English | Telugu

ఆ స్టార్ హీరోకి సిస్టర్ గా మృణాల్ ఠాకూర్!

Publish Date:Dec 22, 2025

  'సీతారామం', 'హాయ్ నాన్న' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది మృణాల్ ఠాకూర్(Mrunal Thakur). ప్రస్తుతం 'డెకాయిట్' అనే సినిమా చేస్తోంది. ఇది 2026 మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగులో హీరోయిన్ గా వరుస సినిమాలతో బిజీగా ఉన్న మృణాల్.. ఇప్పుడు స్టార్ హీరోకి సిస్టర్ గా కనిపించనుందన్న వార్త ఆసక్తికరంగా మారింది.   పుష్పరాజ్ గా పాన్ ఇండియాని షేక్ చేసిన అల్లు అర్జున్(Allu Arjun) ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో భారీ ఫిల్మ్ చేసున్న సంగతి తెలిసిందే. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ లో దీపికా పదుకొనే, జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ సహా పలువురు పలువురు హీరోయిన్స్ నటిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. ఒకే సినిమాలో ఇంతమంది హీరోయిన్స్ నటించడం ఏంటని కొంతకాలంగా చర్చనీయాశంగా మారింది. ఇక ఇప్పుడు మృణాల్ రోల్ కి సంబంధించిన న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. (AA22)   Also Read: 2025 చివరి బాక్సాఫీస్ వార్.. ఛాంపియన్ ఎవరు..?   ఈ సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలి పాత్రలో మృణాల్ కనిపించనుందట. ఇది సినిమాకి కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. బ్రదర్-సిస్టర్ బాండింగ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ హత్తుకుంటాయట. ఈ ట్రాక్ మూవీ మేజర్ హైలైట్స్ లో ఒకటిగా నిలవనుంది అంటున్నారు. అసలే అల్లు అర్జున్-అట్లీ కాంబో, దానికితోడు కథకి కీలకమైన పాత్ర కావడంతో.. సిస్టర్ రోల్ చేయడానికి మృణాల్ సిద్ధపడినట్లు సమాచారం.  

Sunny Leone sizzles in Gippa Gippa Song from Trimukha

Publish Date:Dec 22, 2025

The most awaited song “Gippa Gippa” from the film Trimukha, starring Sunny Leone, Yogesh, Sahithi Dasari, and Akriti Agarwal, has been officially released and is creating a massive buzz everywhere. Released as a perfect New Year blast and bonanza, Gippa Gippa is ruling social media platforms like crazy, with audiences playing it on repeat and showering it with tremendous love. The song’s energetic vibe and grand presentation have struck an instant chord with viewers. Expressing their happiness, the producers shared that the overwhelming response to the song has exceeded expectations. They emphasized that the success clearly reflects Sunny Leone’s immense craze and star power, which is evident from the phenomenal reaction across digital platforms. With Gippa Gippa taking the internet by storm, Trimukha has undoubtedly raised the excitement levels among audiences to a whole new level. Movie is releasing on 2nd January, 2026.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.   

20 ఏళ్లలో 600 సినిమాలు చేసిన జయమాలిని.. ఇండస్ట్రీకి గుడ్‌బై చెప్పడానికి రీజన్‌ ఇదే!

