ఇంద్రజ టీలో ఈగ ఉంటే, నా రేంజ్‌కి నా టీలో ఏనుగు ఉండాలిగా.. నాలిక కరుచుకున్న రోజా!
'జబర్దస్త్' జడ్జిగా రోజా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల ఆమె కాస్త లావయ్యారు. ఆ విషయాన్ని ఆమె ఒప్పేసుకున్నారు. అదీ.. తనను ఏనుగుతో పోల్చుకుంటూ! అదెప్పుడు జరిగిందంటారా? వచ్చే దీపావళి సందర్భంగా 4వ తేదీ ఈటీవీలో 'తగ్గేదేలే' అనే స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం కాబోతోంది. అందులో అన్నమాట! ఈ షోలో రోజా, ఇంద్రజ, ప్రియమణి, పూర్ణ, మన్నారా చోప్రా తమ గ్లామర్‌తో అలరించారు, ఆకట్టుకున్నారు.