడిగా ఎన్టీఆర్.. ఘట్టమేదైనా, పాత్ర ఏదైనా నేను రెడీ..!
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'కల్కి 2898 AD' సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటితో పాటు దర్శకుడు రాజమౌళి అతిథి పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం.