సీనియర్ డైరెక్టర్ కె. వాసు కన్నుమూత
సీనియర్ డైరెక్టర్ కె. వాసు కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఒకప్పటి గొప్ప దర్శకుడు కె. ప్రత్యగాత్మ ఆయన తండ్రే. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి వంటి అగ్ర హీరోలతో కె. వాసు చిత్రాలు రూపొందించారు. 1974లో విడుదలైన 'ఆడపిల్లల తండ్రి' దర్శకుడిగా ఆయన తొలి చిత్రం.