English | Telugu

ఈషా మూవీ రివ్యూ 

Publish Date:Dec 24, 2025

    సినిమా పేరు: ఈషా  న‌టీన‌టులు: హెబ్బా పటేల్, బబ్లూ పృథ్వీ, అదిత్ అరుణ్, అఖిల్ రాజ్, సిరి హనుమంత్, మైన్ మధు  త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: సంతోష్ షనమోని ఎడిట‌ర్‌: వినయ్ రామస్వామి  సంగీతం: ఆర్ ఆర్ ధృవన్ రిలీజ్: బన్నీ వాసు వర్క్స్, వంశీ నందిపాటి ఎంటర్ టైన్ మెంట్  సమర్పణ: కే ఎల్ దామోదర్ ప్రసాద్ నిర్మాత‌:  పోతుల హేమ వెంకటేశ్వరరావు  రచన, ద‌ర్శ‌క‌త్వం: శ్రీనివాస్ మన్నే  రిలీజ్ డేట్ : డిసెంబర్ 25 ,2025      హర్రర్ థ్రిల్లర్ సినిమాల రాక ఈ మధ్య కాలంలో తక్కువ అయ్యింది. దీంతో హర్రర్ జోనర్ ప్రేమికులతో పాటు ప్రేక్షకులు ఆ తరహా చిత్రాల కోసం ఎదురుచూస్తున్నారు. అలాంటి టైంలో 'ఈషా' ఈ రోజు థియేటర్స్ లో అడుగుపెట్టింది. సినిమాపై నమ్మకంతో మేకర్స్  ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఏ మేర ఆకట్టుకుందో చూద్దాం.   కథ   నయన( హెబ్బా పటేల్), కళ్యాణ్ (ఆదిత్ అరుణ్), అపర్ణ(సిరి హనుమంత్), వినయ్(అఖిల్ రాజ్) లు స్కూల్ డేస్ నుంచే మంచి ఫ్రెండ్స్.ఆ ఏజ్ నుంచే  మనిషి చనిపోయాక ఆత్మలు ఉండవనే బలమైన నమ్మకాన్ని కలిగి ఉంటారు. అందుకు తగ్గట్టే ఆత్మలు ఆవహించాయనే పేరుతో మనుషుల ప్రాణాలతో చెలగాటమాడే అన్ని మతాలకి చెందిన  స్వామిజీలని ప్రూఫ్స్ తో సహా చట్టం ముందు ఉంచుతారు. ఆ నలుగురి నెక్ట్ టార్గెట్ ఆదిదేవ్( బబ్లూ పృథ్వీ) అవుతాడు. ఆదిదేవ్ ఎంతో ఎడ్యుకేట్ పర్సన్ తో పాటు వైద్య వృత్తికి సంబంధించి అమెరికాలో ఫేమస్ న్యూరాలజిస్ట్ గా పని చేసాడు. అలాంటి ఆదిదేవ్ ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్ లో ఆత్మలని వదిలించే స్వామిజీగా ఉంటుంటాడు.నయన, కళ్యాణ్, అపర్ణ, వినయ్ లు ఆదిదేవ్ ని కలుస్తారు. ఈ క్రమంలో ఆ నలుగురి జీవితాలకి సంబంధించిన ఒక భయంకరమైన నిజం ఆదిదేవ్ కి తెలుస్తుంది. దీంతో ఆ నలుగురి జీవితాల్లో పలు మార్పులు సంభవిస్తాయి.పైగా ఆ నలుగుర్ని చంపడానికి పుణ్యవతి అనే మహిళ ఆత్మ ప్రవేశించిన ఒక శివ భక్తుడు(మైన్ మధు)ప్రయత్నిస్తుంటాడు. ఆదిదేవ్ కి ఆ నలుగురు గురించి తెలిసిన నిజం ఏంటి? శివ భక్తుడు ఎందుకు ఆ నలుగుర్ని  చంపడానికి ప్రయత్నిస్తున్నాడు? పుణ్యవతి ఎవరు? ఆమెకి ఆ నలుగురికి సంబంధం ఏంటి? ఉంటే ఎలాంటి సంబంధం? ఆత్మల పేరుతో ఆదిదేవ్ నిజంగానే ప్రజలని మోసం చేస్తున్నాడా? న్యూరాలజిస్ట్ స్వామిజీగా మారడానికి కారణం ఏంటి? ఆత్మలు లేవని ఆ నలుగురు నిరూపించారా?  అసలు ఈషా అంటే ఏంటి అనేదే చిత్ర కథ.     ఎనాలసిస్  కథ గా చెప్పుకుంటే చాలా మంచి కథ. కోరికలు, ఆశలు తీరని వారు చనిపోయినప్పుడు , వాళ్ళు మరణించారని ప్రకృతి చెప్తున్నా వాళ్ళు ఆ విషయాన్నీ ఎలా ఒప్పుకోరో కూడా  చెప్పింది. ఈ కథ మెయిన్ పాయింట్ కూడా ఇదే. కాకపోతే ఈ విషయం క్లైమాక్స్ లో తెలుస్తుంది. సదరు పాయింట్ తెలిసినప్పుడు ఎంతో థ్రిల్ కూడా ఫీలవుతాం. కానీ సదరు మెయిన్ పాయింట్ కి సింక్ అయ్యే సన్నివేశాల రూపకల్పనలో మేకర్స్ ఎక్కువ శ్రద్ద చూపించలేకపోయారు.   