Publish Date:Dec 22, 2025

(డిసెంబర్‌ 22 జయమాలిని పుట్టినరోజు సందర్భంగా..) ‘సన్నజాజులోయ్‌.. కన్నె మోజులోయ్‌..’, ‘గుడివాడ వెళ్లాను.. గుంటూరు పొయ్యాను..’, ‘నీ ఇల్లు బంగారంగానూ..’, ‘గు గు గుడిసుంది..’, ‘పుట్టింటోళ్లు తరిమేశారు...’ 1970వ దశకంలో వచ్చిన ఇలాంటి పాటలు అప్పటి కుర్రకారుకి పిచ్చెక్కించాయి. ఈ ఐటమ్‌ సాంగ్స్‌లో జయమాలిని డాన్స్‌, అందాలు ప్రేక్షకుల్ని థియేటర్స్‌కి మళ్లీ మళ్లీ రప్పించాయి. అప్పట్లో స్టార్‌ హీరోల సినిమాల్లో జయమాలిని ఐటమ్‌ సాంగ్‌ కంపల్సరీగా ఉండాల్సిందే. అక్క జ్యోతిలక్ష్మీ అప్పటికే తన డాన్స్‌తో యూత్‌ని తనవైపు తిప్పుకున్నారు. ఆ సమయంలో వచ్చిన చెల్లెలు జయమాలిని.. ఐటమ్‌ సాంగ్స్‌తో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు.    1958 డిసెంబర్‌ 22న మద్రాస్‌లో జన్మించారు జయమాలిని. ఆమె అసలు పేరు అలమేలు మంగ. 8 మందిలో జ్యోతిలక్ష్మీ మొదటి సంతానం కాగా, అలమేలు మంగ చివరి సంతానం. ఈ ఇద్దరికీ 10 సంవత్సరాల గ్యాప్‌ ఉంది. తల్లికి చెల్లెలైన ధనలక్ష్మీకి పిల్లలు లేకపోవడం వల్ల జ్యోతిలక్ష్మీని దత్తత తీసుకున్నారు. అలా ఆమె దగ్గరే జ్యోతిలక్ష్మీ పెరిగారు. అక్క డాన్స్‌ నేర్చుకుంటూ ఉండగా దగ్గరే ఉండి చూసేవారు అలమేలు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి డాన్స్‌ నేర్చుకున్నారు.    అలమేలు మేనమామ టి.ఆర్‌.రామన్న ప్రముఖ దర్శకుడు. ఆయన దర్శకత్వంలో రవిచంద్రన్‌, లత  జంటగా రూపొందుతున్న ‘స్వర్గత్తిల్‌ తిరుమనం’ సినిమాలో లత స్నేహితురాలిగా అలమేలును చిత్ర రంగానికి పరిచయం చేశారు. అప్పటికి అలమేలు వయసు 12 సంవత్సరాలు. ఆ తర్వాత దర్శకుడు బి.విఠలాచార్య చేస్తున్న ‘ఆడదాని అదృష్టం’ చిత్రంలోని ఒక ఐటమ్‌ సాంగ్‌ ద్వారా తెలుగులో పరిచయం చేశారు. ఆమెకు జయమాలిని అని పేరు పెట్టింది కూడా ఆయనే.   అదే సంవత్సరం అన్నదమ్ముల అనుబంధం చిత్రంలో నందమూరి బాలకృష్ణ సరసన హీరోయిన్‌గా నటించారు జయమాలిని. దాంతో ఆమెకు అవకాశాలు వెల్లువలా వచ్చాయి. అయితే పెర్‌ఫార్మెన్స్‌ ఓరియంటెడ్‌ క్యారెక్టర్స్‌ కంటే ఐటమ్స్‌తోనే జయమాలిని ఎక్కువ పాపులర్‌ అయ్యారు. 1977లో ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన యమగోల చిత్రంలోని ‘గుడివాడ వెళ్లాను, గుంటూరు పొయ్యాను..’ పాటతో ఒక్కసారి ఇండస్ట్రీని షేక్‌ చేశారు జయమాలిని.  