కృష్ణవంశీ ఈజ్ బ్యాక్!
'గులాబి', 'నిన్నే పెళ్ళాడుతా', 'సింధూరం', 'అంతఃపురం', 'మురారి', 'ఖడ్గం' వంటి సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు కృష్ణవంశీ. ఒకప్పుడు ఆయన సినిమా వస్తుందంటే నటీనటులు ఎవరనే దానితో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపించేవారు. అయితే కొంతకాలంగా కృష్ణవంశీ విజయాల వేటలో వెనకబడిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'మొగుడు', 'పైసా', 'నక్షత్రం' వంటి సినిమాలు దారుణంగా నిరాశపరిచాయి.