కాని సదరు సన్నివేశాలు మనకి ఎక్కడ బోర్ కొట్టవు. అందుకు తగ్గట్టే ఫొటోగ్రఫీ, దర్శకత్వం, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనల్ని మెస్మరైజ్ చేసాయి. ఫస్ట్ హాఫ్ చూసుకుంటే సినిమా ప్రారంభం నుంచే పదునైన స్క్రీన్ ప్లే తో నడిచింది. దీంతో నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కలిగింది. కాకపోతే చిన్న వయసు నుంచే  నయన, కళ్యాణ్, అపర్ణ, వినయ్ లు ఆత్మలు లేవు అనే బలమైన నమ్మకాన్నికలిగి ఉండటానికి డైలాగు ద్వారా చెప్పకుండా సన్నివేశం ద్వారా చెప్పి ఉండాల్సింది. ఎందుకంటే కథ మెయిన్ పాయింట్ ఆత్మలు లేవనే నమ్మకం వాళ్ళకి ఉంది కాబట్టి.     పుణ్యవతి ఎపిసోడ్ పరిధిని ఇంకొంచం పెంచాల్సింది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంది. ఇక సెకండ్ హాఫ్ వేగంగానే నడిచినా భయపెట్టే సీన్స్ రిపీట్ గా వచ్చినట్టుగా ఉంది.ఆది దేవ్ కి నలుగురు గురించి ముందుగానే  తెలుసు కాబట్టి ఆదిదేవ్ ని చెడ్డ వ్యక్తిగా చీట్ చేస్తు చూపించాల్సింది. ఆత్మ రూపంలో శివ భక్తుడులో ప్రవేశించిన పుణ్యవతి తన కొడుకు, భర్త దగ్గరకి వెళ్లి తమ కుటుంబంలో జరిగిన కొన్ని విషయాలని చెప్పి ఉంటే బాగుండేది. దీనివల్ల సెంటి మెంట్ వర్క్ అవుట్ అయ్యి ఈషా కి సరికొత్త లుక్ వచ్చి ఉండేది. ఆర్ ఆర్ సౌండ్ కి క్యారెక్టర్స్  భయపడటం కొంచం ఎక్కువ అయినట్టుగా అనిపించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్ మాత్రం బాగున్నాయి. ఆదిదేవ్ స్వామిజీగా కొనసాగడానికి గల కారణాన్ని కూడా సన్నివేశాల రూపకల్పనలో చెప్పి ఉంటే ఒకే పాయింట్ పై కథ నడుస్తున్న ఫీలింగ్ కొంత తగ్గేది.     నటీనటులు సాంకేతిక నిపుణుల పని తీరు   హెబ్బా పటేల్(Hebah Patel),ఆదిత్ అరుణ్, సిరి హనుమంత్, అఖిల్ రాజ్ నటనలో మెరుపులు లేకపోయినా కథకి తగ్గ నటనని ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారు. బబ్లూ పృథ్వీ కూడా అంతే. మెరుపులు లేకపోయినా మరో సారి మెచ్యూర్డ్ పెర్ ఫార్మెన్సు ని ప్రదర్శించాడు. శివ భక్తుడిగా, మహిళ ఆత్మ ప్రవేశించిన వ్యక్తిగా మైమ్ మధు పెర్ ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మూవీ మొత్తంలో తన నటనే హైలెట్. బిజీ ఆర్టిస్ గా మారడం ఖాయం. ఫొటోగ్రఫీ అత్యద్భుతంగా ఉండి 'ఈషా' కి ప్రధాన వెన్నెముక గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదే క్రెడిట్ ఇవ్వచ్చు. ఒక కొత్త లోకాన్ని మన కళ్ళ ముందు  ఉంచింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. మన్నే శ్రీనివాస్(Srinivas Manne)దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు.  కానీ రచన పరంగా మరింత శ్రద్ద చూపించాల్సింది.     ఫైనల్ గా చెప్పాలంటే కథనాల్లో కొన్ని లోపాలు ఉన్నా వాటిని మర్చిపోయేలా రెండుగంటల ఏడు నిమిషాల నిడివితో ఈషా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. హార్రర్ థ్రిల్లర్ జోనర్ ఇష్టపడే ప్రేక్షకులని మాత్రం నిరాశపరచదు.        రేటింగ్ 2 .75 /5                                                                                                                                                                                                                                                   అరుణాచలం     