ఆ తర్వాత ఎన్టీఆర్‌ సినిమాల్లో వరసగా ఐటమ్‌ సాంగ్స్‌ చేశారు. అందరు టాప్‌ హీరోల సినిమాల్లో ఐటమ్‌ సాంగ్స్‌ చేసినప్పటికీ ఎన్టీఆర్‌ సినిమాలతోనే ఆమెకు స్టార్‌ ఇమేజ్‌ వచ్చిందనేది వాస్తవం.    1980వ దశకం వచ్చేసరికి జ్యోతిలక్ష్మీ హవా తగ్గింది. జయమాలిని జోరు పెరిగింది. ఆ తర్వాత సిల్క్‌ స్మిత వచ్చినప్పటికీ జయమాలిని ఇమేజ్‌ మాత్రం తగ్గలేదు. దాదాపు 20 సంవత్సరాలపాటు నిర్విఘ్నంగా కొనసాగిన ఆమె కెరీర్‌లో తెలుగు, తమిళ్‌, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 600కి పైగా సినిమాల్లో నటించారు.    ఐటమ్‌ సాంగ్స్‌తోపాటు విఠలాచార్య డైరెక్షన్‌లో వచ్చిన జగన్మోహిని, గంధర్వకన్య వంటి సినిమాలు జయమాలినికి నటిగా, డాన్సర్‌గా మంచి పేరు తెచ్చాయి. ముఖ్యంగా జగన్మోహిని రిలీజ్‌ అయిన టైమ్‌కే ఎన్టీఆర్‌ సింహబలుడు, కృష్ణ సింహగర్జన సినిమాలు విడుదలయ్యాయి. అయితే ఆ రెండు సినిమాల కంటే జగన్మోహిని చిత్రానికి ఎక్కువ కలెక్షన్లు రావడం అందర్నీ ఆశ్చర్యపరచింది.    నటిగా బిజీగా ఉన్న సమయంలోనే 1994 జూలై 19న పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అయిన పార్తీబన్‌ను వివాహం చేసుకున్నారు జయమాలిని. వీరి కుమార్తెకు చిన్నతనం నుంచే డాన్స్‌ నేర్పిస్తున్నప్పటికీ ఆమెను సినిమా రంగానికి మాత్రం తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పారు జయమాలిని. పెళ్లి తర్వాత ఆమె ఒక్క సినిమాలో కూడా నటించకపోవడం విశేషం. అంతేకాదు, మీడియాకు కూడా ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. ఈమధ్యకాలంలోనే అక్కడక్కడా జయమాలిని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు.    జయమాలినిది ఒక విభిన్నమైన మనస్తత్వం. సినిమాల్లో కనిపించే జయమాలినికి, బయట కనిపించే జయమాలినికి అసలు పొంతనే ఉండదు. తెరపై ఐటమ్‌ గళ్‌గా కనిపించే ఆమె నిజజీవితంలో ఒక సాధారణ మహిళ అనిపిస్తుంది. మితభాషి, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడరు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా తన కెరీర్‌ని ఎంతో వైవిధ్యంగా కొనసాగించారు. ఒక సాధారణ గృహిణిగా జీవితాన్ని గడపాలనుకున్నానని, అందుకే సినిమాలకు స్వస్తి పలికానని చెబుతారామె. ఏది ఏమైనా తన ఐటమ్‌ సాంగ్స్‌తో 20 సంవత్సరాలపాటు ఒక వెలుగు వెలిగిన జయమాలిని అందరి మనసులు గెలుచుకున్నారు.     

