English | Telugu

హీరోయిన్ల వస్త్రదారణపై నాగబాబు చెప్తున్నది ఇదే.. నేరం ఎవరిది

Publish Date:Dec 27, 2025

      -నాగబాబు సంచలన స్పీచ్  -మనకి ఏ హక్కు ఉంది  -రాజ్యాంగం ఏం చెప్పింది -ఈ రూల్ తెలియదా!     శివాజీ(Sivaji)ఇటీవల మహిళల వస్త్ర ధారణపై కొన్నికీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రీసెంట్ గా శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు(Nagababu)స్పందిస్తు 'జనసేన కార్యకర్త ఎమ్మెల్సీగా నటుడిగా నేను ఇప్పుడు మాట్లాడటం లేదు. ఓ సాధారణ పౌరుడిగా మాట్లాడుతున్నాను. అలాగే శివాజీ ని నేను టార్గెట్ చేస్తున్నానని అనుకోవద్దు. మన సమాజం ఇప్పటికీ పురుషాధిక్య ఆలోచనలతో నడుస్తుంది. అందుకే ఆడవాళ్ళ డ్రెస్ లు గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు పలానా డ్రెస్ వేసుకోవాలి అని చెప్పడం రాజ్యాంగ విరుద్ధం.     అలా మాట్లాడిన వారికి కూడా ఆడవాళ్ల నుంచి సపోర్ట్ లభించడం దురదృష్టం.ప్రతి అమ్మాయికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ప్రపంచంలో ఫ్యాషన్ మారుతుంది. అందరూ మన బిడ్డలే. ఆడపిల్ల కాబట్టి అలా ఉండాలి అని చెప్పే రైట్ మనకు లేదు. ఆడపిల్లల మీద జరిగే వేధింపులు వాళ్లు  ధరించే డ్రస్సుల వల్ల కాదు. మగవాడి క్రూరత్వం, మగవాడి పశు బలం వల్లే వేధింపులు.  ఆడపిల్లలు ఎలాంటి డ్రెస్ వేసుకున్నా అది సెలబ్రిటీలైనా బయటకు వెళ్లేటప్పుడు వ్యక్తిగతంగా సరైన రక్షణ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలి. దుర్మార్గులున్న మగజాతి ఉన్న సమాజం మనది.     మీరు ఎలా ఉండాలో అలా ఉండండి. ఏ డ్రెస్ వేసుకోవాలనుకుంటున్నారో అదే వేసుకోండి. కానీ చెడ్డ పనులు చేయకూడదు. అది చెప్పాలి మీరు. అంతే తప్ప ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు అనే హక్కు మనకు లేదు. డ్రెస్సింగ్ సెన్స్ కల్చర్ బట్టి మారుతుంటుంది. ఇది వారి తప్పు కాదు. ఆడవాళ్లకు సరిగ్గా రక్షణ కల్పించలేని ప్రభుత్వ వైఫల్యం అవుతుంది. మనం AIలోకి వచ్చాం. ఇంకా ఆడపిల్లలు ఇలా ఉండాలనే మనస్తత్వాలను ఖండించాలి.      Also Read:   తిరుమల టోకెన్స్ పై విశ్వక్ సేన్ కీలక వ్యాఖ్యలు     ఆడదాన్ని అవమానించిన ఏ ఒక్కడూ బాగుపడలేదు. ఎవరెన్ని కామెంట్స్ చేసినా నా వాయిస్ ఓపెన్ చేయకుంటే తప్పు చేసిన వాడిని అవుతా.  మన దేశంలో మోరల్ పోలీసింగ్ రాజ్యాంగ విరుద్ధం. స్వేచ్ఛ, గౌరవం, గోప్యత, సమానత్వం వంటి మౌలిక హక్కులని రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19, 21 కింద హరించేస్తుందని కోర్టులు పునరావృతంగా తీర్పులు ఇచ్చాయని సదరు వీడియోలో పేర్కొన్నాడు. ఇక శివాజీ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పిన విషయం తెలిసిందే.   

