English | Telugu

కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే 

Publish Date:Dec 30, 2025

        -పేరు ఏంటో తెలుసా! -ఖచ్చితంగా ఆ నటుడే  -ఫస్ట్ సినిమా ఎవరితో       'ఎవడు కొడితే మైండ్ దిమ్మ తిరిగి బ్లాంక్ అవుతుందో వాడే పండుగాడు' అని పోకిరిలో మహేష్ బాబు(Mahesh Babu)చెప్పిన  డైలాగ్ ని కొంచం అటు ఇటుగా మార్చేసి 'ఎవడు మాట్లాడితే మాట తూటాలా పేలుతుందో ఆయనే బండ్ల' అని బండ్ల గణేష్(Bandla Ganesh)కి అన్వయించుకోవచ్చు. అంతలా నిఖార్సయిన తన మాటల తూటాలతో తనకంటూ ఒక బ్రాండ్ ని క్రియేట్ చేసుకున్నాడు. నటుడుగా, నిర్మాతగా కంటే తన మాటలకే ఎక్కువ మంది అభిమానులని సంపాదించుకున్నాడన్నా కూడా అతిశయోక్తి కాదు. ఈ విషయంలో ఎవరకి ఎలాంటి డౌట్స్ ఉన్నా బండ్ల గణేష్ స్పీచ్ తాలూకు వ్యూస్ ని చూడవచ్చు.     బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ క్రియేషన్స్ పై పవన్ కళ్యాణ్(Pawan Kalyan),ఎన్టీఆర్(Ntr)రామ్ చరణ్(Ram Charan),అల్లు అర్జున్(Allu Arjun),రవితేజ(Raviteja) వంటి స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించి అనతి కాలంలోనే అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. కానీ  2015 లో వచ్చిన టెంపర్ తర్వాత ఏ మూవీని నిర్మించలేదు. కానీ ఇప్పుడు రీసెంట్ గా BG బ్లాక్ బస్టర్స్(BG Blockbustersఅనే సరికొత్త బ్యానర్ ని ఏర్పాటు చేసాడు. ఈ మేరకు అధికారకంగా ప్రకటిస్తు లోగోని విడుదల చేసాడు. ఈ బ్యానర్ ద్వారా హృదయాలను తాకే కథలు, ఎమోషనల్ స్టోరీలు, కొత్త టాలెంట్‌కు అవకాశం ఇస్తూ సినిమాలు నిర్మిస్తానని ఎక్స్ వేదికగా తెలిపాడు. BG అంటే  Bandla ganesh అనే అర్ధం తెలిసిందే.     Also read:   జననయగాన్ రికార్డుని ఎవరైనా బద్దలు కొట్టగలరా!.. ఉంటే ఎవరు        కొంత కాలం నుంచి చాలా ఇంటర్వూస్ లో బండ్ల గణేష్ మాట్లాడుతు మళ్ళీ సినిమాలు నిర్మించి తన సత్తా చాటుతానని చెప్తూ వస్తున్నాడు. దీంతో చెప్పిన మాట ప్రకారం సినిమాలు నిర్మించే పనిలో పడ్డాడు. కాకపోతే బ్యానర్ పేరు మార్చడం చర్చినీయాంశ మయ్యింది. ఏది ఏమైనా అభిమానులతో పాటు ప్రేక్షకులు గణేష్ రీ ఎంట్రీ కి సోషల్ మీడియా వేదికగా వెల్ కమ్ చెప్తున్నారు. మరి ఫస్ట్ మూవీ ఎవరితో ఉంటుందో చూడాలి.        

Anil Ravipudi expresses his Gratitude to Prabhas

Publish Date:Dec 30, 2025

Director Anil Ravipudi has shared his heartfelt appreciation for Pan-India star Prabhas following a recent display of professional camaraderie. Ravipudi, who is currently gearing up for the highly anticipated Sankranti 2026 release of Mana Shankara Vara Prasad Garu starring Megastar Chiranjeevi, spoke to the press during a visit to the Vijayawada Durga Temple. The director’s comments come in response to Prabhas’ recent remarks at an event for The Raja Saab. Addressing the potential box-office overlap between the two films, Prabhas urged fans not to view the situation as a "clash," emphasizing that younger stars naturally follow the path set by seniors.  He encouraged audiences to celebrate both films as a collective win for the industry. Anil praised the gesture, noting that a star of Prabhas’ stature had no obligation to address the matter so graciously. "He is truly a 'darling' with no ego," Ravipudi remarked, praising his attitude and respectable nature.  Produced by Sahu Garapati and Sushmita Konidela, Mana Shankara Vara Prasad Garu, which features an extended cameo by Victory Venkatesh, is scheduled to hit theaters on January 12th. Nayanthara is playing the leading lady role in this film. Meesala Pilla song from the film has hit 100 Million views, recently. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

పారితోషికం విషయంలో మహానటి సావిత్రి అలా ఎందుకు చేశారో తెలుసా?

