English | Telugu

శివాజీ గారు చెప్పింది కరెక్ట్ .. చనిపోవడానికి నేను సిద్దమే!

Publish Date:Dec 27, 2025

ఆర్జీవీ బ్యూటీ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఆరియానా. అలాంటి ఆమె రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ గా కొన్ని విషయాలను షేర్ చేసుకుంది. "నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముతావు" అని హోస్ట్ అడిగేసరికి "మా అమ్మ నన్ను క్రిస్టియన్ లా పెంచింది కానీ నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. "నీకిష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చి నీకేం కావాలి వెంటనే ఇస్తాను అని అడిగితే ఎం కోరుకుంటావ్" అని హోస్ట్ అడిగింది. "నన్ను తీసుకెళ్ళిపోమంటాను అంటూ షాకింగ్ మాటలు చెప్పింది. "నిజం సీరియస్ గా చెప్తున్నా దేవుడే వచ్చిన తర్వాత ఇంకేం కావాలి..నేను ఈ నిమిషం చనిపోయినా పర్లేదు" అంటూ చాలా ఎమోషనల్ గా మాట్లాడింది.   రీసెంట్ గా ట్రెండింగ్ టాపిక్ గా మారిన శివాజీ కామెంట్స్ మీద హోస్ట్ అడిగింది. "శివాజీ గారు చెప్పింది కరెక్ట్ కానీ ఆయన వాడిన పదాల వలన అది వైరల్ అవుతున్నట్టుగా ఉంది కానీ..ఎవరి ఇష్టం వారిది. ఎప్పుడు బతుకుతామో ఎప్పుడు చచ్చిపోతామో ఎప్పుడు రోగాలొస్తాయో ఎవరికీ తెలీదు టెన్షన్ ఎందుకు" అంటూ కూల్ గా ఒక పాట కూడా పాడింది. "అసలు ఈ ఫీల్డ్ లోకి రావాలని నీకు ఎలా అనిపించింది" అని హోస్ట్ అడిగింది. "లైఫ్ లో పర్టికులర్ గా ఏదన్నా జరగాలి అంటే రాసిపెట్టి ఉంటుంది. అలా నేను మా చెల్లి టీవీ చూస్తుంటే యాంకర్ లు కావలెను అంటూ కనిపించింది అలా వెళ్లాం" అని చెప్పింది. ఇక తన కెరీర్ లో ఎదుర్కున్న కష్టాల గురించి చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆరియానా.

Mega - Victory Song Promo: Chiru and Venkatesh rock

Publish Date:Dec 27, 2025

The collaboration between Megastar Chiranjeevi and Victory Venkatesh has long been a dream for Telugu cinema enthusiasts. Director Anil Ravipudi has finally turned this vision into a reality with the upcoming entertainer MSG. The recently unveiled promo for the "Mega-Victory Mass Song" offers a tantalizing glimpse into the high-octane energy and charisma these two legends bring to the frame. The promo highlights the impeccable screen presence of both stars, who appear incredibly stylish and rejuvenated. Anil Ravipudi’s knack for capturing star power is evident in every frame, particularly in the choreographed moments featuring their signature swag and iconic accessories. The visual of both actors sharing the screen, executed with meticulous detail, has already sent fans into a frenzy, effectively raising the stakes for the film’s theatrical debut. Complementing the visuals is the pulsating background score by Bheems Ceciroleo, which perfectly aligns with the massive stardom of the lead duo. Producers Sahu Garapati and Sushmita Konidela have clearly spared no expense, ensuring the production values reflect the magnitude of this rare onscreen pairing.  Following the success of previous tracks like "Meesala Pilla," this anthem is poised to become a massive chartbuster. The full lyrical song is set to release on 30th December, serving as a perfect New Year’s Eve treat before MSG hits global screens on 12th January 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

Vrusshabha Movie Review

Publish Date:Dec 25, 2025

Champion Movie Review 

Publish Date:Dec 25, 2025

Shambhala Movie Review

Publish Date:Dec 24, 2025

పారితోషికం విషయంలో మహానటి సావిత్రి అలా ఎందుకు చేశారో తెలుసా?

