రష్మిక బ్రేక్‌ఫాస్ట్ ఛాయిస్ ఇదే!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న బ్రేక్‌ఫాస్ట్ ఏం తింటారో తెలుసుకోవాలన్నది చాలా మంది కోరిక. వారందరి కోసమే తన బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని రివీల్ చేశారు రష్మిక మందన్న. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఫిట్టెస్ట్ యాక్ట్రెస్‌గా పేరుంది రష్మిక మందన్నకు. ఎలాంటి ప్రదేశంలో షూటింగ్ చేసినా, ఆమె వర్కవుట్స్ ని మాత్రం సీరియస్‌గా తీసుకుంటారు. హెల్దీగా, ఫిట్‌గా ఉంటే మ్యాజిక్స్ చేయొచ్చంటారు రష్మిక మందన్న. ఈ సందర్భంగా ఆమె తన ఫ్యాన్స్ కోసం హెల్దీ బ్రేక్ ఫాస్ట్ రెసిపీని షేర్ చేసుకున్నారు. ప్రొటీన్ రిచ్ ఓట్ ప్యాన్‌కేక్‌లు చేయడమంటే తనకు మహా సరదా అని అన్నారు రష్మిక. ఒక అరటిపండు, ఒక గుడ్డు, ఖర్జూరాలు, రెండు టీస్పూన్ల బాదంపాలు, పావు టీస్పూన్ బేకింగ్ పౌడర్, అర టీస్పూన్ దాల్చిన చక్క పొడి, మూడు టీ స్పూన్ల ఓట్స్, ఒక స్పూన్ చాక్లెట్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, వెన్న ఉంటే చాలని అంటున్నారు రష్మిక...