Publish Date:Dec 26, 2025

(డిసెంబర్‌ 26 మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ మహానటిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సావిత్రి. సౌమ్యురాలిగా, దానశీలిగా, ప్రేమమూర్తిగా పేరు తెచ్చుకున్న ఆమె  జీవితంలో ఎన్నో వెలుగు నీడలు ఉన్నాయి. తన మంచితనంతో ఎంత పేరు తెచ్చుకున్నారో, కొన్ని సందర్భాల్లో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పాతాళభైరవి చిత్రంలో తొలిసారి ఒక డాన్సర్‌గా కనిపించిన సావిత్రి.. ఆ తర్వాత పెళ్లిచేసి చూడు, పల్లెటూరుతోపాటు కొన్ని తమిళ సినిమాల్లో మంచి పాత్రలు పోషించి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన దేవదాసు చిత్రం ఆమె కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలోనే పారితోషికానికి సంబంధించి ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక పత్రికలో 'నిర్మాతలకు హెచ్చరిక' పేరుతో ఒక ఆర్టికల్‌ కూడా వచ్చింది. దాని సారాంశం ఇది. నిన్న మొన్నటి వరకు సినిమాకు 300 తీసుకొని నటించిన సావిత్రి ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకు 20,000 రూపాయలు డిమాండ్‌ చేస్తోందని, ఇది నిర్మాతల శ్రేయస్సుకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. అప్పటివరకు సావిత్రి నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదని, అలాంటప్పుడు ఆమె అడిగినంత పారితోషికం ముట్టచెప్పి అనవసరంగా ఆమె వేల్యూని పెంచేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  పత్రికలో ఈ ఆర్టికల్‌ వచ్చేనాటికి చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత బాగాలేదు. మంచి కథని ఎంపిక చేసుకొని సినిమా విజయం సాధించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండేది కాదు.  కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆరోజుల్లో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న ఎవిఎం, జెమిని వంటి సంస్థలకు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు చిత్ర పరిశ్రమ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోవడానికి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు కూడా ఒక కారణమనే అభిప్రాయం ఆరోజుల్లోనే.. అంటే 60 ఏళ్ళ క్రితమే ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా సావిత్రిని టార్గెట్‌ చేశారు నిర్మాతలు. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారంటూ పత్రికలు కథనాలు రాశాయి. సావిత్రి సినిమా రంగంలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, అవకాశాల కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవారో ఆమె పెదనాన్న చౌదరిగారు గుర్తు తెచ్చుకోవాలంటూ సూచించారు.  తారాపథంలో ఎదిగిన తర్వాత తాము ఇండిస్టీలోకి ఎలా అడుగు పెట్టాము, దాని కోసం ఎన్ని మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చింది అనే విషయాలను తారలు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా తాము ప్రస్తుతం ఉన్న స్థితి గురించి మాత్రమే ఆలోచించడం చిత్ర పరిశ్రమకు శ్రేయస్కరం కాదు. ఉన్నఫళంగా పారితోషికం పెంచేయడం అనేది ఎవ్వరికీ క్షేమదాయకం కాదు. చేసిన దానికి తగిన ప్రతిఫలం తీసుకుంటూ క్రమంగా ఎదగడం తారలకు ఎంతో అవసరం. అలా ముందుకెళితేనే నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనం అప్పట్లో చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే ఇప్పటివరకు సావిత్రి తీసుకునే పారితోషికానికి సంబంధించి ఇలాంటి వివాదం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.

కల్కిని క్రాస్ చేసిన 'ధురంధర్'.. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఆర్ఆర్!

