English | Telugu

మీనాక్షితో కనకం ఆడించిన టెంట్ డ్రామా సక్సెస్.‌. దిగొచ్చిన అపర్ణ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్‌-89లో.. కనకం వాళ్ళ అక్క మీనాక్షి దుగ్గిరాల ఇంటికి వస్తుంది. ఎందుకొచ్చావని అపర్ణ అడుగగా.. కావ్యకి పెళ్ళైయింది కానీ పదహారు రోజుల పండుగ జరుగలేదని అంటుంది. అయితే ఇప్పుడు మీకేం కావాలని అడుగగా.. మీరంతా కనకం వాళ్ళ ఇంటికి వస్తే కావ్యకి నల్లపూసలు గుచ్చి మెడలో పసుపు తాడుకి బదులు నల్లపూసలు గుచ్చిన బంగారు తాళిని వేసి పంపిస్తామని మీనాక్షి చెప్పగానే.. మేం రాము.. మా పిల్లల్ని పంపించం.. మిమ్మల్ని ఇక్కడికి రానివ్వమని అపర్ణ అంటుంది.

‘ఉగ్రం’ టీమ్ తో హాట్ హాట్ గా గేమ్ ఆడించిన ప్రదీప్

"సర్కార్ సీజన్ 3 " ఫస్ట్ ఎపిసోడ్ మంచి జోష్ తో ఎనెర్జీతో స్టార్ట్ అయ్యింది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి ఉగ్రం మూవీ నుంచి హీరో అల్లరి నరేష్, హీరోయిన్ మిర్న మీనన్, డైరెక్టర్ విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ వచ్చారు. "ఇందులో మొత్తం 10 ప్రశ్నలు ఉంటాయి. ప్రతీ ప్రశ్నకు ఆన్సర్ చెప్పడానికి 60 సెకండ్స్ టైం ఉంటుంది. ప్రతీ ప్రశ్నకు బిడ్డింగ్ అమౌంట్ ని బట్టి క్లూస్ ని రివీల్ చేస్తాం. ఎవరైతే ఎక్కువగా అమౌంట్ బిడ్ చేస్తారో వాళ్లకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే బిడ్ చేసిన అమౌంట్ వాళ్ళ అకౌంట్ లోకి వస్తుంది. మొదటి 7 ప్రశ్నల వరకు నలుగురు ఆడతారు.

ఐస్క్రీమ్ లా ఉన్న మేఘాల్ని తినాలనుందంటున్న కాజల్

‘గుడ్‌ మార్నింగ్‌ హైదరాబాద్‌’ అంటూ జనాల్ని తన మాటలతో ఎలా ఐతే నిద్రలేపేదో అలాగే ‘గుడ్‌ మార్నింగ్‌ బిగ్‌బాస్‌’ అంటూ బిగ్‌బాస్‌ హౌజ్‌ లో తన హవా కొనసాగించింది. రేడియో జాకీ, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌, సింగర్‌, యాంకర్‌, యూట్యూబర్‌ గా, నటిగా ఇలా అన్ని రకాలుగా చేసిన, చేస్తున్న  రహీమున్నీసా మెహ్‌సబీనా అలియాస్‌ ఆర్జే కాజల్‌ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. కాజల్ బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చాక మంచి ఆఫర్స్ నే అందుకుంది. సినిమాలతో పాటు ఓటిటి సిరీస్ లో కూడా కనిపిస్తోంది. రీసెంట్ గా డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ‘ఎక్స్‌పోజ్డ్‌’ అనే వెబ్‌ సిరీస్‌ లో ఓ న్యూస్‌ చానల్‌కు చీఫ్‌ ఎడిటర్‌ రోల్ లో నటించింది. అలాంటి కాజల్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.

జిమ్ లో ఎవరైనా డివోషనల్ సాంగ్స్ ప్రాక్టీస్ చేస్తారా?

సింగర్ మంగ్లీ గురించి అందరికీ తెలుసు. ఎంతో కష్టపడి స్టార్ అయ్యింది. కానీ ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ మాత్రం ఓవర్ నైట్ స్టార్ ఐపోయింది.  ఒకే ఒక్క పాటతో ఆమె  వరల్డ్ వైడ్‌గా ఫేమస్ అయింది. "ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ" అనే సాంగ్ దేశవ్యాప్తంగా ఒక ఊపు ఊపేసింది. ఈ సాంగ్ లో నటించిన సమంతకి ఎంత పేరొచ్చిందో ఈ సాంగ్ పాడిన ఇంద్రావతి చౌహాన్ కి కూడా అంతే పేరొచ్చింది. ఈమెకు బిహైండ్ వుడ్ సంస్థ వాళ్ళు ఈ సాంగ్ పాడినందుకు  గోల్డ్ మెడల్ కూడా ఇచ్చింది.  ఎన్నో మూవీస్ లో  పాటలు పాడినా..జానపద గీతాలు ఆలపించినా రాని గుర్తింపు ఒక్క పుష్ప ఐటమ్ సాంగ్ తో భారీ పాపులారిటీ వచ్చిపడింది....