మళ్ళీ కలిసి నటిస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఈ జనరేషన్ లో పర్ఫెక్ట్ మల్టీస్టారర్ అంటే ముందుగా గుర్తుకొచ్చే మూవీ 'ఆర్ఆర్ఆర్'. రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలు పోషించారు. భీమ్ పాత్రలో ఎన్టీఆర్, రామ్ పాత్రలో చరణ్ నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. అయితే ఈ సినిమా విడుదల సమయంలో.. "మా హీరో గొప్పంటే మా హీరో గొప్ప" అంటూ తారక్, చరణ్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద రచ్చే జరిగింది. దీంతో వీరి కాంబినేషన్ లో మళ్ళీ సినిమా రావడం కష్టమేనని భావించారంతా.