ప్రభాస్ 'కల్కి'లో బిగ్ సర్ ప్రైజ్.. కృపాచార్యుడి పాత్రలో తెలుగు స్టార్..!
'బాహుబలి', 'ఆర్ఆర్ఆర్' తర్వాత గ్లోబల్ లెవెల్ లో సంచలనాలు సృష్టించగల తెలుగు సినిమా అని అందరూ బలంగా నమ్ముతున్నది 'కల్కి 2898 AD'. ప్రభాస్ హీరోగా భారతీయ పురాణాల ఆధారంగా రూపొందుతోన్న ఈ సైన్స్ ఫిక్షన్ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకుడు. వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనే వంటి ప్రముఖ నటీనటులు భాగమయ్యారు.