NTR and Rajamouli laud Champion producers for their passion

Publish Date:Dec 24, 2025

Champion starring Roshan Meka, Anaswara Rajan is gearing up for its grand release, tomorrow. Two of Indian cinema’s biggest icons, Jr. NTR and SS Rajamouli, have come forward to praise the film’s producers, Swapna and Priyanka Dutt. Both luminaries highlighted the sisters' unwavering commitment to pushing the boundaries of storytelling through their banner, Swapna Cinema. Jr. NTR, reflecting on a journey that spans decades, noted that from the days of Student No. 1 to the upcoming Champion, the duo has consistently championed unique voices. "Every movie they make reflects their love for cinema and the courage to attempt something new," the actor stated, emphasizing his deep personal bond with the producers and wishing the team a "memorable finish to 2025." Echoing this sentiment, SS Rajamouli lauded the sisters for their evolution within the industry. He credited them with creating a "special brand" that focuses on high-quality, new-age content. He further praised their passion to spend lavishly on a young team and with such an innovative script that blends entertainment with emotional historical drama of 1948 Bhairanpally Attacks.  Both Rajamouli and NTR expressed great excitement for the film’s lead actors, Roshan Meka and Anaswara Rajan, and director Pradeep Advaitham. With such powerful endorsements from the industry’s top titans, Champion has solidified its status as one of the most anticipated releases of the year. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   

ఎవరికీ తలొగ్గని భానుమతి.. ఓ సంగీత దర్శకుడికి పాదాభివందనం చేశారు.. ఎందుకో తెలుసా?

