English | Telugu

అఖండ 2 ఓటిటి డేట్ ఇదేనా!.. నెట్ ఫ్లిక్స్ ఏం చెప్తుంది 

Publish Date:Jan 3, 2026

      -ఓటిటి డేట్ ఇదే  -నెట్ ఫ్లిక్స్ ఏం చెప్తుంది -ఎన్నో అదనపు ఆకర్షణలు        గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)లో దాగి ఉన్న నట విశ్వరూపం యొక్క రేంజ్ ని మరింతగా ఎస్టాబ్లిష్ చేసిన చిత్రం 'అఖండ 2'(AKhanda 2).పైగా ఆ నట విశ్వరూపానికి శివతత్వం కూడా యాడ్ కా వడంతో థియేటర్స్ అన్ని జై బాలయ్య, హరహరమహాదేవశంభోశంకర అంటు మారు మోగిపోయాయి. కొంత మంది ఆడవాళ్లకి అయితే థియేటర్స్ లో పూనకాలు కూడా వచ్చాయి. దీన్ని బట్టి అఖండ 2 ప్రభావం అభిమానుల్లో,ప్రేక్షకుల్లో ఏ మేర ఉందో అర్ధం చేసుకోవచ్చు.     అఖండ 2 ఓటిటి స్ట్రీమింగ్ హక్కులని నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. సినీ సర్కిల్స్ లో తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం సదరు సంస్థ  జనవరి 9 నుంచి అఖండ 2 ని ఓటిటి లవర్స్ కోసం అందుబాటులోకి తీసుకొస్తునట్టుగా వార్తలు వస్తున్నాయి.  ఆ డేట్ పై త్వరలోనే అధికార ప్రకటన కూడా రానుందని అంటున్నారు.పైగా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కానున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ న్యూస్ వైరల్ గా మారడంతో  సినీ ట్రేడ్ వర్గాలు స్పందిస్తు కంటెంట్ కి ఉన్న కెపాసిటీ దృష్ట్యా అఖండ 2 ఓటిటి లో పాన్ ఇండియా వ్యాప్తంగా రికార్డు వ్యూస్ ని రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు.     Also read:  వృషభ ఎండింగ్ కలెక్షన్స్ ఇవేనా! ఫస్ట్ వీక్ ఎంత     సింహ, లెజండ్, అఖండ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న బాలకృష్ణ, బోయపాటి కాంబో ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా, ఆది పినిశెట్టి, శాశ్వత ఛటర్జీ, కబీర్ దుహన్ సింగ్ తమ తమ క్యారక్టర్ లో అద్భుతంగా చేశారు. థమన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరో అదనపు హైలెట్. మరి జనవరి 9  ఓటిటి లో అడుగుపెట్టడం ఖాయమైతే ఓటిటి సినీ ప్రేమికుల్లో  ఈ సంక్రాంతి మరింత సంతోషాన్ని నింపనుంది.    

GGP Teaser: A Refreshing and Vibrant Rural Joyride

Publish Date:Jan 2, 2026

Following the massive success of Mem Famous, Sumanth Prabhas meticulously searched for the perfect follow-up, eventually landing on Godari Gattupaina. Produced by Abhinav Rao and directed by Subhash Chandra, this rural romantic entertainer has just unveiled its teaser, sparking significant buzz among cinema lovers. Building on the positive momentum of the previously released glimpses and melodies, the teaser takes the excitement to a new level. It introduces us to the "OscaRRR" gang—a group of spirited youngsters who, despite being labeled aimless by society, share an unbreakable bond of friendship. Sumanth Prabhas and Nidhi Pradeep lead the way with natural, grounded performances that perfectly capture the essence of a vibrant rural romance. The film boasts a stellar supporting cast, including Jagapathi Babu, Rajeev Kanakala, Harsha Vardhan, and Devi Prasad. Each actor appears to have stepped out of their comfort zone to deliver unique, high-energy performances that amplify the movie's comedic strength. With its lush visual appeal, sharp wit, and authentic village atmosphere, the film positions itself as a strong contender at the box office. Backed by high-end production values and a stirring background score, Godari Gattupaina promises a captivating cinematic experience. Sumanth Prabhas seems set to deliver another youthful hit that will draw audiences to theaters when it releases in 2026. Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్‌ రాజనాల!