Nagababu dismisses misogynistic remarks on women

Publish Date:Dec 27, 2025

Nagababu reacted to men dictating to women, how to dress or what to do and not to do, in his style. He clearly stated that he is not reacting to Shivaji's comments only in particular or targeting him but he is asking such misogyny prevailing in the disguise of protectiveness in society.  He opined that men cannot dictate women to behave in a certain manner or wear only certain clothes as fashions change, time change and thought process change. He remarked that even saree-clad women face brutality of men and it doesn't depend on what someone wear but how someone perceive them.  Nagababu very emotionally stated that he reacts to such situations as a son, a father, a brother, a husband and a friend. He stated that when men can differentiate between how to behave with their respective family members, lovers and strangers - mainly women, then such requests would die.  He pointed out that rather than asking for women to stay guarded it is required for men to be given lessons about how to behave and how to accept freedom and choice to wear. Nagababu assured to women to fight against such men and not feel restricted as people like him will always be there in support of them.  Shivaji recently raised a controversial debate as he commented about what women should wear in public platforms. While he apologised, Telangana Women Commission has asked him to appear in front of them and render clarification. Nagababu's comments have become important in this context but as he explicitly stated he targeted behavior of men in general than just Shivaji.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

Vrusshabha Movie Review

Publish Date:Dec 25, 2025

Champion Movie Review 

Publish Date:Dec 25, 2025

Shambhala Movie Review

Publish Date:Dec 24, 2025

పారితోషికం విషయంలో మహానటి సావిత్రి అలా ఎందుకు చేశారో తెలుసా?

Publish Date:Dec 26, 2025

(డిసెంబర్‌ 26 మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ మహానటిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సావిత్రి. సౌమ్యురాలిగా, దానశీలిగా, ప్రేమమూర్తిగా పేరు తెచ్చుకున్న ఆమె  జీవితంలో ఎన్నో వెలుగు నీడలు ఉన్నాయి. తన మంచితనంతో ఎంత పేరు తెచ్చుకున్నారో, కొన్ని సందర్భాల్లో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పాతాళభైరవి చిత్రంలో తొలిసారి ఒక డాన్సర్‌గా కనిపించిన సావిత్రి.. ఆ తర్వాత పెళ్లిచేసి చూడు, పల్లెటూరుతోపాటు కొన్ని తమిళ సినిమాల్లో మంచి పాత్రలు పోషించి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన దేవదాసు చిత్రం ఆమె కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలోనే పారితోషికానికి సంబంధించి ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక పత్రికలో 'నిర్మాతలకు హెచ్చరిక' పేరుతో ఒక ఆర్టికల్‌ కూడా వచ్చింది. దాని సారాంశం ఇది. నిన్న మొన్నటి వరకు సినిమాకు 300 తీసుకొని నటించిన సావిత్రి ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకు 20,000 రూపాయలు డిమాండ్‌ చేస్తోందని, ఇది నిర్మాతల శ్రేయస్సుకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. అప్పటివరకు సావిత్రి నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదని, అలాంటప్పుడు ఆమె అడిగినంత పారితోషికం ముట్టచెప్పి అనవసరంగా ఆమె వేల్యూని పెంచేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  పత్రికలో ఈ ఆర్టికల్‌ వచ్చేనాటికి చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత బాగాలేదు. మంచి కథని ఎంపిక చేసుకొని సినిమా విజయం సాధించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండేది కాదు.  కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆరోజుల్లో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న ఎవిఎం, జెమిని వంటి సంస్థలకు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు చిత్ర పరిశ్రమ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోవడానికి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు కూడా ఒక కారణమనే అభిప్రాయం ఆరోజుల్లోనే.. అంటే 60 ఏళ్ళ క్రితమే ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా సావిత్రిని టార్గెట్‌ చేశారు నిర్మాతలు. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారంటూ పత్రికలు కథనాలు రాశాయి. సావిత్రి సినిమా రంగంలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, అవకాశాల కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవారో ఆమె పెదనాన్న చౌదరిగారు గుర్తు తెచ్చుకోవాలంటూ సూచించారు.  తారాపథంలో ఎదిగిన తర్వాత తాము ఇండిస్టీలోకి ఎలా అడుగు పెట్టాము, దాని కోసం ఎన్ని మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చింది అనే విషయాలను తారలు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా తాము ప్రస్తుతం ఉన్న స్థితి గురించి మాత్రమే ఆలోచించడం చిత్ర పరిశ్రమకు శ్రేయస్కరం కాదు. ఉన్నఫళంగా పారితోషికం పెంచేయడం అనేది ఎవ్వరికీ క్షేమదాయకం కాదు. చేసిన దానికి తగిన ప్రతిఫలం తీసుకుంటూ క్రమంగా ఎదగడం తారలకు ఎంతో అవసరం. అలా ముందుకెళితేనే నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనం అప్పట్లో చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే ఇప్పటివరకు సావిత్రి తీసుకునే పారితోషికానికి సంబంధించి ఇలాంటి వివాదం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

Karthika Deepam2 : కాశీ అకౌంట్ లో అయిదు లక్షలు.. స్వప్న చూసి షాక్!

