English | Telugu

ఫ్యాన్స్ కి బంపర్ ఆఫర్ ప్రకటించిన అఖండ 2 టీం.. రేట్స్ ఇవే 

Publish Date:Dec 30, 2025

      గాడ్ ఆఫ్ మాసెస్ 'నందమూరి బాలకృష్ణ'(Balakrishna)నట విశ్వరూపంలో దాగి ఉన్న మరో కోణాన్ని పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ పై  చూపించిన చిత్రం 'అఖండ 2'(Akhanda 2). శివస్థుతుడైన అఘోర గా కళ్ళతోనే బాలయ్య పలికించిన హావభావాలు, డైలాగ్స్ ప్రతి ఒక్కరి చేత 'హరహర మహాదేవ శంభో శంకర' అనేలా చేసాయి. థమన్ మ్యూజిక్ అయితే ఆ అరుపుల స్థాయిని పూనకాల  రేంజ్ కి తీసుకెళ్లింది. ఇప్పుడు అఖండ 2 తెలంగాణ ప్రేక్షకులకి, శివ భక్తులకి ఒక తీపి కబురు చెప్పింది. మరి ఆ న్యూస్ ఏంటో చూద్దాం.        తెలంగాణ(Telangana)కి సంబంధించి అఖండ 2 టికెట్ రేట్స్ భారీగా తగ్గాయి. సింగల్ స్క్రీన్స్ లో 50 ,80 ,105 రూపాయలతో కూడిన  క్లాస్ లుగా ఉండగా, మల్టిప్లెక్స్  150 రూపాయలు. ఈ మేరకు మేకర్స్ అధికారంగా వెల్లడి చేస్తూ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేసారు. ఇక పెంచిన టికెట్ రేట్స్ జనవరి 1 నుంచే అమలులోకి రానున్నాయి. దీంతో అఖండ 2 జోరు సిల్వర్ స్క్రీన్ పై మరింతగా ఉదృతం అవ్వడం ఖాయమనే అభిప్రాయాన్ని అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తం చేస్తున్నారు.      ఇక ఏపీ(Andhrapradesh)లో రిలీజ్ కి ముందు పెంచిన రేట్స్ కాకుండా సాధారణ ధరలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే.                     

NTR wins the battle against his personality theft on Internet

Publish Date:Dec 29, 2025

In a significant development reinforcing celebrity rights in the digital era, actor NTR has secured legal protection from the Delhi High Court against the unauthorised use of his name, image, and likeness across digital platforms. The actor, popularly known as the Man of the Masses, approached the court citing widespread misuse of his identity on social media and e-commerce platforms. According to the petition, such unauthorised exploitation not only caused commercial harm but also posed a serious threat to his reputation, particularly in an age dominated by artificial intelligence, deepfakes, and manipulated digital content. Taking note of the concerns raised, the Delhi High Court treated the plea under the Information Technology (Intermediary Guidelines and Digital Media Ethics Code) Rules, 2021. The court directed concerned intermediaries to promptly remove, disable, or restrict access to infringing content upon receipt of a valid complaint.   Reacting to the order, NTR expressed gratitude to the judiciary, stating, “I thank the Hon’ble Delhi High Court for granting a protective order safeguarding my personality rights in today’s digital environment.” He also acknowledged the efforts of his legal team, including Supreme Court Advocates Dr. Balajanaki Srinivasan and Dr. Alka Dakar, and the team at Rights & Marks, for their role in securing the relief. The ruling reinforces the growing judicial recognition of personality and publicity rights in India, underscoring that unauthorised commercial exploitation of an individual’s name, image, or likeness—particularly when it risks reputational harm—will invite legal consequences. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them.

పారితోషికం విషయంలో మహానటి సావిత్రి అలా ఎందుకు చేశారో తెలుసా?

