English | Telugu

Psych Siddhartha: సైక్ సిద్దార్ధ మూవీ రివ్యూ

Publish Date:Dec 31, 2025

        సినిమా పేరు: సైక్ సిద్దార్ధ  న‌టీన‌టులు: శ్రీ నందు, యామిని భాస్కర్,ప్రియాంక రెబెకా, సింహ, సుఖేష్ రెడ్డి    త‌దిత‌రులు సినిమాటోగ్ర‌ఫీ: ప్రకాష్ రెడ్డి. కె  ఎడిట‌ర్‌: ప్రతీక్  సంగీతం: స్మరన్ సాయి   నిర్మాత‌లు: రానా దగ్గుబాటి, శ్రీ నందు, శ్యామ్ సుందర్ రెడ్డి  బ్యానర్స్: స్పిరిట్ మీడియా, నందు నెస్, సురేష్ ప్రొడక్షన్స్  రిలీజ్: ఏషియన్ సురేష్  ఎంటర్ టైన్ మెంట్స్   రచన, ద‌ర్శ‌క‌త్వం: వరుణ్ రెడ్డి  రిలీజ్ డేట్ : జనవరి 1 ,2025        శ్రీ నందు(Shree Nandu)తన సెకండ్ ఇన్నింగ్స్ లో  రీసెంట్ గా దండోరా తో వచ్చి తన పెర్ ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసాడు. ఇప్పుడు సోలో హీరోగా 'సైక్ సిద్దార్ధ'(Psych Siddhartha) తో వరల్డ్ వైడ్ గా అడుగుపెట్టాడు. రానా దగ్గుబాటి రిలీజ్ చేయడం, నందు కూడా ఒక నిర్మాతగా వ్యవహరించడం ఈ చిత్రం స్పెషాలిటీ. ప్రీమియర్స్ కూడా ప్రదర్శించారు. మరి మూవీ ఎలా  ఉందో చూద్దాం.     కథ సిద్దార్ధ( నందు), త్రిష( ప్రియాంక రెబకా) ఒకరికొకరు ఇష్టపడతారు.ఇద్దరు శారీరకంగా కూడా చాలా సార్లు కలుస్తారు. కానీ త్రిష ఆ తర్వాత మన్సూర్ (సుఖేష్ రెడ్డి)  అనే బిజినెస్ మెన్ ని ఇష్టపడి పెళ్ళికి సిద్దమవుతుంది. శ్రావ్య( యామిని భాస్కర్) భరత నాట్యంలో ప్రావీణ్యురాలు. భర్త వేధింపులు ఎక్కువ కావడంతో తన ఎనిమిదేళ్ల వయసు ఉన్న కొడుకు రిషితో కలిసి వేరేగా ఉంటు ఉంటుంది. రేవంత్(సింహ) తన భార్య దగ్గర డబ్బులు తీసుకొని సిద్దార్ధ కి అప్పుగా ఇస్తాడు. అందుకు కారణం చిన్నప్పట్నుంచి సిద్దార్ధ, రేవంత్ లు ప్రాణస్నేహితులు.  ఈ ఆరుగురు చుట్టూ అల్లుకున్న అవసరాలు, కారణాలు,  ప్రేమలు, పంతాలు, ఆప్యాయత, అమాయకత్వాల నేపధ్యమే సైక్ సిద్దార్ధ.   ఎనాలసిస్    ఇలాంటి కథలు సెల్యులాయిడ్ పై చాలానే వచ్చాయి. డిజె టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలే ఒక ఉదాహరణ. కాకపోతే కొత్త తరహా దర్శకత్వం, ఫొటోగ్రఫీ, నందుతో సహా మిగతా   ఆర్టిసుల నాచురల్ పెర్ ఫార్మెన్స్, సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొత్త తరహా స్క్రీన్ ప్లే సైక్ సిద్దార్ధ ని బోర్ కొట్టకుండా చేసాయి. కొన్ని అసభ్య సన్నివేశాలు ఉన్నా చాలా చిత్రాల్లో వస్తు ఉన్నవే. ఫస్ట్ హాఫ్ ఓపెన్ చేస్తే ప్రారంభ సన్నివేశమే కొత్తగా ఉంది. దీంతో సిద్దార్ధ తో కనెక్ట్ అవుతాం.     ఆ తర్వాత రేవంత్, సిద్దార్ధ్ మధ్య వచ్చిన సన్నివేశాలు బాగున్నా, నవ్వుని మాత్రం పెద్దగా తెప్పించలేకపోయాయి.అసలు మూవీ మొత్తం  ఎంటర్ టైన్ మెంట్ ని బాగా సృష్టించవచ్చు. ఆ స్కోప్ గా కూడా ఉంది. కాకపోతే మేకర్స్ ఆ దిశగా దృష్టి పెట్టలేదు.కొన్ని క్యారెక్టర్స్ పైన మాత్రమే మూవీ మొత్తాన్ని నడిపించారు.  త్రిష, సిద్దార్ధ మధ్య వచ్చే రొమాన్స్ సన్నివేశాలు అయితే పీక్ లో ఉండటంతో పాటు, మోడరన్ తిరుగుళ్ళకి అలవాటు పడ్డ  కొంత మంది అమ్మాయిలు డబ్బు, హోదాకి, శారీరక సుఖానికి తప్ప స్వచ్ఛమైన ప్రేమకి విలువ ఇవ్వరని చెప్పినట్లయింది.     శ్రావ్య క్యారక్టర్ ద్వారా మాత్రం ఆడవాళ్ళ ఆత్మభిమానాన్ని, కసాయి భర్త పెట్టే ఇబ్బందుల నుంచి తప్పించుకొని, తమ మనసు ఒక మంచి వ్యకి కోసం ఎలా ఎదురుచూస్తుందో చెప్పినట్లయింది. సిద్దార్ధ,మన్సూర్ మధ్య వచ్చే సీన్స్ కూడా బాగున్నాయి.