English | Telugu

మురారిని ఇంకా క్షమించని కృష్ణ.. సంతోషంలో ముకుంద!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121లో.. మురారి తనని క్షమించమని కృష్ణని అడుగుతాడు. అయినా కృష్ణ క్షమించకుండా నందు రూమ్ లోకి వెళ్తుండగా.. "మరి నేనేం చెయ్యాలి కృష్ణ.. చచ్చిపోనా" అని మురారి అనేసరికి కృష్ణకి గుండె ఆగినంత పని అవుతుంది. "ఏసీపి సర్.. ఏంటా మాటలు" అని కంటతడి పెట్టుకొని వెనక్కి వచ్చి మురారితో మాట్లాడుతుంది. అవును కృష్ణ నువ్వు నన్ను క్షమించకపోతే ఏదోలా ఉందని మురారి అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కృష్ణ గురించే ఆలోచిస్తూ మురారి హాల్లోనే పడుకుంటాడు. కృష్ణ కూడా మురారితో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటుంది.

గుడిలో కావ్యని ఎత్తుకొని ప్రదక్షిణలు చేసిన రాజ్.. సంతోషంలో కనకం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -60 లో.. దుగ్గిరాల ఫ్యామిలీ కొత్తగా పెళ్లి అయిన  కావ్య, రాజ్ జంటను గుడికి తీసుకొస్తారు. రాజ్, కావ్య ఇద్దరూ కలిసి ప్రదక్షిణలు చేస్తుండగా.. కావ్య కాలు బెణకడంతో తను నడవలేకపోతుంది. ప్రదక్షిణలు మధ్యలో అపవద్దని పంతులు చెప్పినా రాజ్ వినడు. దీంతో రాజ్ వాళ్ళ తాతయ్య సీతారామయ్య కావ్యని ఎత్తుకొని ప్రదక్షిణలు చేయమని రాజ్ కి చెప్తాడు. కావ్య మొదట్లో వద్దు నేను నడుస్తానని చెప్పినా.. ఆ తర్వాత కావాలని పంతంతో.. నడవలేక పోతున్నాను అని కావ్య అనడంతో.. కావ్యని ఎత్తుకొని రాజ్ ప్రదక్షిణలు చేస్తాడు. 

జయచంద్ర ‌ఆశీర్వాదం తీసుకున్న వసుధార.. ‌మీరిద్దరు ఒక్కటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -727 లో.. రిషి,‌ వసుధారలు గెస్ట్ గా వచ్చిన జయచంద్రకి గది చూపిస్తారు. ఇంతలో అక్కడ వసుధార చున్నీ పడి ఉండడం గమనించిన వసుధార.. జయచంద్ర దానిని చూడకముందే తీసెయ్యాలని అనుకొని రిషికి సైగ చేస్తూ ఉండగా.. జయచంద్ర ఆ చున్నీని చూస్తాడు. ఇంతకుముందు ఈ గదిలో ఆడవాళ్ళు ఉండేవాళ్ళా అని జయచంద్ర అడుగుతాడు. వసుధార ఆ చున్నీని తీసి చేత్తో పట్టుకుంటుంది. రిషి డైవర్ట్ చేస్తూ.. మీరు మా గెస్ట్ మీకు నచ్చినట్లు ఉండండి సర్ అని అంటాడు. మీకు భోజనం ఇక్కడికి తీసుకురావాలా? అక్కడకు వస్తారా అని రిషి అడిగేసరికి.. మీకు ఏది నచ్చితే  అది చెయ్యండని జయచంద్ర అంటాడు. మీరు మా అందరితో కలిసి భోజనం చేస్తే బాగుంటుందని రిషి అనగానే సరేనంటాడు జయచంద్ర.

‘గుప్పెడంత మనసు’ సీరియల్ TRP లో మూడవ స్థానంలో ఉండటానికి కారణమేంటి?