Publish Date:Dec 26, 2025

(డిసెంబర్‌ 26 మహానటి సావిత్రి వర్థంతి సందర్భంగా..) పాతతరం కథానాయికల్లో మహానటి సావిత్రి తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల మనసుల్లో ఎలాంటి స్థానాన్ని సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. చిన్న చిన్న పాత్రలు పోషిస్తూ మహానటిగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు సావిత్రి. సౌమ్యురాలిగా, దానశీలిగా, ప్రేమమూర్తిగా పేరు తెచ్చుకున్న ఆమె  జీవితంలో ఎన్నో వెలుగు నీడలు ఉన్నాయి. తన మంచితనంతో ఎంత పేరు తెచ్చుకున్నారో, కొన్ని సందర్భాల్లో అదే స్థాయిలో విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. పాతాళభైరవి చిత్రంలో తొలిసారి ఒక డాన్సర్‌గా కనిపించిన సావిత్రి.. ఆ తర్వాత పెళ్లిచేసి చూడు, పల్లెటూరుతోపాటు కొన్ని తమిళ సినిమాల్లో మంచి పాత్రలు పోషించి నటిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత చేసిన దేవదాసు చిత్రం ఆమె కెరీర్‌ను గొప్ప మలుపు తిప్పింది. తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు మంచి అవకాశాలు వచ్చాయి. ఆ తరుణంలోనే పారితోషికానికి సంబంధించి ఆమెపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై ఒక పత్రికలో 'నిర్మాతలకు హెచ్చరిక' పేరుతో ఒక ఆర్టికల్‌ కూడా వచ్చింది. దాని సారాంశం ఇది. నిన్న మొన్నటి వరకు సినిమాకు 300 తీసుకొని నటించిన సావిత్రి ఇప్పుడు ఏకంగా ఒక సినిమాకు 20,000 రూపాయలు డిమాండ్‌ చేస్తోందని, ఇది నిర్మాతల శ్రేయస్సుకు భంగం కలిగించే అవకాశం ఉందని ఆ ఆర్టికల్‌లో ప్రస్తావించారు. అప్పటివరకు సావిత్రి నటించిన ఒక్క సినిమా కూడా కమర్షియల్‌గా సక్సెస్‌ కాలేదని, అలాంటప్పుడు ఆమె అడిగినంత పారితోషికం ముట్టచెప్పి అనవసరంగా ఆమె వేల్యూని పెంచేయడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేశారు.  పత్రికలో ఈ ఆర్టికల్‌ వచ్చేనాటికి చిత్ర పరిశ్రమ పరిస్థితి అంత బాగాలేదు. మంచి కథని ఎంపిక చేసుకొని సినిమా విజయం సాధించేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం ఉండేది కాదు.  కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి వచ్చేది కాదు. కొన్ని సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగింది. ఆరోజుల్లో పెద్ద నిర్మాణ సంస్థలుగా పేరు తెచ్చుకున్న ఎవిఎం, జెమిని వంటి సంస్థలకు ఉద్యోగులను తగ్గించే పరిస్థితి వచ్చిందంటే అప్పుడు చిత్ర పరిశ్రమ ఏ స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.  చిత్ర నిర్మాణ వ్యయం పెరిగిపోవడానికి ఆర్టిస్టుల రెమ్యునరేషన్లు కూడా ఒక కారణమనే అభిప్రాయం ఆరోజుల్లోనే.. అంటే 60 ఏళ్ళ క్రితమే ఉంది. ఈ విషయంలో ముఖ్యంగా సావిత్రిని టార్గెట్‌ చేశారు నిర్మాతలు. దాంతో ఆమెతో సినిమాలు చేస్తున్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారంటూ పత్రికలు కథనాలు రాశాయి. సావిత్రి సినిమా రంగంలోకి రావడానికి ఎన్ని కష్టాలు పడ్డారో, అవకాశాల కోసం ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగేవారో ఆమె పెదనాన్న చౌదరిగారు గుర్తు తెచ్చుకోవాలంటూ సూచించారు.  తారాపథంలో ఎదిగిన తర్వాత తాము ఇండిస్టీలోకి ఎలా అడుగు పెట్టాము, దాని కోసం ఎన్ని మెట్లు ఎక్కి దిగాల్సి వచ్చింది అనే విషయాలను తారలు గుర్తు పెట్టుకోవాలి. అలా కాకుండా తాము ప్రస్తుతం ఉన్న స్థితి గురించి మాత్రమే ఆలోచించడం చిత్ర పరిశ్రమకు శ్రేయస్కరం కాదు. ఉన్నఫళంగా పారితోషికం పెంచేయడం అనేది ఎవ్వరికీ క్షేమదాయకం కాదు. చేసిన దానికి తగిన ప్రతిఫలం తీసుకుంటూ క్రమంగా ఎదగడం తారలకు ఎంతో అవసరం. అలా ముందుకెళితేనే నిర్మాతలు మరిన్ని సినిమాలు నిర్మించే అవకాశం ఉంటుంది అంటూ ఆ పత్రికలో వచ్చిన కథనం అప్పట్లో చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. అయితే ఇప్పటివరకు సావిత్రి తీసుకునే పారితోషికానికి సంబంధించి ఇలాంటి వివాదం ఒకటి ఉందని చాలా మందికి తెలియదు.