ఇంటర్ వెల్ సన్నివేశం పెద్దగా పేలింది ఏమి లేదు. ఇక సెకండ్ హాఫ్ ఎలా ఉండబోతుందో    ముందుగానే ఊహిస్తాం. కాకపోతే ప్రారంభంలోనే చెప్పుకున్నట్టుగా డిఫెరెంట్ స్క్రీన్ ప్లే తో పాటు క్యారక్టర్ డిజైన్స్  బాగుండటంతో చూస్తూ ఉండిపోతాం. సిద్దార్ధ, శ్రావ్య, రిషి మధ్య వచ్చే సీన్స్ అయితే  చాలా బాగున్నాయి. స్వచ్ఛమైన ప్రేమకి, శీలానికి సంబంధం ఉండదని చెప్పినట్లయింది. ఇలాంటి ప్రేమలు బయట సొసైటీ లో చాలానే జరుగుతున్నాయి. దాంతో నిజమైన క్యారెక్టర్స్ ని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది.     స్కూల్ సన్నివేశాలు మాత్రం  ఈ కథకి అవసరం లేదు. సిద్దార్ధ్ చేసే పెయింటింగ్ పని కి సంబంధించి కాంట్రాక్టు రావడం కోసం స్కూల్ సన్నివేశాలు ఎస్టాబ్లిష్ చేసి ఉండవచ్చు. కానీ సిద్దార్ధ పెయింట్ కాంట్రాక్టు, మన్సూర్ ఆఫీస్ కి సంబంధించినది అయ్యి ఉంటే  కావాల్సినంత ఫన్ వచ్చేది. ఎందుకంటే  మన్సూర్ తో ఉండి కూడా త్రిష నిన్ను మర్చిపోలేకపోతున్నానని సిద్దార్ధ ని  కలవడానికి వస్తుంది.కాబట్టి  సిద్దార్ధ పెయింటింగ్ కాంట్రాక్టు మన్సూర్ ఆఫీస్ కి షిఫ్ట్ చేసి ఉండాల్సింది. ఇక్కడే కావాల్సినంత ఫన్ ని జనరేట్ చేసుకొనే అవకాశం ఉండేది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ మాత్రం బాగున్నాయి.       నటీనటులు, సాంకేతిక నిపుణుల పని తీరు      సిద్దార్ధ గా నందు పెర్ ఫార్మెన్స్ ఒక రేంజ్ లో సాగింది. అన్ని వేరియేషన్స్ లోను ఎవరు ఎలాంటి  వంక పెట్టని విధంగా  అద్భుతంగా చేసి మరో సారి సిల్వర్ స్క్రీన్ పై బెస్ట్ పెర్ఫార్మ్ ని ప్రదర్శించాడు. ఈ మూవీ తర్వాత నందు సినీ డైరీ బిజీ అవుతుందేమో చూడాలి. ఇక  శ్రావ్య క్యారక్టర్ లో యామిని భాస్కర్(Yamini Bhaskar)కూడా సూపర్ గా చేసింది. అసలు ఆ క్యారక్టర్ తన కోసమే పుట్టిందా అనేలా మెస్మరైజ్ చేసింది. త్రిష గా చేసిన ప్రియాంక(Priyanka Rebekah)కూడా అంతే మేకర్స్ తన క్యారక్టర్ ని ఏ పర్పస్ కోసం అయితే సృష్టించారో, ఆ ప్రకారం తన వంతు న్యాయం చేసింది. సిద్దార్ధ ఫ్రెండ్ గా చేసిన సింహ, త్రిష మరో లవర్ గా చేసినా సుఖేందర్ రెడ్డి కూడా అద్భుతమైన పెర్ఫార్మ్ ఇచ్చారు.ఇక దర్శక రచయిత వరుణ్ రెడ్డి(Varun Reddy)గురించి చెప్పుకోవాలంటే ఒక మాములు కథని తన అద్భుతమైన డైరెక్షన్ తో  కట్టిపడేసాడు. ఒక కొత్త రకమైన టేకింగ్ ని కూడా చిత్ర సీమకి పరిచయం చేసినట్లయింది. రచయితగా మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. నిర్మాణ విలువలు కథకి తగ్గ విధంగా  బాగున్నాయి. సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, ఫొటోగ్రఫీ అయితే ఒక లెవల్. ఆ రెండు ఈ చిత్రానికి మరో ప్రాణంగా నిలిచాయి.       ఫైనల్ గా చెప్పాలంటే ఇలాంటి చిత్రాలు సెల్యులాయిడ్ పై గతంలో చాలా వచ్చినా కూడా కథ నడిచిన విధానం, దర్శకత్వం, మ్యూజిక్, ఫొటోగ్రఫీ, నందుతో పాటు మిగతా ఆర్టిస్టుల పెర్  ఫార్మెన్స్ సైక్ సిద్దార్ధ ని చూస్తున్నంత సేపు బోర్ కొట్టకుండా చేసాయి. ఫన్ గ్యారంటీ.   రేటింగ్ 2 .5 /5                                                                                                                                                                                అరుణాచలం   