Publish Date:Dec 27, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -551 లో..... కాంచన అన్న మాటలకి శ్రీధర్ బాధపడుతాడు. తినడం మానేస్తాడు. కార్తీక్ వచ్చి నాన్న భోజనం చెయ్యమని తినిపిస్తుంటే ముద్ద దిగడం లేదురా అని ఏడుస్తాడు. ఎందుకు అమ్మ ఇవన్నీ ఇప్పుడు.. ఎప్పటిలాగే మాట్లాడుకోవచ్చు కదా అని కార్తీక్ అంటాడు. నేను కావేరి తరుపున వచ్చాను.. తను ఫోన్ చేసి భయపడుతుంటే చూడలేక వచ్చానని చెప్తుంది. దాంతో శ్రీధర్ బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇక కాంచనని కార్తీక్ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. మరొకవైపు స్వప్న భోజనం టేబుల్ పై పెట్టి కాశీకి తినమని చెప్పి వెళ్ళిపోతుంది. భార్యగా ఎలా ఉండాలో దీప అక్కని చూసి నేర్చుకోమని కాశీ అనగానే బాధ్యతగా ఎలా ఉండాలో మా అన్నయ్యని చూసి నేర్చుకోమని స్వప్న అంటుంది. ఆ తర్వాత కాశీ కోపంగా వైరాకి ఫోన్ చేసి నాకు జాబ్ ఇస్తానన్నారని అడుగుతాడు. ఇచ్చాను ముందు బోనస్ గా అయిదు లక్షలు పంపిస్తున్నానని వైరా చెప్తాడు. మరొకవైపు సుమిత్ర గురించి దీప బాధపడుతుంది. అప్పుడే కార్తీక్, కాంచన వస్తారు. మావయ్య బయటకు వచ్చాడా అని దీప అనగానే వచ్చాడని శౌర్య ముందు అబద్ధం చెప్తాడు కార్తీక్. శౌర్య వెళ్ళిపోయాక రాలేదని కార్తీక్ చెప్పగానే దీప బాధపడుతుంది ఎందుకు బాధపడ్డాం.. నీ ఐడియా వళ్లే కదా అయనకి ఆ పరిస్థితి వచ్చిందని కాంచన అనగానే దీప షాక్ అవుతుంది‌. ఇవి నా మాటలు కాదు.. మా పిన్ని ఫోన్ చేసి తిడుతుందని కాంచన అంటుంది. మరొకవైపు తన అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ అయ్యాయని స్వప్నకి కాశీ చూపిస్తాడు. స్వప్న అది చూసి షాక్ అవుతుంది. జనరల్ మేనేజర్ గా జాబ్ వచ్చింది. ఒక్క రోజులో అయిదు లక్షలు సంపాదించానని కాశీ పొగరుగా చెప్తాడు. మనం త్వరలో ఇల్లు తీసుకుంటున్నాం.. వెళ్లిపోతున్నాం ఇన్ని రోజులు మీ వాళ్ళు ఫుడ్ పెట్టినందుకు ఎంత కావాలో చెప్పమను ఇస్తానని కాశీ అనగానే స్వప్న షాక్ అవుతుంది.. ఆ తర్వాత కార్తీక్, దీపల దగ్గరికి స్వప్న వెళ్లి జరిగింది అంత చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

బ‌న్నీ, లోకేష్ కాంబినేష‌న్‌లో సినిమా.. మ‌రి త్రివిక్ర‌మ్ మాటేమిటి?

Publish Date:Dec 25, 2025

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కాంబినేష‌న్‌లో ఓ హై టెక్నిక‌ల్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ చేయ‌బోయే సినిమా గురించి ఇప్ప‌టి నుంచే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని హైద‌రాబాద్ వ‌చ్చిన బ‌న్నీని త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ క‌లిశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఉంటుంద‌ని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.  తాజాగా జ‌రిగిన బ‌న్నీ, లోకేష్ మీటింగ్ ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. వీరి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరింది. అదే నిజమైతే అట్లీ సినిమా పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్‌కి ముహూర్తం నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.  ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో బ‌న్నీ చేయ‌బోయే సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టికే జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. మూడో సారి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే మ‌ధ్య‌లో ఎన్టీఆర్ పేరు వినిపించింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ ప్రాజెక్ట్ మ‌ళ్లీ బ‌న్నీ ద‌గ్గ‌రికే వ‌చ్చింద‌ట‌. పురాణాల ఆధారంగా కార్తికేయుడి కథతో త్రివిక్రమ్ ఒక భారీ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశార‌ట‌. అయితే లోకేష్‌, త్రివిక్ర‌మ్‌.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి సినిమా మొద‌ట స్టార్ట్ అవుతుంద‌నేది తెలియాల్సి ఉంది. 

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969