కల్కిని క్రాస్ చేసిన 'ధురంధర్'.. నెక్స్ట్ టార్గెట్ ఆర్ఆర్ఆర్!

Publish Date:Dec 29, 2025

  స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన బాలీవుడ్ మూవీ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. మూడు వారాల్లోనే రూ.1000 కోట్ల క్లబ్ లో చేరింది. 24 రోజుల్లో రూ.1100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.   'ధురంధర్'ని నిర్మించిన జియో స్టూడియోస్.. ఈ మూవీ 24 రోజుల్లో రూ.1100.23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్లు అనౌన్స్ చేసింది. ఇందులో ఇండియా కలెక్షన్స్ రూ.862.23 కోట్లు కాగా, ఓవర్సీస్ కలెక్షన్స్ రూ.238 కోట్లు.   'ధురంధర్' జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. న్యూ ఇయర్ హాలిడే కూడా కలిసొచ్చి, ఐదో వారాంతానికి రూ.1200 కోట్ల క్లబ్ లో చేరేలా ఉంది.   Also Read: విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!   ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'ధురంధర్' నిలిచింది. ఛావా, కాంతార చాప్టర్-1 సినిమాలను దాటుకొని ఈ ఫీట్ సాధించడం విశేషం.   ఓవరాల్ గా చూస్తే.. కల్కి, పఠాన్ సినిమాలను దాటుకొని.. అత్యధిక వసూళ్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో ఏడో స్థానంలో నిలిచింది. త్వరలో రూ.1200 కోట్లతో ఐదో స్థానంలో ఉన్న కేజీఎఫ్-2 ని, రూ.1300 కోట్లతో నాల్గో స్థానంలో ఉన్న ఆర్ఆర్ఆర్ ని కూడా క్రాస్ చేసినా ఆశ్చర్యం లేదు.    

Podarillu: మూడు రోజులు‌ ముందుకొచ్చిన మహా పెళ్ళి.. పాపం చక్రి!