Psych Siddhartha Movie Review

Publish Date:Dec 31, 2025

Cast: Shree Nandu, Yamini Bhaskar, Narasimha S, Priyanka Rebekah Srinivas, Sukesh, Wadekar Narsing, Bobby Ratakonda, Sakshi Atree Chaturvedi, Mounika, Pradyumna Billuri Crew: DOP: K Prakash Reddy Editor: Prateek Nuti Additional Screenplay: Shree Nandu Music Director : Smaran Sai Writer & Director: Varun Reddy Producers: Shree Nandu, Shyam Sunder Reddy Thudi Shree Nandu has stated several times that he had been struggling for 19 years to find his success as a leading man. Now, with Psych Siddhartha, he has decided to try a completely whacky and out-of-box movie to attract Gen-Z. The movie is distributed by Spirit Media and Suresh Productions and the teasers, trailer has earned it good buzz. How is the movie? Will the New Year begin with a bang for Telugu Cinema? Read further to know.    Plot:  Siddhartha (Shree Nandu) has lost 3 crores of investment to Mansoor and his girlfriend Trisha. He is living on roads and in a basti unable to pay rents. He runs a fraud case on Mansoor and his friend Revanth tries to make him accept a settlement. Trisha keeps swinging between Siddhartha and Mansoor, while Mansoor is planning to propose to her. In this washed out state, Siddhartha meets a dancer Sharvya (Yamini Bhaskar) who is abused by her husband and has a son. What all twists and turns his life will take at this juncture, watch the movie to know more.  Analysis:  Nandu shed all his inhibitions for the film and tried to do his best for the role. Trying to be a person who is extremely innocent to the level of being dangerously naive, he played the character well. He gave it everything without restricting himself. Yamini Bhaskar is cute and very apt for this role. Sadly, other actors did not look perfect for their roles.  Most of them looked like they did not get the character or the kind of skill to make the scene more real. Even random editing patterns that try to go back and forth at times give jarring feel rather than the whacky comic mode that the makers hoped to set. While some laugh out loud moments to shine, the regularity of these moments is very low and even the story is very predictable.  The makers have decided to overcome the predictability factor by using Siddhartha's character but the lack of proper back story except for a certain situation tends to take us away from connecting with him too. Sometimes it feels like they are trying too hard to sell the whacky gig when it is not required or not present. The director has tried to give us an internal feeling of how it is to be in Siddhartha's brain and how he is totally damaged looking at his life like a game.  So, the new lease of life that he is able to find after a long struggle makes him even more desperate to hold it together but he is unable to due to his old patterns which needs to overcome. Such writing needs even more depth even in whacky scenes and ideas.   While the movie looks to have been made with restrictions and trying to make it look cool and new-age, the character writing lacked the real depth and there is more shallowness to the gigs too. Having said that the moments that work might entertain the limited set of audiences that this movie aims to touch.  Bottomline:  The movie has a very limited appeal and high usage of abusive language. Not a recommendation but might attract audiences it targets.  Rating: 2.5/5  Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.