Publish Date:Jan 2, 2026

(జనవరి 3 రాజనాల శత జయంతి సందర్భంగా..) ఒక సినిమాకి కథానాయకుడు ఎంత ప్రధానమో.. ప్రతినాయకుడు కూడా అంతే ప్రధానం. బలవంతుడైన విలన్‌ని ఎదిరించి పోరాడినపుడే హీరో క్యారెక్టర్‌ బాగా ఎలివేట్‌ అవుతుంది. అలాంటి ఓ పవర్‌ఫుల్‌ విలన్‌ రాజనాల. 1950వ దశకంలోని విలన్లకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ ప్రేక్షకుల్ని మెస్మరైజ్‌ చేసిన అరుదైన నటన రాజనాల సొంతం. ఒక విధంగా ప్రతినాయకుడి పాత్రకు వన్నె తెచ్చారు రాజనాల. ఇటీవలి కాలంలో చాలా మంది పాతతరం నటుల శతజయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగానే ఈ ఏడాది తెలుగు సినిమా చరిత్రలో మేటి విలన్‌గా పేరు తెచ్చుకున్న రాజనాల శతజయంతి వచ్చింది   1925 జనవరి 3న నెల్లూరు జిల్లా కావలిలో జన్మించారు రాజనాల. ఆయన పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావునాయుడు. ఇంటర్‌ పూర్తయిన తర్వాత డిగ్రీ చెయ్యాలని అనుకోలేదు. ఎంత చదివినా చివరికి ఉద్యోగమే కదా చేసేది అనే ఆలోచనతో ఇంటర్‌తోనే చదువును ఆపేశారు. ఆ తర్వాత రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆ తర్వాత పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలు రాసి రెవెన్యూ ఇన్‌సెక్టర్‌గా ప్రమోషన్‌ పొందారు. 1944 నుంచి 1951 వరకు ఆ డిపార్ట్‌మెంట్‌లోనే వర్క్‌ చేశారు. అయితే లక్నో యూనివర్సిటీ నుంచి ఫిలాసఫీలో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పట్టా పొందారు. సినిమాల్లోకి రాకముందే ఇంగ్లీష్‌లో మంచి పట్టు సాధించారు. ఇంగ్లీష్‌తోపాటు పలు భాషలు ఆయన మాట్లాడేవారు. ఆయన ఇంటిలోని లైబ్రరీలో లక్షల విలువ చేసే పుస్తకాలు ఉండేవి.  1948లో స్నేహితుడు లక్ష్మీకుమార్‌రెడ్డితో కలిసి ఒక నాటక సమాజాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా నాటకాలు వేశారు రాజనాల. తొలి ప్రయత్నంగా ఆత్రేయ రచించిన ఎవరు దొంగ అనే నాటకాన్ని ప్రదర్శించారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండే నాటకం కావడంతో జిల్లా కలెక్టర్‌ ఆగ్రహానికి గురయ్యారు రాజనాల. ఆ తర్వాత అదే తరహాలో ప్రగతి అనే నాటకం వేశారు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉండడంతో జిల్లా కలెక్టర్‌ రాజనాలను మూడు నెలలు సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌ పూర్తయిన తర్వాత ఉద్యోగంలో చేరినప్పటికీ సవ్యంగా పనిచేయలేకపోయారు.    అప్పటికే మిత్రుడు లక్ష్మీకుమార్‌రెడ్డి సినిమా ప్రయత్నాల కోసం మద్రాస్‌ వెళ్లి నిర్మాత హెచ్‌.ఎం.రెడ్డి దగ్గర పనిచేస్తున్నారు. 1951లో ఆయన నిర్మిస్తున్న ‘ప్రతిజ్ఞ’ చిత్రంలో విలన్‌గా అవకాశం ఇప్పించారు లక్ష్మీకుమార్‌రెడ్డి. అదే రాజనాల మొదటి సినిమా. ఈ సినిమాలో ఆయన విలన్‌గా నటించారు. వాస్తవానికి రాజనాలకు విలన్‌గా నటించడం ఇష్టం లేదు. 