Publish Date:Dec 23, 2025

(డిసెంబర్ 24 భానుమతి వర్థంతి సందర్భంగా..) పాతతరం నటీమణుల్లో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్న భానుమతి గురించి అందరికీ తెలిసిందే. వివిధ శాఖల్లో విశేషమైన ఖ్యాతిని సంపాదించుకున్న ఆమె.. చిన్నతనంలో తండ్రి దగ్గర సంగీతాభ్యాసం చేశారు. ఆమె స్వరం చాలా విభిన్నంగా ఉంటుంది. సినిమా రంగంలో స్థిరపడిన తర్వాత ఎన్నో పాటలు పాటలు పాడారు. ఆమె పాటలకు ప్రత్యేకంగా అభిమానులు ఉండేవారు. అంతేకాదు, కొన్ని సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.   తిరుగులేని ఆత్మవిశ్వాసం, తనకు నచ్చని ఏ విషయాన్నయినా ఖండించడం అనేది భానుమతికి చిన్నతనం నుంచీ అబ్బిన లక్షణం. అందుకే అనవసర విషయాల గురించి ఆమె దగ్గర ప్రస్తావించేవారు కాదు. ఎన్టీఆర్‌, ఎఎన్నార్‌ వంటి స్టార్‌ హీరోలు కూడా ఆమెతో కలిసి నటించేందుకు భయపడేవారు. సినిమా రంగంలో ఇలాంటి లక్షణాలు ఉన్నవారు రాణించడం చాలా కష్టం. కానీ, భానుమతి మాత్రం దానికి అతీతంగా అద్భుతమైన విజయాలు సాధించి బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.    ఎన్టీఆర్‌, భానుమతి జంటగా నటించిన మల్లీశ్వరి ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అప్పటి సంగీత దర్శకుల్లో రాజేశ్వరరావు ఓ విభిన్న వ్యక్తిత్వంతో ఉండేవారు. తను చేసే సంగీతం గురించి ఎవరైనా విమర్శించినా, సలహాలు ఇవ్వాలని చూసినా, తను చెప్పిన విధంగా గాయనీగాయకులు పాడకపోయినా ఆయనకు వెంటనే కోపం వచ్చేది. మారు మాట్లాడకుండా తన హార్మోనియం పెట్టెను తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేసేవారు. ఎంత పెద్ద హీరో, దర్శకనిర్మాతలైనా ఆయన ధోరణి అలాగే ఉండేది.    తనకు అసౌకర్యంగా ఉన్న వాతావరణంలో రాజేశ్వరరావు సంగీతం చేసేవారు కాదు. అలా సినిమా మధ్యలోనే వచ్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. మాయాబజార్‌ వంటి సినిమాలో నాలుగు పాటలు కంపోజ్‌ చేసిన తర్వాత నిర్మాతల ధోరణి నచ్చక ఆ సినిమా నుంచి బయటికి వచ్చేశారు. 'శ్రీకరులు దేవతలు..', 'లాహిరి లాహిరి లాహిరిలో..', 'నీ కోసమే నే జీవించునది..', 'చూపులు కలిసిన శుభవేళ..' పాటలు ఎస్‌.