Publish Date:Dec 26, 2025

(డిసెంబర్‌ 26 మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ మహానటిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సావిత్రి. సౌమ్యురాలిగా, దానశీలిగా, ప్రేమమూర్తిగా పేరు తెచ్చుకున్న ఆమె  జీవితంలో ఎన్నో వెలుగు నీడలు ఉన్నాయి. తన మంచితనంతో ఎంత పేరు తెచ్చుకున్నారో, కొన్ని సందర్భాల్లో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పాతాళభైరవి చిత్రంలో తొలిసారి ఒక డాన్సర్‌గా కనిపించిన సావిత్రి.. ఆ తర్వాత పెళ్లిచేసి చూడు, పల్లెటూరుతోపాటు కొన్ని తమిళ సినిమాల్లో మంచి పాత్రలు పోషించి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన దేవదాసు చిత్రం ఆమె కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలోనే పారితోషికానికి సంబంధించి ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక పత్రికలో 'నిర్మాతలకు హెచ్చరిక' పేరుతో ఒక ఆర్టికల్‌ కూడా వచ్చింది. దాని సారాంశం ఇది. నిన్న మొన్నటి వరకు సినిమాకు 300 తీసుకొని నటించిన సావిత్రి ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకు 20,000 రూపాయలు డిమాండ్‌ చేస్తోందని, ఇది నిర్మాతల శ్రేయస్సుకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. అప్పటివరకు సావిత్రి నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదని, అలాంటప్పుడు ఆమె అడిగినంత పారితోషికం ముట్టచెప్పి అనవసరంగా ఆమె వేల్యూని పెంచేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  పత్రికలో ఈ ఆర్టికల్‌ వచ్చేనాటికి చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత బాగాలేదు. మంచి కథని ఎంపిక చేసుకొని సినిమా విజయం సాధించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండేది కాదు.  కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆరోజుల్లో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న ఎవిఎం, జెమిని వంటి సంస్థలకు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు చిత్ర పరిశ్రమ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోవడానికి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు కూడా ఒక కారణమనే అభిప్రాయం ఆరోజుల్లోనే.. అంటే 60 ఏళ్ళ క్రితమే ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా సావిత్రిని టార్గెట్‌ చేశారు నిర్మాతలు. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారంటూ పత్రికలు కథనాలు రాశాయి. సావిత్రి సినిమా రంగంలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, అవకాశాల కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవారో ఆమె పెదనాన్న చౌదరిగారు గుర్తు తెచ్చుకోవాలంటూ సూచించారు.  తారాపథంలో ఎదిగిన తర్వాత తాము ఇండిస్టీలోకి ఎలా అడుగు పెట్టాము, దాని కోసం ఎన్ని మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చింది అనే విషయాలను తారలు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా తాము ప్రస్తుతం ఉన్న స్థితి గురించి మాత్రమే ఆలోచించడం చిత్ర పరిశ్రమకు శ్రేయస్కరం కాదు. ఉన్నఫళంగా పారితోషికం పెంచేయడం అనేది ఎవ్వరికీ క్షేమదాయకం కాదు. చేసిన దానికి తగిన ప్రతిఫలం తీసుకుంటూ క్రమంగా ఎదగడం తారలకు ఎంతో అవసరం. అలా ముందుకెళితేనే నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనం అప్పట్లో చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే ఇప్పటివరకు సావిత్రి తీసుకునే పారితోషికానికి సంబంధించి ఇలాంటి వివాదం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.