1953లో విడుదలైన ‘ప్రతిజ్ఞ’ అంతగా ఆడకపోయినా నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత ఎన్టీఆర్‌ హీరోగా నటించిన ‘వద్దంటే డబ్బు’ చిత్రంలో ఆయనకు మామగారిగా వృద్ధ పాత్రలో నటించారు రాజనాల. ఆ సమయంలోనే ఎన్టీఆర్‌తో రాజనాలకు సాన్నిహిత్యం పెరిగింది. ఆ సినిమా తర్వాత నుంచి రాజనాలను మామాజీ అని పిలిచేవారు ఎన్టీఆర్‌.    చాలా తక్కువ సమయంలోనే విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు రాజనాల. అప్పట్లో ఎన్టీఆర్‌, కాంతారావు ఎక్కువగా జానపద సినిమాలు చేసేవారు. ఎవరు హీరో అయినా విలన్‌గా రాజనాల నటించేవారు. హీరోలతో సమానంగా పారితోషికం అందుకున్న ఏకైక విలన్‌ రాజనాల. దాదాపు 15 సంవత్సరాలు విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా 400కి పైగా సినిమాలు చేశారు. 1966లో వచ్చిన హాలీవుడ్‌ సినిమా ‘మాయా ది మాగ్నిఫిషెంట్‌’ చిత్రంలో ఇండియన్‌ అఫీషియల్‌గా నటించారు.   1950, 1950 దశకాల్లో విలన్‌ అంటే రాజనాల అనే పేరు తెచ్చుకున్నారు. విలన్‌లో ఉండే క్రూరత్వం రాజనాలలో కనిపించేది. వివిధ లొకేషన్లలో షూటింగ్‌ జరుగుతున్నప్పుడు ఆయన దగ్గరకు వెళ్లేందుకు జనం భయపడేవారు. ముఖ్యంగా మహిళలు ఆయన దగ్గరకు వెళ్లేవారు కాదు. సినిమాల్లో విలన్‌గా ఆయన నటన, ముఖ్యంగా ఆయన నవ్వు ఎంతో పాపులర్‌ అయింది. తన కెరీర్‌లో 100కి పైగా సినిమాల్లో విలన్‌గా నటించారు రాజనాల. ఎన్టీఆర్‌, ఎం.జి.ఆర్‌, జయలలిత.. ఇలా ముగ్గురు ముఖ్యమంత్రులతో కలిసి నటించిన ఘనత దక్కించుకున్నారు.    వ్యక్తిగత విషయాలకు వస్తే.. మొదట శోభను వివాహం చేసుకున్నారు రాజనాల. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె అకాల మరణం చెందడంతో భూదేవిని పెళ్లి చేసుకున్నారు. రాజనాలకు నలుగురు సంతానం. 1970వ దశకం వచ్చే సరికి పరిశ్రమకు కొత్త విలన్స్‌ రావడం ప్రారంభమైంది. దాంతో ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి. సినిమాల ద్వారా ఎంతో సంపాదించినప్పటికీ దానధర్మాలు ఎక్కువ చేయడం, సినిమాలు తగ్గడంతో ఆస్తంతా కరిగిపోయింది. అయినప్పటికీ ఎన్టీఆర్‌ తన సినిమాల్లో అవకాశాలు ఇచ్చి ఆదుకున్నారు. చివరి రోజుల్లో ఇ.వి.వి.సత్యనారాయణ హలోబ్రదర్‌ చిత్రంలో, ఎస్‌.వి.కృష్ణారెడ్డి నెంబర్‌వన్‌ సినిమాలో అవకాశాలు ఇచ్చారు. ఆయన పరిస్థితి తెలుసుకున్న కృష్ణ తను హీరోగా నటిస్తున్న తెలుగువీర లేవరా చిత్రంలో మంచి పాత్ర ఇచ్చారు. అరకులో ఈ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్చారు. ఆయనకు మధుమేహం పెరగడం, దాని వల్ల ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువ కావడంతో కుడికాలును తొలగించారు డాక్టర్లు. దాంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యారు. 1998లో రాజనాలకు గుండెపోటు రావడంతో చెన్నయ్‌లోని విజయ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ 1998 మే 21న 73 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు రాజనాల.

