English | Telugu

నా భార్య కొడుతుంది.. పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ప్రముఖ నటుడు 

Publish Date:Jan 7, 2026

        -ఆ నటుడు భార్య పై ఏమని కంప్లైంట్ చేసాడు  -కొట్టడం నిజమేనా  -ఆమె అలా చెయ్యడానికి కారణం -మరి పోలీసులు ఏమన్నారు     భార్యలని చిత్ర హింసలకి గురి చేసే భర్తలే కాదు. భర్తల్ని చిత్ర హింసలకి గురి చేసే భార్యలు కూడా ఉంటారనే వార్తల్ని నిత్యం వింటుంటాం. ఇప్పడు ఆ బాధిత భర్త పోస్ట్ లో ఒక సినీ నటుడు చేరాడు. దీంతో సదరు న్యూస్ సౌత్ సినీ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో ఒక రేంజ్ లోనే వైరల్ గా మారింది.     కన్నడ చిత్ర సీమలో ధనుష్ రాజ్(Dhanush Raj)కి సుదీర్ఘమైన సినీ నేపధ్యం ఉంది. ఎన్నో హిట్ సినిమాల్లో కూడా చేశాడు. రీసెంట్ గా ధనుష్ రాజ్ బెంగుళూరు లోని గిరి నగర్ పోలీస్ స్టేషన్ లో తన భార్య అర్షిత(arshitha)పై ఫిర్యాదు చేసాడు. సదరు ఫిర్యాదులో 'నా భార్య సరైన సమాచారం ఇవ్వకుండా విదేశాలకి వెళ్ళింది.ఎందుకు చెప్పకుండా వెళ్లావని అడిగితే నన్ను కొట్టడమే కాకుండా వేధింపులకి గురి చేస్తుంది. నాపై  గుండాలని పంపి చంపిస్తానని అంటుండడంతో పాటు ఒకసారి తనంతట తానే గాయపరుచుకొని నేను చేసానని సృష్టించింది. టోటల్ గా నా భార్య వాళ్ళ ఎంతో మనో వేదనకి గురవుతున్నానని ధనుష్ రాజ్ తన ఫిర్యాదు లో పేర్కొన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.     2008 వ సంవత్సరం నుంచే కన్నడ చిత్ర సీమలోనే ఉన్న ధనుష్ రాజ్ బొంబాట్, సంగమ, సర్కస్ శివాజి సూరత్ కల్  వంటి చిత్రాల్లో కనిపించాడు. సీరియల్స్ లోను తనదైన శైలిలో దూసుకుపోతున్నాడు.  

Santosh Sobhan Couple Friendly locks Valentine's Day release

Publish Date:Jan 7, 2026

Couple Friendly, starring Santosh Sobhan in the lead role with Manasa Varanasi as the female lead, is gearing up for a grand theatrical release on February 14, marking Valentine’s Day. The film is presented by the renowned production house UV Creations and is being produced on a grand scale by UV Concepts in both Telugu and Tamil.    Ajay Kumar Raju P. serves as the co-producer, while Ashwin Chandrashekar directs the film. Designed as a musical romantic love story, Couple Friendly aims to appeal to young and family audiences alike. The makers officially announced the release date today, confirming that the film will hit theatres on Valentine’s Day.  To mark the announcement, Santosh Sobhan and Manasa Varanasi released a special promotional video, which has been receiving positive attention. Couple Friendly will release simultaneously in Telugu and Tamil, bringing its romantic narrative to audiences across both languages. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

తన కథలతో అన్ని భాషల్లోనూ సూపర్‌హిట్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌!