దృశ్యం3కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది

Publish Date:Dec 22, 2025

ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో సిరీస్ వ‌చ్చాయి. వాటిలో దృశ్యం సిరీస్‌కి ఒక ప్ర‌త్యేక స్థానం ఉంది. ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంటూనే స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకి సంబంధించి ఇప్ప‌టికే రెండు భాగాలు రిలీజ్ అయి మంచి విజ‌యాన్ని అందుకున్నాయి. దృశ్యం చిత్రానికి సంబంధించిన రెండు పార్టులు మ‌ల‌యాళం, తెలుగు, హిందీ భాష‌ల్లో రూపొందాయి. ఈ చిత్రానికి సంబంధించిన మూడో భాగం మాత్రం మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతోంది. ఇటీవ‌లికాలంలో హిందీలో మంచి విజ‌యాన్ని సాధించిన సిరీస్ ఇదే కావ‌డం విశేషం. ప్రస్తుతం మ‌ల‌యాళం, హిందీ వెర్ష‌న్ల‌కు సంబంధించిన షూటింగ్స్ జ‌రుగుతున్నాయి. మ‌ల‌యాళ వెర్ష‌న్‌కు జీతు జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, హిందీ వెర్ష‌న్‌ను అభిషేక్ పాఠక్ రూపొందిస్తున్నారు.    ఇదిలా ఉంటే.. దృశ్యం3 హిందీ వెర్ష‌న్‌కి సంబంధించి రిలీజ్ డేట్‌ను ఎనౌన్స్ చేస్తూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. అజ‌య్‌దేవ్‌గ‌ణ్ వాయిస్ ఓవ‌ర్‌తో న‌డిచే ఈ వీడియోలో దృశ్యం 3 ఎలా ఉండబోతోంది అనేది ఇంట్రెస్టింగ్‌గా చెప్పారు. షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని 2026 అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ మూడో భాగంతో దృశ్యం క‌థ ముగుస్తుంద‌ని తెలుస్తోంది. స్టార్ స్టూడియో18 సమర్పణలో, పనోరమా స్టూడియోస్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహిస్తున్నారు. కథ, స్క్రీన్‌ప్లేను అభిషేక్ పాఠక్, ఆమిల్ కీయాన్ ఖాన్, పర్వీజ్ షైఖ్ కలిసి అందించారు. అలొక్ జైన్, అజిత్ అందారే, కుమార్ మంగత్ పాఠక్, అభిషేక్ పాఠక్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.  ఈ సినిమాకి సంబంధించిన రెండు భాగాల మాదిరిగానే మూడో భాగం కూడా ఘ‌న‌విజ‌యం సాధిస్తుంద‌ని బాలీవుడ్ ట్రేడ్‌వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. 

చెఫ్ జీవన్ కి ముద్దు పెట్టేసిన దీపికా...

Publish Date:Dec 27, 2025

చెఫ్ మంత్ర కుకింగ్ షో ప్రతీ వారం ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ఇక ఈ వారం కూడా కంటెస్టెంట్స్ జడ్జెస్ అంతా కూడా ఫేమస్ మూవీ రోల్స్ గెటప్స్ లో వచ్చారు. ఇక ఈ షోకి శంబాలా మూవీ టీమ్ వచ్చింది. ఆది కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాడు. ఇక సుమా ఐతే ఈ షోలో లేలేత లవ్ స్టోరీ నడుస్తోందని అది కూడా దీపికా-జీవన్ మధ్య అని చెప్పేసరికి "శృంగార వీర" అనే సాంగ్ పాడుతూ వచ్చి దీపికా జీవన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టేసింది. ఏదైనా అందరూ కలిసి దీపికను రెచ్చ్చగొట్టారు అంటూ జీవన్ అన్నాడు. "ఏదో మేమందరం ఇక్కడ ఉండి జీవన్ ని కాపాడుతున్నాం కానీ లేదంటే జీవన్ కి ఈపాటికి నలుగురు పిల్లలు ఉండేవారు" అంటూ సుమ కామెడీ చేసింది. ఇక అందరూ కుకింగ్ చేస్తూ ఉండగా హీరో ఆది వెళ్లి "మీకు జీవన్ గారిలో ఎం నచ్చిందండి" అంటూ దీపికను అడిగాడు. "వయసైనా ఆయన గుండు మాత్రం అలానే ఉంది చూసారా ఆ గుండు నచ్చింది. ఆయన స్టైల్ నచ్చింది. ఆయన నడిచేటప్పుడు వెనక ఆయన తిప్పే నడుము నచ్చింది." అని చెప్పింది దీపికా. వెంటనే ఆది "కాదన్నా నీలో ఇంత రొమాన్స్ ఉందా" అంటూ జీవన్ ని అడిగాడు. " సర్ ఆయనలో ఉన్నది రొమాన్స్ మాత్రమే వేరేం లేదు" అంటూ దీపికా క్లారిటీ ఇచ్చింది. తర్వాత "మీసాల బావా" అంటూ జీవన్ కోసం పాట కూడా పాడింది. ఇక జీవన్ దణ్ణం పెట్టేసి నా కొంపలంటుకుపోతావ్ నన్ను వదిలేయ్ అంటూ నవ్వాడు.