Publish Date:Dec 30, 2025

  స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -16 లో... కన్నా, కేశవ ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి భూషణ్ ని కిడ్నాప్ చేస్తారు. కిడ్నాప్ చేసి ఒక కన్‌స్ట్రక్షన్ అవుతున్న బిల్డింగ్ లో ఉంచుతారు‌. అప్పుడే అక్కడికి మాధవ వచ్చి ఏం చేస్తున్నారురా.. అసలు ఇలాంటి పని మీకు వాడు ఎందుకు అప్పజెప్పాడని మాధవ భయపడతాడు.    మరొకవైపు భూషణ్ పేరెంట్స్ భూషణ్ గురించి భయపడుతారు. మీకు ఎవరైనా శత్రువులు ఉన్నారా అని ప్రతాప్ అడుగుతాడు. ఎవరు లేరని వాళ్ళు చెప్తారు. మరి ఎవరు అతన్ని కిడ్నాప్ చేసినట్లు.. పోలీస్ కంప్లైంట్ ఇద్దామని భూషణ్ పేరెంట్స్ అనగానే వద్దని ప్రతాప్ అంటాడు. ఆది నువ్వు మన మనుషులని తీసుకొని వెళ్లి వెతికించమని ప్రతాప్ చెప్తాడు. మహా మాత్రం ఫుల్ హ్యాపీగా ఉంటుంది. అదంతా చూసి చక్రి మురిసిపోతాడు. దూరం నుండి మహా, చక్రిని చూసి ఇదంతా చేసింది నువ్వేనా అని అడుగుతుంది. అవునండి అని చక్రి అనగానే మహా తనకి థాంక్స్ చెప్తుంది.    మరొకవైపు ఎవడ్రా మీరంతా.. ఏం కావాలో చెప్పండి ఇస్తాను నన్ను వదిలిపెట్టండి అని భూషణ్ అంటాడు. అయిన తన మాట ఎవరు లెక్కచేయ్యరు. చక్రికీ మాధవ ఫోన్ చేసి ఎందుకురా ఇలా చేస్తున్నావని అడుగుతాడు. మనం ఒక అమ్మాయికి సాయం చేస్తున్నామంతే అని చక్రి చెప్తాడు.   మరొకవైపు ఆది ఇంటికి తిరిగి వస్తాడు. భూషణ్ ఎక్కడ కనిపించలేదని చెప్తాడు. మీ వల్ల కాదంటే చెప్పండి అని భూషణ్ పేరెంట్స్ ప్రతాప్ తో అంటాడు. అప్పుడే రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుండి ఫోన్ వస్తుంది. ఇప్పుడు పెళ్లి క్యాన్సిల్ అని చెప్పమని ఆదిత్యకి ప్రతాప్ చెప్తాడు. దాంతో మహా గదిలోకి వెళ్లి డాన్స్ చేస్తూ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా చక్రి కిటికీలో నుండి చూస్తాడు.    తరువాయి భాగంలో ఇక పెళ్లి ఆపండి నాన్న అని మహా అనగానే నోరు ముయ్ మూడు రోజుల్లో అతనితో పెళ్లి చేస్తానని ప్రతాప్ చెప్తాడు. నువ్వు చేసిన పనికి పెళ్లి ఇంకా ముందుకి అయిందని చక్రితో మహా అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

విజయ్-రష్మిక పెళ్లి డేట్ ఫిక్స్..!

Publish Date:Dec 29, 2025

  కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న విజయ్ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్న(Rashmika Mandanna) త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. విజయ్-రష్మిక నిశ్చితార్థం ఈ ఏడాది అక్టోబర్ లో జరిగినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పుడు తాజాగా వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్లు తెలుస్తోంది.   విజయ్, రష్మిక వివాహం 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో జరగనుందట. ఈ విషయాన్ని విజయ్, రష్మిక త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశముంది. ఫ్యాన్స్ కి వారిచ్చే న్యూ ఇయర్ గిఫ్ట్ ఇదేనని అంటున్నారు.   Also Read: 'ది రాజా సాబ్' కొత్త ట్రైలర్.. మారుతి ఇలా చేస్తాడని ఊహించలేదు!   2018లో విడుదలైన గీత గోవిందం, 2019లో వచ్చిన డియర్ కామ్రేడ్ సినిమాలలో విజయ్, రష్మిక కలిసి నటించారు. గత కొన్నేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఇద్దరూ ఫెస్టివల్స్ కలిసి జరుపుకోవడం, సీక్రెట్ గా వెకేషన్స్ కి వెళ్ళడం వంటివి చేశారు. ఇక ఇటీవల అక్టోబర్ లో ఎంగేజ్ మెంట్ జరిగిందని, రానున్న ఫిబ్రవరిలో పెళ్లి కూడా జరగనుందని న్యూస్ వినిపిస్తోంది.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969