'పుష్ప-2'ని టార్గెట్ చేస్తున్న సినీ పరిశ్రమ.. అల్లు అర్జున్ ఒంటరి అవుతున్నాడా..?
ఇటీవల థియేటర్లలో అడుగుపెట్టిన 'పుష్ప-2' సినిమా, బాక్సాఫీస్ దగ్గర ఎన్నో సంచలనాలు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల్లోనే రూ.800 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన ఈ చిత్రం, రూ.1000 కోట్లకు చేరువైంది. అయితే 'పుష్ప-2'తో అల్లు అర్జున్ ఇన్ని సంచలనాలు సృష్టిస్తుంటే, ఇతర హీరోల నుంచి కనీస స్పందన లేదు. ఎవరూ బన్నీకి కానీ, పుష్ప-2 టీంకి కానీ సోషల్ మీడియా వేదికగా విషెస్ చెప్పట్లేదు. ఇంకా కొందరైతే విష్ చేయకపోగా.. 'పుష్ప-2'ని టార్గెట్ చేస్తున్నారు.