Publish Date:Jan 7, 2026

(జనవరి 7 కె.భాగ్యరాజా పుట్టినరోజు సందర్భంగా..) ప్రస్తుతం హీరోలను బట్టి కథలు తయారు చేస్తున్నారు. ఒక హీరోకి ఎంత మార్కెట్‌ ఉంది, ఎలాంటి ఇమేజ్‌ ఉంది అనేది ప్రధానంగా చూస్తున్నారు. కానీ, కానీ,  పాత రోజుల్లో మొదట కథ అనుకొని దాన్ని పూరిస్థాయిలో సిద్ధం చేసిన తర్వాత ఆ కథకు ఏ హీరో అయితే సూట్‌ అవుతాడు అనేది ఆలోచించేవారు. 1980కి ముందు సినిమాలు ఈ విధంగానే రూపొందేవి. ఆ తర్వాత హీరోని బట్టి కథలు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో కూడా కథను నమ్ముకొని సినిమాలు చేసిన దర్శకనిర్మాతలు ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సిన వారు కె.భాగ్యరాజా.    ఎన్నో అద్భుతమైన సినిమాలకు రూపొందించి భారతదేశంలోనే అత్యుత్తమ కథా రచయితగా పేరు తెచ్చుకున్న దర్శకుడు కె.భాగ్యరాజ్‌. ఆయన తన సినిమాల్లోని కథకు, కథనానికి ఒక ప్రత్యేకత ఉండేలా చూసుకుంటారు. తమిళ్‌లో ఆయన రూపొందించిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. ఆయన రచించి దర్శకత్వం వహించిన సినిమాల్లో ఎక్కువ శాతం కుటుంబకథా చిత్రాలే కావడం విశేషం.    1953 జనవరి 7న తమిళనాడులోని వెల్లన్‌ కోయిల్‌లో కృష్ణస్వామి, అమరావతియమ్మ దంపతులకు జన్మించారు కృష్ణస్వామి భాగ్యరాజ్‌. చిన్న తనం నుంచి సినిమాలపైన ఆసక్తి పెంచుకున్న భాగ్యరాజ్‌ తను చూసిన సినిమాల గురించి ఎప్పటికప్పుడు విశ్లేషించేవారు. అంతకంటే బాగా కథ ఎలా రాయాలో స్నేహితుల దగ్గర డిస్కస్‌ చేసేవారు. సినిమాల్లో పనిచేయాలనే ఆసక్తి ఆయనకు బాగా ఉండేది. అలా గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. మొదట భారతీరాజా దగ్గర సహాయకుడిగా పనిచేశారు. భారతీరాజా రూపొందించిన అనేక సినిమాలకు స్క్రీన్‌ప్లే సమకూర్చారు. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. 1979లో వచ్చిన సువరిల్లధ చిత్తిరంగళ్‌ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ తర్వాత రచయితగా, దర్శకుడిగానే కాకుండా హీరోగా కూడా నటించారు. స్వీయ దర్శకత్వంలో ఎన్నో సినిమాల్లో హీరోగా నటించారు. ఆయన సినిమాలు ఎక్కువగా తెలుగులో రీమేక్‌ అయ్యాయి.    1980 నుంచి 1990 వరకు భాగ్యరాజ్‌ చేసిన సినిమాలను ప్రేక్షకులు విపరీతంగా ఆదరించారు. ఆయన సినిమాల్లోని కథ, కథనాలు వారిని ఆకట్టుకునేవి. ఒక దశలో కె.భాగ్యరాజ్‌ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆయన సినిమాల్లోకి వచ్చిన కొంతకాలానికి 1981లో ప్రవీణ అనే యువతిని పెళ్లి చేసుకున్నారు. అయితే 1983లో ఆమెకు కామెర్ల వ్యాధి సోకి మరణించారు. ఆ తర్వాత తన సహనటి పూర్ణిమా జయరామ్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు శంతను భాగ్యరాజ్‌, కుమార్తె శరణ్య భాగ్యరాజ్‌ ఉన్నారు. వీరు కూడా కొన్ని సినిమాల్లో నటించారు. భాగ్యరాజ్‌ సినిమాలు విలక్షణమైన కథలతో ఉంటాయి. ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసేవిగా కూడా ఉంటాయి. అతని స్క్రీన్‌ప్లేకి ఒక ప్రత్యేకమైన శైలి ఉంది. దానితోనే ఆయన ఎక్కువ విజయాలు సాధించారు.   1987లో తమిళ్‌లో రూపొందిన ఎంగ చిన్న రాసా చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. ఆ తర్వాత అదే సినిమాను చిన్నరాజా పేరుతో తెలుగులో డబ్‌ చేసి విడుదల చేశారు. 1992లో ఎంగ చిన్నరాసా చిత్రాన్ని హిందీలో బేటా పేరుతో రీమేక్‌ చేశారు. 1993లో అబ్బాయిగారు పేరుతో ఆ సినిమాను ఇ.వి.వి.సత్యనారాయణ రీమేక్‌ చేశారు. ఇలా ఆయన చేసిన ఎన్నో సినిమాలు వివిధ భాషల్లో రీమేక్‌ అయ్యాయి. అలా ఎక్కువ రీమేక్‌ అయిన సినిమాలు భాగ్యరాజ్‌వి కావడం విశేషం. తను డైరెక్ట్‌ చేసిన సినిమాల్లోనే కాక ఇతర దర్శకులు రూపొందించిన సినిమాల్లోనే భాగ్యరాజ్‌ ఎక్కువగా నటించారు. ఇటీవలి కాలంలో అడపా దడపా కొన్ని సినిమాల్లో కనిపిస్తున్నారు. తమిళ టీవీ ఛానల్స్‌ నిర్వహించే పలు షోలకు, సీరియల్స్‌కు స్క్రిప్ట్‌ అందించడమే కాకుండా ఆ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు కె.భాగ్యరాజ్‌.