బ‌న్నీ, లోకేష్ కాంబినేష‌న్‌లో సినిమా.. మ‌రి త్రివిక్ర‌మ్ మాటేమిటి?

Publish Date:Dec 25, 2025

అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ కాంబినేష‌న్‌లో ఓ హై టెక్నిక‌ల్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ వ‌చ్చే ఏడాది ప్ర‌థ‌మార్థంలో పూర్త‌య్యే అవ‌కాశం ఉంది. అయితే ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ చేయ‌బోయే సినిమా గురించి ఇప్ప‌టి నుంచే ఊహాగానాలు మొద‌ల‌య్యాయి. ఇటీవ‌ల త‌న అమెరికా ప‌ర్య‌ట‌న‌ను ముగించుకొని హైద‌రాబాద్ వ‌చ్చిన బ‌న్నీని త‌మిళ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌క‌రాజ్ క‌లిశారు. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో ఓ సినిమా ఉంటుంద‌ని చాలా కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి.  తాజాగా జ‌రిగిన బ‌న్నీ, లోకేష్ మీటింగ్ ప్రాధాన్యాన్ని సంత‌రించుకుంది. వీరి కాంబినేష‌న్‌లో సినిమా ఉంటుంద‌నే ప్ర‌చారానికి బ‌లం చేకూరింది. అదే నిజమైతే అట్లీ సినిమా పూర్తి కాగానే లోకేష్ ప్రాజెక్ట్‌కి ముహూర్తం నిర్ణ‌యించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. లోకేష్ సినిమాటిక్ యూనివ‌ర్స్ ఎంత పాపుల‌ర్ అయిందో అంద‌రికీ తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమా ఉంటుంద‌ని తెలుస్తోంది. దాంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి.  ఇదిలా ఉంటే.. త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో బ‌న్నీ చేయ‌బోయే సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్ బ‌య‌టికి వ‌చ్చింది. ఇప్ప‌టికే జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి సినిమాలు వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో వ‌చ్చాయి. మూడో సారి వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేసేందుకు సిద్ధ‌మ‌య్యారు. అయితే మ‌ధ్య‌లో ఎన్టీఆర్ పేరు వినిపించింది. తాజా స‌మాచారం మేర‌కు ఈ ప్రాజెక్ట్ మ‌ళ్లీ బ‌న్నీ ద‌గ్గ‌రికే వ‌చ్చింద‌ట‌. పురాణాల ఆధారంగా కార్తికేయుడి కథతో త్రివిక్రమ్ ఒక భారీ సోషియో ఫాంటసీ కథను సిద్ధం చేశార‌ట‌. అయితే లోకేష్‌, త్రివిక్ర‌మ్‌.. ఈ ఇద్ద‌రిలో ఎవ‌రి సినిమా మొద‌ట స్టార్ట్ అవుతుంద‌నేది తెలియాల్సి ఉంది. 

Is Suriya's Karuppu looking to compete with Dhurandhar 2?

Publish Date:Dec 20, 2025

Suriya starrer Karuppu being directed by RJ Balaji has been struggling with financial issues even though movie is 95% complete. A song and few scenes needs to be shot and the makers are planning to complete the shoot in January. Now, the makers are planning to release on 19th March 2026.  Already, the movie has been facing huge troubles with low asking price from OTT platforms which makers are not happy with. Suriya has been facing huge downtime in his career, so he is expecting Karuppu to be his major comeback at the box office. Meanwhile, he moved on to his next Suriya46 with Venky Atluri.  Sithara Entertainments is producing the film and Mamitha Baiju is playing a leading role in it. The makers have wrapped up shoot completely and they have started post-production works locking May date. Hence, Karuppu cannot go for a further date than Atluri's film.  Meanwhile, Jithu Madhavan's cop film with Suriya will complete shoot by May and the actor, who is producing it himself, doesn't want to take it to 2027, unless works are pending or slowed down it seems.   So, Karuppu makers need to lock March date and so, despite competition with Dhurandhar and Yash's Toxic, they might for the date, say sources. With Dhurandhar being such a massive hit, Part-2 will shatter all box office records in opening weekend for sure. Going against it would be a suicide but makers have no choice, it seems. Let's wait for official confirmation.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969