ఆ విషయంలో నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి.. ఆలోచించండి!

Publish Date:Dec 31, 2025

(డిసెంబర్‌ 31 ఆర్‌.నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా..) ‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరు.. భర్తగ మారకు బ్యాచ్‌లరు..’, ‘వద్దుర సోదరా.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా..’.. ఇది కొంతమంది మగవారి నిశ్చితాభిప్రాయం. దానికి తగ్గట్టుగానే ఎంత వయసు వచ్చినా బ్యాచ్‌లర్‌ లైఫ్‌నే లీడ్‌ చేస్తున్నారు. మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల ఇప్పటి యూత్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న మాట వాస్తవం. కానీ, 50 ఏళ్ల క్రితమే పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి పెళ్లి వద్దు, భార్య వద్దు అని భీష్మించుకొని కూర్చున్నారు. 70 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ బ్యాచ్‌లర్‌గానే కొనసాగుతున్నారు. అయితే కొన్నేళ్ల క్రితమే ఆయన ఈ విషయంలో రియలైజ్‌ అయ్యారు. పెళ్లి చేసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి తెలుసుకున్నారు. తను పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల గురించి ప్రస్తావించారు ఆర్‌.నారాయణమూర్తి.    ‘నేను ఒక సాధారణ వ్యక్తిని. సింపుల్‌గా ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. సింపుల్‌గా ఉండడంలోనే నాకు ఆనందం ఉంది. ఇల్లు, కారు అంటూ సొంత ఆస్తులు కూడబెట్టకూడదు అనేది చిన్నతనం నుంచి నాకు ఉన్న ఆలోచన. మా సినిమా వాళ్లకి చాలామందికి ఇళ్లు ఇచ్చారు. నన్ను కూడా తీసుకోమని చెప్పారు. కానీ, నేను తీసుకోలేదు.    ఇక పెళ్లి విషయానికి వస్తే.. నా జీవితంలోనూ ఒక ప్రేమ కథ ఉంది. చదువుకునే రోజుల్లోనే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెళ్లి విషయం మాట్లాడేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లినపుడు తెలిసింది. వాళ్లు చాలా డబ్బున్నవారు. వాళ్ల స్థాయి వేరు, నా స్థితి వేరు. ఇద్దరికీ పొసగదు అనే నిర్ణయం తీసుకొని ఆ క్షణమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం విని ఆ అమ్మాయి చాలా బాధపడిరది. అయినా నేను నా నిర్ణయం మార్చుకోలేదు. అంతేకాదు, అప్పటి నుంచి ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాను.   సినిమాల్లో తెలియకుండానే కాలం గడిచిపోయింది. 50 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకోలేదన్న బాధ మొదలైంది. ఎందుకిలా చేశాను అనిపించింది. నాకంటూ ఒక మనిషి, ఒక ఇల్లు ఉంటే బాగుండేది అనుకున్నాను. పెళ్లి, ఇల్లు లేకుండా ఇప్పటివరకు నా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాను. దీని గురించి ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు రెండు పక్షులు ఎగురుకుంటూ గూటిలోకి వెళ్ళడం చూశాను. జంటగా ఉండడం అనేది ప్రకృతి ధర్మం. ప్రతి మనిషికి తోడు, నీడ చాలా అవసరం. అది నా స్వానుభవంతో తెలుసుకున్నాను.    పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్స్‌గా ఉండిపోవాలనే ఆలోచన కొంతమంది కుర్రాళ్లలో కూడా ఉంది. కానీ, దాన్ని పక్కన పెట్టండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. ఇల్లు కట్టుకోండి. కార్లు కొనుక్కోండి. లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యండి. హాయిగా ఉండండి. నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి. నా అనుభవంతో చెబుతున్నాను’ అంటూ నేటి యువతకు సందేశాన్ని ఇచ్చారు ఆర్‌.నారాయణమూర్తి. 