విడాకులు అనౌన్స్ చేసిన స్టార్ కపుల్.. ముగ్గురు పిల్లల విషయంలో కీలక నిర్ణయం 

Publish Date:Jan 5, 2026

        -భారతీయ మీడియా వర్గాల్లో మరో సంచలనం  -16 ఏళ్ళ వివాహ బంధానికి గుడ్ బై చెప్పాల్సిన అవసరం ఏంటి -సోషల్ మీడియా వేదికగా  మహి విజ్ చేసిన పోస్ట్ ఏంటి -మరి ముగ్గురు పిల్లల పరిస్థితి ఏంటి!       ఈ మధ్య కాలంలో భార్యా, భర్తలైన సినీ, టీవీ సెలబ్రటీలు పోటాపోటీగా విడాకులు తీసుకుంటున్నారు. కొత్తగా వివాహ బంధంలోకి అడుగుపెట్టినా వాళ్లే కాకుండా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వాళ్ళు సైతం విడాకులు ప్రకటిస్తు ఉండటం అభిమానులని కలవర పరుస్తు ఉంది. రీసెంట్ గా మరో  సెలబ్రటీ కపుల్ డైవర్స్ తో తమ పదహారు సంవత్సరాల వివాహ బంధానికి సెండ్ ఆఫ్ చెప్పి అభిమానులకి కలవర పాటుకి గురి చేసింది.   మహి విజ్, జై భానుషాలి.. బాలీవుడ్ సినీ,టీవీ రంగంలో సుదీర్ఘ కాలం నుంచి తిరుగులేని ఆది పత్యాన్ని చెలాయిస్తూ వస్తున్నారు. 2011 లో ఈ ఇద్దరి వివాహం జరగగా ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. రీసెంట్ గా మహి విజ్ ఇన్ స్టాగ్రామ్ వేదికగా విడాకులపై స్పందిస్తు 'ఇద్దరం విడిపోయినా  కూడా పిల్లలు తారా, ఖుషి, రాజ్‌వీర్‌ల కోసం మంచి తల్లిదండ్రులుగా, మంచి స్నేహితులుగా ఉండేందుకు ప్రయత్నిస్తాం. మేము వేరు దారుల్లో నడుస్తున్నా విడాకుల  నిర్ణయం వెనుక ఎలాంటి నెగిటివిటీ,డ్రామా లేదు. కేవలం ప్రశాంతత కోసమే విడాకుల నిర్ణయాన్ని ఎంచుకున్నాం..స్నేహబంధం కొనసాగుతూనే  ఒకరిని ఒకరం గౌరవించుకునే విషయంలో రాజీ పడం. ఈ సమయంలో అభిమానుల ప్రేమ, గౌరవం, దయ అవసరం అని తెలిపింది.     Also read:  ధురంధర్ తో కొత్త లోక  కలిస్తే.. మీకు ఓకేనా!     పదిహేడు సంవత్సరాల వయసులో మోడలింగ్ గా కెరీర్ ప్రారంభించిన మహి విజ్ టెలివిజన్   రంగంలో సుమారు 30 సిరీస్ ల వరకు చేసింది. గత ఏడాది డిసెంబర్ 2 నుంచి కలర్స్ టీవీ లో వస్తున్న సెహర్-హోనే కో హై లో చేస్తుంది. సినిమాల విషయానికి వస్తే 2004 లో తెలుగులో ప్రభు దేవా హీరోగా వచ్చిన తపన అనే మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత మలయాళంలో, కన్నడంలో ఒక సినిమా చేసింది. ఇక  జై భానుషాలి విషయానికి వస్తే తను కూడా మోడల్ గానే  కెరీర్ స్టార్ట్ చేసి సినీ, టీవీ, వెబ్ సిరీస్  నటుడుగా, అనేక షోస్ కి ప్రెజంటర్ గా చేస్తు తనదైన శైలిలో దూసుపోతున్నాడు. లాస్ట్ ఇయర్ మార్చిలో అభిషేక్ బచ్చన్ నుంచి వచ్చిన బి హ్యాపీ అనే మూవీలో కీలకమైన క్యారక్టర్ లో కనిపించాడు.  