Publish Date:Dec 29, 2025

  స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. మూడు వారాల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. 24 రోజుల్లో రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.   'ధురంధర్'ని నిర్మించిన జియో స్టూడియోస్.. ఈ మూవీ 24 రోజుల్లో రూ.1100.23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది. ఇందులో ఇండియా కలెక్షన్స్ రూ.862.23 కోట్లు కాగా, ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.238 కోట్లు.   'ధురంధర్' జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. న్యూ ఇయర్ హాలిడే కూడా కలిసొచ్చి, ఐదో వారాంతానికి రూ.1200 కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది.   Also Read: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!   ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'ధురంధర్' నిలిచింది. ఛావా, కాంతార చాప్టర్-1 సినిమాలను దాటుకొని ఈ ఫీట్ సాధించడం విశేషం.   ఓవరాల్ గా చూస్తే.. కల్కి, పఠాన్ సినిమాలను దాటుకొని.. అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో ఏడో స్థానంలో నిలిచింది. త్వరలో రూ.1200 కోట్లతో ఐదో స్థానంలో ఉన్న కేజీఎఫ్-2 ని, రూ.1300 కోట్లతో నాల్గో స్థానంలో ఉన్న ఆర్ఆర్ఆర్ ని కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు.    

BB Jodi: ఫ్లవర్ బ్యాచ్ అనడంతో కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక!

Publish Date:Dec 30, 2025

  బిబి జోడి సీజన్ 2 ఫుల్ జోష్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఐతే ఈ వీక్ జోడీస్ మధ్యన హోస్ట్ ప్రదీప్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఫ్లవర్ అండ్ ఫైర్ అనే ఒక బోర్డుని పెట్టించాడు. "ఎవరు తమ తమ జోడీలకు గట్టి పోటీ ఇస్తారనుకుంటున్నారు ఎవరు ఇవ్వరు అనుకుంటున్నారు" అంటూ ఆ పిక్స్ ని ఆ బోర్డు మీద పెట్టమన్నాడు. దాంతో జోడీస్ అంతా వచ్చారు. అన్ని జోడీలకు గట్టి పోటీ ఇచ్చేది మానస్ అండ్ శ్రష్టి జోడి అంటూ వోట్ చేశారు. ఇక జోడీ కాదు ఫ్లవర్ బ్యాచ్ అంటూ ప్రియాంక సింగ్ - మణికంఠ జోడిని ఫ్లవర్ లో వాళ్ళ పిక్స్ ని పెట్టారు. దాంతో ప్రియాంక ఏడ్చేసింది.    ఇక జడ్జెస్ ప్రియాంక బాధను చూసి మోటివేట్ చేశారు. ఫ్లవర్ లో పిక్ పెట్టినంత మాత్రాన వాళ్లకు డాన్స్ రాదనీ కాదు ఫైర్ లో పిక్స్ పోస్ట్ చేసినంత మాత్రాన వాళ్ళు బెస్ట్ డాన్సర్స్ అని కాదు. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటే ఫ్లవర్ కాస్త ఫైర్ లా మారొచ్చు అదే కష్టపడకపోతే ఫైర్ లో ఉన్నవాళ్లు కూడా ఫ్లవర్ లా కూడా మారొచ్చు అంటూ జోడీస్ అందరికీ జడ్జెస్ బెస్ట్ విషెస్ చెప్పారు.    ప్రియాంక నువ్వు ఏడవాల్సిన పనే లేదు. కాన్ఫిడెంట్ గా ఉండు హ్యాపీగా ఉండు జర్నీ ఒక్కటే ఇంపార్టెంట్ అవుట్ కం ఏదైనా కానీ అంటూ సదా కూడా ప్రియాంకకు చెప్పింది. ఫైర్ జోడీగా మానస్ - శ్రష్టి వర్మ జోడికి మూడు ఓట్లు, ఫ్లవర్ జోడీగా ప్రియాంక సింగ్ - మణికంఠకు ఐదు ఓట్లు పడ్డాయి. దాంతో ప్రియాంక మొదట కొంచెం బాధపడినా తర్వాత సద, శేఖర్ మాష్టర్ మాటలకూ ఊరుకుంది.  

విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!

Publish Date:Dec 29, 2025

  కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్ లో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.   విజయ్, రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుందట. ఈ విషయాన్ని విజయ్, రష్మిక త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఫ్యాన్స్ కి వారిచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనని అంటున్నారు.   Also Read: 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్.. మారుతి ఇలా చేస్తాడని ఊహించలేదు!   2018లో విడుదలైన గీత గోవిందం, 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఫెస్టివల్స్ కలిసి జరుపుకోవడం, సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్ళడం వంటివి చేశారు. ఇక ఇటీవల అక్టోబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగిందని, రానున్న ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని న్యూస్ వినిపిస్తోంది.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969