సల్మాన్ ఖాన్ మూవీపై చైనా ఆగ్రహం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సల్మాన్  డైలాగులు 

Publish Date:Dec 30, 2025

    -ఎందుకు అంత అక్కసు  -ఏముంది ఆ మూవీలో  -చైనా మీడియా ఏం చెప్తుంది -సల్మాన్ ఏం చెప్పాడు       సికిందర్ పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని లక్ష్యంతో తన కట్ అవుట్ కి తగ్గ మూవీ' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'(Battle of galwan)తో సల్మాన్ ఖాన్(Salman Khan)ముస్తాబు అవుతున్నాడు. చైనా, మన దేశానికి మధ్య గల్వాన్(Galwan)నది హద్దు విషయంలో 2020 జూన్ 16 న జరిగిన యుద్దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతుంది. అప్పట్లో ఆ పోరాటంలో మన సైనికులు ఇరవై మంది వరకు చనిపోయారు. రీసెంట్ గా మొన్న 27 న జరిగిన సల్మాన్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' నుంచి టీజర్ రిలీజ్ చేసారు.సదరు టీజర్ లో సల్మాన్ నుంచి వచ్చిన చావుకి ఎందుకు భయపడతారు, అది అనివార్యం అనే డైలాగ్ తో పాటు మరిన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై తమ అక్కసుని ప్రదర్శిస్తుంది.       అంతర్జాతీయ సమాజాన్ని తప్పు దోవ పట్టించి చైనా పై వ్యతిరేకతని రెచ్చగొట్టేందుకు భారత్ చరిత్రని వక్రీకరిస్తుంది. గల్వాన్ లో ఘర్షణలకి భారత్ నే కారణం. భారత దళాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొరబడి దాడి చేసాయి.  బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం జాతీయ వాదంతో కూడిన మెలోడ్రామా అని గ్లోబల్ టైమ్స్ లో  రాసుకొచ్చింది. చైనా సైనిక నిపుణుడు  సాంగ్ జాంగ్ పింగ్ కూడా మాట్లాడుతు 'చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకోవాలనుకునే మా సైనికుల దృఢ సంకల్పాన్ని మా సైనికులు కోల్పోరు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.       Also read:  కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే      గల్వాన్ నది చైనా పాలనలో ఉన్న వివాదాస్పద 'అక్సాయ్ చిన్' ప్రాంతం నుండి భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రవహిస్తుంది . ఇది కారకోరం శ్రేణికి తూర్పు వైపున ఉన్న సామ్‌జుంగ్లింగ్ యొక్క కారవాన్ క్యాంపింగ్ గ్రౌండ్ సమీపంలో ఉద్భవించి పశ్చిమాన ప్రవహించి ష్యోక్ నదిలో కలుస్తుంది . సంగమ స్థానం దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణంగా 102 కి.మీ దూరంలో ఉంది. ష్యోక్ నది సింధు నదికి ఉపనది , గల్వాన్‌ను సింధు నది వ్యవస్థలో భాగం చేస్తుంది. ఈ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఎప్పట్నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇక బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కి అపూర్వ లఖియా(Apoorva Lakhia)దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సొంతంగా నిర్మిస్తున్నాడు. చిత్రాంగద కధానాయిక.  