రాజేశ్వరరావు కంపోజ్‌ చేసినవే. మిగతా పాటలు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ను ఘంటసాలతో చేయించారు. టైటిల్స్‌లో తన పేరు వేయకపోయినా రాజేశ్వరరావు బాధపడలేదు.    ఎన్టీఆర్‌ దర్శత్వంలో వచ్చిన దానవీరశూర కర్ణ చిత్రానికి మొదట అనుకున్న సంగీత దర్శకుడు ఎస్‌.రాజేశ్వరరావు. అందులో ఒక పాట చేసిన తర్వాత ఎన్టీఆర్‌ సోదరుడు త్రివిక్రమరావు పాటలు ఎలా ఉండాలి అనే విషయంలో రాజేశ్వరరావుకు సలహా ఇవ్వాలని చూశారు. ఆ క్షణమే ఎన్టీఆర్‌ దగ్గరకు వెళ్లి 'మీ తమ్ముడికి సంగీత జ్ఞానం బాగా ఉంది. అతనితోనే మ్యూజిక్‌ చేయించుకోండి' అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశారు. ఆ సినిమాలో ఎంతో పెద్ద హిట్‌ సాంగ్‌ అయిన 'ఏ తల్లి నిను కన్నదో..' పాట రాజేశ్వరరావు కంపోజ్‌ చేసిందే. ఆ తర్వాత పెండ్యాల నాగేశ్వరరావుతో మిగతా పాటలు చేయించుకున్నారు ఎన్టీఆర్‌.    ఇక 'మల్లీశ్వరి' సినిమాకి సంబంధించి మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నప్పుడు 'మనసున మల్లెల మాలలూగెనే..' పాటను ఎలా పాడాలో భానుమతికి చెబుతున్నారు రాజేశ్వరరావు. కానీ, కొన్ని సంగతులు ఆయన చెప్పినట్టు కాకుండా తనదైన ధోరణిలో పాడుతున్నారు భానుమతి. తను చెప్పినట్టుగా పాడితేనే పాట బాగా వస్తుందని, తేకపోతే పాట చెడిపోతుందని ఆయన చెప్పారు. కానీ, భానుమతి మాత్రం తను అనుకున్న విధంగానే పాడారు. పైగా తనకు కూడా సంగీత జ్ఞానం ఉంది అంటూ గుర్తు చేశారు. ఆమె అలా అనడంతో వెంటనే అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి ఇంటికి వెళ్లి ఆయన్ని బ్రతిమాలి తీసుకొచ్చారు. చివరికి రాజేశ్వరరావు ఎలా పాడమన్నారో అలాగే పాడారు భానుమతి.    రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత యూనిట్‌ సభ్యులతో కూర్చొని ఆ పాటను విన్నారు భానుమతి. ఆ పాటను రాజేశ్వరరావుగారు అలా ఎందుకు పాడమన్నారో ఆమెకు అప్పుడు అర్థమైంది. క్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా ఆయన దగ్గరకు వెళ్లి పాదాభివందనం చెయ్యబోయారు. కానీ, రాజేశ్వరరావు వారించారు. 'మీరు పాటను అలా ఎందుకు పాడమన్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. నేను తప్పుగా మాట్లాడాను. నన్ను క్షమించండి' అని రాజేశ్వరరావుకు నమస్కారం చేశారు భానుమతి.