బుల్లితెరపై స్టార్ మా టీవీలో వచ్చే సీరియల్స్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. సినిమాల్ని తలపించే ట్విస్ట్ లతో సాగదీస్తూ రోజుకో మలుపుతో ఈ సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇందులో స్టార్ మాటీవీలో వచ్చే 'గుప్పెడంత మనసు'  సీరియల్ కి చాలా మందే ఫ్యాన్స్ ఉన్నారు. అదే కాకుండా ఈ మధ్యలో మొదలైన 'బ్రహ్మముడి' సీరియల్ ఇప్పటికే అత్యధిక TRP తో దూసుకుపోతుంది. అయితే ఈ రెండు సీరియల్స్ కి డైరెక్టర్ కుమార్ పంతం ఒక్కడే కావడం విశేషం. విభిన్న కథా కథనంతో ఈ రెండు సీరియల్స్ ఆకట్టుకుంటున్నాయి. 'బ్రహ్మముడి' సీరియల్ కి  సెలబ్రిటీస్ ప్రమోట్ చెయ్యడం వల్ల దీనిపై భారీ అంచనాలే పెరిగాయి. అయితే ఇప్పుడు TRP లో మొదటి స్థానంలో 'బ్రహ్మముడి', మూడవ స్థానంలో 'గుప్పెడంత మనసు' సీరియల్స్ ఉన్నాయి.

డిస్టర్బ్ అయిన జగతి.. ఈ వసుధార అన్నీ సగం పనులే చేస్తుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్- 725 లో... జగతికి‌ అసలు‌ నిజం తెలుస్తుంది. దాంతో తీవ్రంగా ఆలోచిస్తుంటుంది. అప్పుడు ఫంక్షన్ నుండి వచ్చిన మహేంద్ర జగతిని చూసి.. ఏంటి డిస్టర్బ్ గా ఉన్నావని అడుగుతాడు. మనకి తెలియకుండా ఏదో జరుగుతుందంటే నమ్మలేదు కదా.. మనముందు అలానే ఉన్నారు.. కానీ మనకి తెలియకుండా వాళ్ళ రిలేషన్ మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ చేద్దామనుకున్నారని మహేంద్రతో జరిగిందంతా చెప్తుంది జగతి. వాళ్ళ మధ్య ఉన్న దూరం అలానే ఉంది. పాపం పిల్లలు మహేంద్ర‌‌.. మానసిక ఒత్తిడికి గురవుతయన్నారు. ఇలా అయితే ఏం కాదు.. వాళ్ళకి ఏదో ఒక దారి చూపించాలని జగతి అనగా... వాళ్ళు చెప్తే వింటారా అంటే.‌. రిషి నాకు చాలా చేసాడు. అక్క దేవాయనికి ఎదురించి నన్ను ఇక్కడ ఉండేలా చేసాడు. వాళ్ళిద్దరరి మధ్య ఉన్న చిక్కుముడి విప్పి.. వాళ్ళ సంతోషం కోసం ఏదైనా చేద్దాం మహేంద్ర అని జగతి చెప్తుంది. సరే చేద్దామని మహేంద్ర అంటాడు.

తాగిన మత్తులో కావ్య గదిలోకి వెళ్ళిన రాజ్.. అసలు నిజం తెలిసిపోయింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ రోజు రోజుకి అత్యంత ప్రేక్షకాదరణ పొందుతూ టీఆర్పీ లో టాప్ -5 లో ఉంటుంది. కాగా గురువారం నాటి ఎపిసోడ్-57లో.. ఉదయం దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో ఉంటారు.  అప్పుడే కావ్య గది నుండి బయటకొస్తాడు రాజ్. అది చూసినవాళ్ళంతా ఆశ్చర్యపోతారు. అసలు ఆ అమ్మాయంటేనే ఇష్టం లేదని చెప్పి ఇప్పుడు ఏం చేసావ్? అసలు ఎందుకు వెళ్ళావ్? ఇలాంటి విషయం నేను అడగలేనని అపర్ణ అంటుంది. ఆ తర్వాత రుద్రాణి ఏమైందని అడుగుతుంది. నాకేం తెలియదని రాజ్ అంటాడు. ఇప్పుడు నిజం చెప్పు అసలు ఏం జరిగిందని అడగగా.. అసలు ఆ కళావతి అంటేనే నాకిష్టం లేదని అంటాడు.