శంకర్ దాదా మూవీ డైలాగ్స్ తో అలరించిన అనిల్ రావిపూడి

Publish Date:Dec 31, 2025

  సరిగమప లిటిల్ చాంప్స్ ప్రతీ వారం పిల్లల పాటలతో పాటు అనిల్ రావిపూడి, అనంత్ శ్రీరామ్ డైలాగ్స్ తో ఆడియన్స్ ఫుల్ ఛిల్ల్ అవుతున్నారు. ఈ వారం వాళ్ళు శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీలో చిరంజీవి వాకింగ్ మూవ్మెంట్ ని స్పూఫ్ గా చేశారు. ఫన్నీ డైలాగ్స్ లో అలరించారు.    "లింగం అంకుల్ స్వీట్ పొటాటోలో స్వీట్ ఉంటుంది కానీ బాటిల్ గార్డ్ లో బాటిల్ ఉండదు అని అర్ధం " అంటూ అనిల్ రావిపూడి చెప్పిన డైలాగ్ కి అనంత శ్రీరామ్ ఫుల్ ఫ్రస్ట్రేట్ ఐపోయాడు. నెత్తి మీద హాట్ ప్యాక్ పెట్టుకుని పిచ్చిపిచ్చిగా నవ్వుతూ ఉన్నాడు. సుధీర్ ఆయన నవ్వును చూసి "ఏమైందన్న" అని అడిగాడు. "దాన్ని లాఫింగ్ సైకో ఫోబియా" అంటారు అని చెప్పాడు అనిల్ రావిపూడి.  "పానీపూరి లో పానీ ఉంటుంది కానీ బటర్ ఫ్లైలో బటర్ ఉండదు" అంటూ ఇంకో డైలాగ్ వేసాడు. ఈ డైలాగ్స్ ని అనంత శ్రీరామ్ ఒక రకంగా డాన్స్ చేసేసరికి "ఏమన్నా పట్టుకుందా ఏమిటి గట్లా తిరుగుతుండు" అని సుధీర్ అడిగాడు. దానికి అనిల్ రావిపూడి "దాన్ని డ్యాన్సో స్కెరో ఫోబియా" అంటూ చెప్పేసరికి ఆడియన్స్ అంతా నవ్వేశారు. "అంటే ఏంటన్నా" అని సుధీర్ అడిగేసరికి "నాకు తెలిసినవే రెండు ముక్కలు నన్ను మళ్ళీ మళ్ళీ అడక్కురా" అన్నాడు అనిల్ రావిపూడి.    ఇక ఈ షోకి "సహకుటుంబానాం" మూవీ టీమ్, అలాగే "నయనం" టీమ్ వచ్చారు. హీరో వరుణ్ సందేశ్ పాటలు పాడి జడ్జెస్ ని ఇంప్రెస్ చేశారు.  

రామ్ చరణ్ డైరెక్టర్ తో దుల్కర్ సల్మాన్ మూవీ!

Publish Date:Dec 31, 2025

  మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం తెలుగులో 'ఆకాశంలో ఒక తార'తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ఫిల్మ్ చేయడానికి దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు.   ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది.. రెండో సినిమాకే రామ్ చరణ్ తో 'రచ్చ' చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దుల్కర్ ని డైరెక్ట్ చేయనున్నాడట.   ఇప్పటికే దుల్కర్ సల్మాన్, సంపత్ నంది మధ్య కథా చర్చలు జరిగాయని.. సంపత్ చెప్పిన స్టోరీ లైన్ కి దుల్కర్ ఇంప్రెస్ అయ్యాడని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969