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

Podharillu: మహా పెళ్ళికి అంతా ఫిక్స్.. చక్రిని ఆమె అర్థం చేసుకుందా!

Publish Date:Dec 24, 2025

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -12 లో.....మహా తన డ్రీమ్ గురించి భూషణ్ కి చెప్తుంది. డ్రీం లేదు ఏం లేదు ఫ్యామిలీ ని చూసుకుంటే సరిపోతుంది. నాకు నచ్చింది వండి పెడుతూ వెళ్ళేటప్పుడు బై చెప్పి వచ్చేటప్పుటికీ అందంగా రెడీ అయి ఉంటే చాలని చెప్పగానే వీడితో అనవసరంగా నా డ్రీమ్ గురించి చెప్పానని మహా అనుకుంటుంది. అదంతా చక్రి వింటాడు. మరొకవైపు మాధవ దగ్గరికి గాయత్రి వచ్చి.. ఈ పెళ్లి కూడా క్యాన్సిల్ అయ్యిందంట కదా అని చెప్పగానే అందరు షాక్ అవుతారు. ఏ సైలెంట్ గా ఉండు.. ఈ విషయం కన్నాకి తెలియదని మాధవ అంటాడు. ఇందులో దాచడం ఏముంది దాని మామ, అమ్మ కలిసి కావాలనే చెడగొడుతున్నారని నారాయణ అంటాడు. బావ ఇలా ప్రతీది క్యాన్సిల్ అవుతుందంటే మనిద్దరికే రాసి పెట్టి ఉన్నట్టుందని మాధవతో గాయత్రి అనగానే ముందు వెళ్లి మీ వాళ్ళని ఒప్పించమని గాయత్రిని నారాయణ కోప్పడతాడు. మరొకవైపు ప్రతాప్, భూషణ్ ఇంటికి వస్తాడు. మహా ఎలా వుంది అని ఆదిని అడుగుతాడు భూషణ్. మహా పెళ్ళి అంటే ఇష్టం లేదంటుందని అతను చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ తన కూతురు మహా దగ్గరికి వెళ్తాడు. ఎప్పటిలాగానే నాకు పెళ్లి ఇష్టం లేదు నాన్న అని చెప్తుంది కానీ అతను వినిపించుకోడు. మరుసటి రోజు అంకుల్ పెళ్లి అయ్యాక వీసా అప్లై చేస్తే ఎక్కువ టైమ్ పడుతుంది. ముందే రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకొని వీసా అప్లై చేసుకోవాలనుకుంటున్నా.. పెళ్లి మీరు అన్న టైమ్ కి చేసుకుంటానని భూషణ్ అనగానే ప్రతాప్ మొదట వద్దని అన్నా తర్వాత ఒప్పుకుంటాడు. నేను ప్రిపేర్ గా లేనని మహా అంటుంది. అయిన ఎవరు వినరు పాస్ పోర్ట్ సైజ్ ఫోటో కావాలని భూషణ్ అడుగుతాడు. షాపింగ్ కీ వచ్చాను అవన్నీ వెంట తీసుకొని వస్తానా అని మహా కోపంగా మాట్లాడుతుంది. కూల్ మహా ఇక్కడ కూడా ఫోటో తీసుకోవచ్చని హారిక అంటుంది. నాకు తెలిసిన ఫోన్ షాప్ ఉందని చక్రి ఎంట్రీ ఇస్తాడు. తనని తీసుకొని వెళ్ళమని హారిక చెప్తుంది. మహాని తీసుకొని చక్రి వెళ్తాడు. దారిలో తన మాటలతో మహాని చక్రి ఇర్రిటేట్ చేస్తాడు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదా మేడమ్ అని అడుగుతాడు. అదంతా నీకు ఎందుకని మహా అంటుంది. వాళ్ళు అయిన అర్థం చేసుకోలేదు వీడు అర్థం చేసుకున్నాడని మహా అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Balakrishna: మళ్ళీ సింగర్ గా మారిన బాలయ్య.. ఏ సినిమా కోసమో తెలుసా..?

Publish Date:Dec 23, 2025

  నటసింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) అప్పుడప్పుడు సినిమా వేడుకల్లో పాటలు పాడి అభిమానుల్లో జోష్ నింపుతూ ఉంటారు. అలాగే 'పైసా వసూల్' సినిమాలో 'మామ ఏక్ పెగ్ లా' అనే సాంగ్ పాడి మెప్పించారు. ఇక ఇప్పుడు ఆయన మరోసారి ఓ సినిమా కోసం గాయకుడిగా మారుతున్నట్లు తెలుస్తోంది.   అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ-2 .. ఇలా వరుసగా ఐదు 100 కోట్ల గ్రాస్ సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నారు బాలకృష్ణ. తన తదుపరి సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 111వ సినిమాగా రూపొందుతోన్న ఈ ప్రాజెక్ట్ కి 'NBK111' అనేది వర్కింగ్ టైటిల్. వృద్ధి సినిమాస్ నిర్మిస్తున్న ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్.   అనౌన్స్ మెంట్ తోనే 'NBK111'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళే న్యూస్ వినిపిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా కోసం బాలకృష్ణ సింగర్ గా మారుతున్నట్లు సమాచారం. ఈ సాంగ్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట. ఆ సాంగ్ కి బాలయ్య వాయిస్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మూవీ టీం అడగగా.. ఆయన ఓకే చెప్పినట్లు వినికిడి.   Also Read: అప్పుడు ఎన్టీఆర్.. ఇప్పుడు చిరంజీవి.. నిజమేనా..?   అసలే బాలకృష్ణ సినిమా అంటే తమన్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో తెలిసిందే. అలాంటిది స్వయంగా బాలయ్యనే సింగర్ గా మారితే.. ఇక తమన్ మ్యూజిక్ ఏ రేంజ్ లో ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.  

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969