సల్మాన్ ఖాన్ మూవీపై చైనా ఆగ్రహం.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న సల్మాన్  డైలాగులు 

Publish Date:Dec 30, 2025

    -ఎందుకు అంత అక్కసు  -ఏముంది ఆ మూవీలో  -చైనా మీడియా ఏం చెప్తుంది -సల్మాన్ ఏం చెప్పాడు       సికిందర్ పరాజయంతో ఈ సారి ఎలాగైనా హిట్ ని అందుకోవాలని లక్ష్యంతో తన కట్ అవుట్ కి తగ్గ మూవీ' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్'(Battle of galwan)తో సల్మాన్ ఖాన్(Salman Khan)ముస్తాబు అవుతున్నాడు. చైనా, మన దేశానికి మధ్య గల్వాన్(Galwan)నది హద్దు విషయంలో 2020 జూన్ 16 న జరిగిన యుద్దాన్ని బేస్ చేసుకొని తెరకెక్కుతుంది. అప్పట్లో ఆ పోరాటంలో మన సైనికులు ఇరవై మంది వరకు చనిపోయారు. రీసెంట్ గా మొన్న 27 న జరిగిన సల్మాన్ జన్మదిన సందర్భాన్ని పురస్కరించుకొని 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' నుంచి టీజర్ రిలీజ్ చేసారు.సదరు టీజర్ లో సల్మాన్ నుంచి వచ్చిన చావుకి ఎందుకు భయపడతారు, అది అనివార్యం అనే డైలాగ్ తో పాటు మరిన్ని డైలాగులు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. కానీ ఇప్పుడు చైనా అధికార పత్రిక 'గ్లోబల్ టైమ్స్' బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ పై తమ అక్కసుని ప్రదర్శిస్తుంది.       అంతర్జాతీయ సమాజాన్ని తప్పు దోవ పట్టించి చైనా పై వ్యతిరేకతని రెచ్చగొట్టేందుకు భారత్ చరిత్రని వక్రీకరిస్తుంది. గల్వాన్ లో ఘర్షణలకి భారత్ నే కారణం. భారత దళాలు అక్రమంగా చైనా భూభాగంలోకి చొరబడి దాడి చేసాయి.  బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రం జాతీయ వాదంతో కూడిన మెలోడ్రామా అని గ్లోబల్ టైమ్స్ లో  రాసుకొచ్చింది. చైనా సైనిక నిపుణుడు  సాంగ్ జాంగ్ పింగ్ కూడా మాట్లాడుతు 'చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించుకోవాలనుకునే మా సైనికుల దృఢ సంకల్పాన్ని మా సైనికులు కోల్పోరు అంటూ వ్యాఖ్యానించడం జరిగింది.       Also read:  కొత్త సినిమా బ్యానర్ ఓపెన్ చేసిన బండ్ల గణేష్..బ్యానర్ లో ఉన్న పేరు ఈ నటుడిదే      గల్వాన్ నది చైనా పాలనలో ఉన్న వివాదాస్పద 'అక్సాయ్ చిన్' ప్రాంతం నుండి భారతదేశంలోని లడఖ్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రవహిస్తుంది . ఇది కారకోరం శ్రేణికి తూర్పు వైపున ఉన్న సామ్‌జుంగ్లింగ్ యొక్క కారవాన్ క్యాంపింగ్ గ్రౌండ్ సమీపంలో ఉద్భవించి పశ్చిమాన ప్రవహించి ష్యోక్ నదిలో కలుస్తుంది . సంగమ స్థానం దౌలత్ బేగ్ ఓల్డీకి దక్షిణంగా 102 కి.మీ దూరంలో ఉంది. ష్యోక్ నది సింధు నదికి ఉపనది , గల్వాన్‌ను సింధు నది వ్యవస్థలో భాగం చేస్తుంది. ఈ విషయంలోనే ఇరు దేశాల మధ్య ఎప్పట్నుంచో గొడవలు జరుగుతున్నాయి. ఇక బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ కి అపూర్వ లఖియా(Apoorva Lakhia)దర్శకత్వం వహిస్తుండగా సల్మాన్ ఖాన్ సొంతంగా నిర్మిస్తున్నాడు. చిత్రాంగద కధానాయిక.  

Illu illalu pillalu : ప్రేమని క్షమించేసిన అత్తమామలు.. విశ్వపై అమూల్య ఫైర్!