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

Bigg Boss 9 Winner: బిగ్ బాస్-9 విన్నర్ కళ్యాణ్ పడాల.. ఇమ్మాన్యుయేల్ కి అన్యాయం జరిగిందా?

Publish Date:Dec 21, 2025

  బిగ్ బాస్ సీజన్-9 ముగిసింది. అంగరంగ వైభవంగా జరిగిన గ్రాండ్ ఫినాలేలో కామనర్ పవన్ కళ్యాణ్ పడాల విన్నర్‌గా నిలిచి చరిత్ర సృష్టించాడు. మరోవైపు చివరి వరకూ విన్నర్ రేసులో నిలిచిన తనూజ గౌడ రన్నరప్‌గా నిలిచింది.   ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. పదిహేను వారాలు హౌస్ లో ప్రతీ గేమ్ ఆడి.. ఎంతో మంది అభిమానుల్ని పొందాడు పవన్ కళ్యాణ్ పడాల. ఇక టాప్-5 కోసం జరిగిన పోటీలో డీమాన్ పవన్ ని ఓడించి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు కళ్యాణ్.    ఇక బిగ్ బాస్ సీజన్-9 లో అల్టిమేట్ గేమర్ ఎవరంటే చాలామంది ఉన్నారు.. కానీ ఇమ్మాన్యుయేల్ రియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు‌‌. అతడికి అన్యాయం జరిగింది. ఎందుకంటే తన స్కిట్స్ తో షోని టాప్ కి తీసుకెళ్ళాడు. ప్రతీ సీజన్ లో లాగే అతడిని టాప్-5 దాకా ఉంచి, నాలుగో స్థానంలో ఎలిమినేషన్ చేశారు. లేదంటే అతను రన్నరప్ అయ్యేవాడు.    ఇక తనూజ ఫ్యాన్స్ కి ఇది పెద్ద డిజప్పాయింట్ అనే చెప్పాలి. ఎందుకంటే కళ్యాణ్, తనూజ ఇద్దరు నామినేషన్ లో ఉన్నప్పుడు తనూజకే అత్యధిక ఓట్లు వచ్చేవి.. తనే ఫస్ట్ పొజిషన్ లో ఉండేది.   నిన్నటి గ్రాంఢ్ ఫినాలే ఎపిసోడ్ లో సంజనని టాప్-5 కంటెస్టెంట్ గా ఎలిమినేట్ చేయగా, ఇమ్మాన్యుయేల్ ని నాలుగో స్థానంలో ఎలిమినేషన్ చేశారు. డీమాన్ పవన్ పదిహేను లక్షలు తీసుకొని మూడో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇక హౌస్ లో తనూజ, పవన్ కళ్యాణ్ పడాల ఇద్దరు హౌస్ లో ఉండగా నాగార్జున హౌస్ లోకి గోల్డెన్ సూట్ కేస్ తో వెళ్తాడు. వారిద్దరికి ఇరవై లక్షలు ఆఫర్ ఇవ్వగా ఎవరూ తీసుకోరు. ఇక చేసేమీ లేక వాళ్ళిద్దరిని నాగార్జున స్టేజ్ మీదకి తీసుకొచ్చాడు. కౌంట్ డౌన్‌స్టార్ట్ చేసి విన్నర్ కళ్యాణ్ అని అతని చేతిని పైకి లేపుతాడు. ఇక హౌస్ మేట్స్ అంతా క్లాప్స్ తో అభినందిస్తారు.   

షాకింగ్.. రాజమౌళి లాస్ట్ మూవీ వారణాసి..!

Publish Date:Dec 21, 2025

  దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli) ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)తో 'వారణాసి'(Varanasi) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కె.ఎల్. నారాయణ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2027 వేసవిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రాజమౌళి దర్శకత్వంలో వచ్చే చివరి సినిమా 'వారణాసి'నే అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   రాజమౌళి తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'మహాభారతం' అని ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. 'వారణాసి' తర్వాత ఆయన మహాభారతం ప్రాజెక్ట్ పై వర్క్ చేయనున్నారని తెలుస్తోంది. అయితే దీనిని సినిమాలా కాకుండా సిరీస్ లా చేసే ఆలోచనలో ఉన్నారట. 'గేమ్ ఆఫ్ త్రోన్స్' తరహాలో వివిధ దేశాల ప్రేక్షకులకు చేరువయ్యేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందించాలని చూస్తున్నారట. (Mahabharata)   మహాభారతం అనేది చాలా పెద్ద సబ్జెక్టు. పలు సీజన్లుగా తెరకెక్కించవచ్చు. ఒక్కో సీజన్ కి రెండు మూడేళ్లు పడుతుంది. ఈ లెక్కన అన్ని సీజన్లకు కలిపి కనీసం పది, పదిహేనేళ్ళు పట్టే అవకాశముంది. అందుకే 'వారణాసి' తర్వాత ఇక సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. రాజమౌళి తన ఫోకస్ ని మహాభారత్ ప్రాజెక్ట్ పై పెట్టనున్నారని న్యూస్ వినిపిస్తోంది.   Also Read: ఎన్టీఆర్ సినిమాలో రజనీకాంత్.. స్క్రీన్స్ తగలబడతాయి!   అయితే ఇండస్ట్రీ సర్కిల్స్ మరో మాట కూడా వినిపిస్తోంది. 'వారణాసి' తర్వాత ఎన్టీఆర్ తో రాజమౌళి ఒక సినిమా చేస్తారని, ఆ తర్వాత మహాభారత ప్రాజెక్ట్ పైకి వెళ్తారని అంటున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.  

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969

Andhra King Taluka

Publish Date:Dec 31, 1969

Raju Weds Rambai

Publish Date:Dec 31, 1969