నేను త్వరలో మీ హీరో కాబోతున్నా ... సందీప్ రెడ్డి వంగాకి మెసేజ్ పెట్టిన పృథ్వి

Publish Date:Jan 7, 2026

    బుల్లితెర మీద పృథ్వి శెట్టి - విష్ణు ప్రియా జోడీ చేసిన అల్లరి అందరికీ తెలుసు. బిగ్ బాస్ నుంచి వీళ్ళు ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో కూడా ఆడియన్స్ కి తెలుసు. ఐతే తాము మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. ఇక రీసెంట్ గా పృథ్వి శెట్టి ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. "మీరు చూసిన ఒక మూవీలో ఈ క్యారెక్టర్ నేను చేసి ఉంటే ఎంత బాగుండో నేనైతే ఇరగదీసేవాడిని" అని ఎప్పుడైనా అనిపించిందా అని హోస్ట్ అడిగిడిని. "ఇరగదీసేవాడిని అని అనిపించలేదు నేను చేస్తే ఇది బాగుంటుంది అనిపించింది. యానిమల్, దురంధర్, కేజిఎఫ్ అనిపించింది" అని చెప్పాడు. అంటే కటౌట్ కి తగ్గితే మూవీస్ కూడా అనిపించాయి అంది హోస్ట్. "సందీప్ రెడ్డి వంగ అంటే ఇష్టం. నేను ఆయనకు మెసేజ్ పెట్టాను.      నేను త్వరలో మీ హీరో కాబోతున్నా" అని కానీ ఆయన ఆ మెసేజ్ ని చూడలేదు." అని చెప్పాడు. "జీవితం నాన్న పోయినప్పుడు చాలా బాధపడ్డాను. ఆయన నా ముందుకు వస్తే నేను ఆయనని హగ్ చేసుకుంటాను. నేను ఏ ఫామిలీ పెళ్ళికి వెళ్లడం లేదు. వీడు యాక్టింగ్ యాక్టింగ్ అంటాడు ఇక్కడే ఉన్నాడు. మా అమ్మను అడిగేవాళ్ళు మా అబ్బాయి ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు మీ అబ్బాయి ఎం చేస్తున్నాడు అనేవాళ్ళు. నేను ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో హ్యాపీగా లేను." అంటూ చెప్పుకొచ్చాడు.  

NBK 111: బాలయ్య ఫ్యాన్స్ కి ఊహించని షాక్!

Publish Date:Jan 5, 2026

  బాలకృష్ణ ఫ్యాన్స్ కి బిగ్ షాక్ హిస్టారికల్ ఫిల్మ్ ని పక్కన పెట్టారా? NBK 111 కొత్త స్టోరీ ఏంటి? నయనతార ప్లేస్ లో ఎవరు?   'వీరసింహారెడ్డి' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), గోపీచంద్ మలినేని మరో ప్రాజెక్ట్ కోసం చేతులు కలిపిన విషయం తెలిసిందే. బాలకృష్ణ కెరీర్ లో 111వ సినిమాగా రానున్న ఈ ప్రాజెక్ట్ ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తోంది. ఈ హిస్టారికల్ ఫిల్మ్ లో నయనతార హీరోయిన్. ఇదిలా ఉంటే ఈ సినిమా విషయంలో ఊహించని మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. (NBK 111)   బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కలయికలో హిస్టారికల్ ఫిల్మ్ అనగానే.. అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాని వెండితెరపై చూస్తామా అని అభిమానులు వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ కి షాకిచ్చేలా.. ఈ మూవీ స్టోరీ ఛేంజ్ అయినట్లు సమాచారం.   ప్రస్తుతం పెద్ద సినిమాల పరిస్థితి పెద్దగా బాలేదు. ఓటీటీ బిజినెస్ కూడా మునుపటిలా జరగడంలేదు. ఈ పరిస్థితులలో హిస్టారికల్ ఫిల్మ్ అయితే భారీ బడ్జెట్ అవుతుందనే ఉద్దేశంతో.. ప్రస్తుతం ఆ స్క్రిప్ట్ ని పక్కన పెట్టాలని టీమ్ నిర్ణయించిందట. దాని స్థానంలో మరో కొత్త స్క్రిప్ట్ తో సినిమా చేయబోతున్నారట. ఈ స్క్రిప్ట్ ప్రజెంట్ ట్రెండ్ కి తగ్గట్టుగా ఉంటుందని, మలినేని ఈసారి అందరినీ సర్ ప్రైజ్ చేయడం ఖాయమని అంటున్నారు.   Also Read: రాశి సంచలన వీడియోతో చిక్కుల్లో అనసూయ.. క్షమాపణలు చెబుతుందా?   అలాగే 'NBK111' హీరోయిన్ కూడా మారనున్నట్లు వినికిడి. హిస్టారికల్ ఫిల్మ్ అనుకున్నప్పుడు హీరోయిన్ గా నయనతారను ప్రకటించారు. ఆమె రెమ్యూనరేషన్ రూ.10 కోట్లకు పైగా ఉంటుంది. ఇప్పుడు బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కోసం ఆమెకు బదులుగా మరో హీరోయిన్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.   'NBK111' గురించి వినిపిస్తున్న వార్తల్లో నిజానిజాలు ఎంతో తెలియదు కానీ.. ఇటీవల కాలంలో బడ్జెట్ లు పెరిగిపోయి నష్టపోతున్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో బడ్జెట్ విషయంలో ముందే జాగ్రత్తలు తీసుకోవడం అనేది అభినందించదగ్గ విషయమే.  

Tiger Shroff to be part of Allu Arjun and Atlee film?

Publish Date:Jan 6, 2026

Allu Arjun has delivered a massive blockbuster with Pushpa 2 The Rule and his market in North India is huge. Taking that into consideration, Sun Pictures have accepted to give Atlee, a free hand to make his sci-fi fantasy drama on a never-seen-before scale with Hollywood VFX Studios, Action Co-ordinators collaborating on it.  Now, the reports suggest that the movie could be spilt into two parts and both will be shot at one go. The movie team won't be going back to shoot the second part but rather they would be spending 6-8 months on VFX and scale of the second part, if the reports are true.  Currently, the reports suggest that Tiger Shroff is in talks and he even joined the film for a crucial part. Will he be playing an antagonist or supporting protagonist is yet to be known. Vijay Sethupathi is said to be a part of the film. Already, Deepika Padukone is part of the film and she completed two schedules.  Mrunal Thakur and Janhvi Kapoor are said to be part of the project as there will be a triple role for Allu Arjun with connection between past lives and future. We have to wait and see, how many of these reports will emerge to be true. Atlee is currently working on meeting a Hollywood Studio to distribute the film, state reports.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969