Publish Date:Jan 3, 2026

    స్టార్ట్ మా టీవీ లో ప్రసారమవుతున్నా సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -358 లో..... తను చేసిన తప్పు తెలుసుకొని ఇంట్లో వాళ్ళని క్షమించమని అడుగుతుంది ప్రేమ. మా అన్నయ్య మాటలు నమ్మి అంత పెద్ద గొడవ అవ్వడానికి కారణం అయ్యానని రామరాజుతో ప్రేమ అనగానే రామరాజు క్షమిస్తాడు. సారీ అత్తయ్య అని వేదవతితో ప్రేమ అనగానే తను దగ్గరికి తీసుకుంటుంది. అమ్మో వీళ్ళు మళ్ళీ కలిసిపోయారని శ్రీవల్లి అనుకుంటుంది.. చేసిందంతా చేసి ఇప్పుడు క్షమించమంటే ఎలా ప్రేమ.. మావయ్య గారి పరువుపోయింది. ఇంకొకసారి మావయ్య చొక్కా చింపరని గ్యారంటీ ఏంటని శ్రీవల్లి అంటుంది.     ప్రేమ ఏదో తెలియక తప్పు చేసింది.. మావయ్య గారు క్షమిస్తుంటే నీకెంటి ప్రాబ్లమ్.. నువ్వు తప్పు చెయ్యలేదా ఎవరైనా తప్పు చేస్తారని నర్మద అంటుంది. మావయ్య గారు క్షమించారు అత్తయ్య కూడా క్షమిస్తుందని నర్మద అనగానే ఇంతటితో ఈ విషయం వదిలెయ్యండి అని రామరాజు అంటాడు. ప్రేమ, నర్మద హ్యాపీగా ఫీల్ అవుతూ వేదవతిని హగ్ చేసుకుంటే శ్రీవల్లి కుళ్ళుకుంటుంది. మరొకవైపు ధీరజ్ దగ్గరికి ప్రేమ వచ్చి.. సారీ చెప్తుంటే నిన్ను చూస్తుంటే అసహ్యంగా ఉంది. ఇక్కడ నుండి వెళ్ళిపోమని ధీరజ్ అంటాడు. దాంతో రూమ్ లో నుండి వెళ్లిపోతుంటే నువ్వు పిలిచే వరకు రానని ప్రేమ బయట చలిలో కూర్చొని ఉంటుంది.     మరొకవైపు అమూల్యని విశ్వ పిలుస్తాడు. నువ్వు ఏదో సిన్సియర్ గా లవ్ చేసావనుకున్నాను కానీ నీ చెల్లిని మీ ఇంటికి రప్పించుకోవడానికి ట్రాప్ చేసావని అనుకోలేదని విశ్వపై అమూల్య కోప్పడుతుంది. అదేం లేదు అమూల్య.. నేను నిన్ను నిజంగా ప్రేమించాను.. నువ్వు లేకపోతే ఎప్పటికి ఇలాగే ఉంటానని ఎమోషనల్ గా మాట్లాడి  విశ్వ వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కాసేపటికి ధీరజ్ వెళ్లి వెచ్చగా ఉండడానికి మంటపెడతాడు. ప్రేమ పక్కన ధీరజ్ కూర్చొని తనపై శాలువా కప్పినట్లు ఉహించుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

రామ్ చరణ్ డైరెక్టర్ తో దుల్కర్ సల్మాన్ మూవీ!

Publish Date:Dec 31, 2025

  మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan)కి తెలుగునాట కూడా మంచి గుర్తింపు ఉంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. ప్రస్తుతం తెలుగులో 'ఆకాశంలో ఒక తార'తో పాటు ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా మరో తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.   పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒక ఫిల్మ్ చేయడానికి దుల్కర్ సల్మాన్ ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం వహించనున్నాడని అంటున్నారు.   ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సంపత్ నంది.. రెండో సినిమాకే రామ్ చరణ్ తో 'రచ్చ' చేసే అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం శర్వానంద్ తో భోగి అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దుల్కర్ ని డైరెక్ట్ చేయనున్నాడట.   ఇప్పటికే దుల్కర్ సల్మాన్, సంపత్ నంది మధ్య కథా చర్చలు జరిగాయని.. సంపత్ చెప్పిన స్టోరీ లైన్ కి దుల్కర్ ఇంప్రెస్ అయ్యాడని వినికిడి. అన్నీ అనుకున్నట్టు జరిగితే త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.  

Are Vijay and Rashmika planning wedding on this date?

Publish Date:Dec 29, 2025

Vijay Deverakonda and Rashmika Mandanna are said to be in love from the moment they have become close on the sets of Geetha Govindam. Their friendship grew further after she cancelled her engagement with Rakshit Shetty and their off-screen intimacy grew further.  They have always maintained that they are friends and become close family friends as well. Rashmika Mandanna, in recent times, started being more open about how she values Vijay's existence in her life and how she wishes him to make a huge comeback in his career as he is struggling with commercial hits.  He also wished her on every success of hers and even powered her recent film, The Girlfriend, by giving voice over for trailer. Now, the rumors have been rampant about the couple getting engaged in a private ceremony last year. The rumors have stated that both the families have agreed for their marriage and are preparing for marriage.  Today, the rumors have surfaced about the couple getting married at Udaipur Palace on 26th February 2026. The arrangements about this huge wedding are going on say the reports and both the actors' families are silent on these reports. Well, will they officially confirm or deny these reports, we have to wait and see.  Disclaimer: The news article is written based on information shared by various sources. The organisation is not responsible for the factual nature of them. While we do try to do thorough research at times people could misguide. So, we would encourage viewers' discretion before reacting to them. 

దండోరా

Publish Date:Dec 31, 1969

ఈషా 

Publish Date:Dec 31, 1969

శంబాల

Publish Date:Dec 31, 1969

ఛాంపియన్

Publish Date:Dec 31, 1969

Shambhala

Publish Date:Dec 31, 1969

Champion

Publish Date:Dec 31, 1969

Mowgli

Publish Date:Dec 31, 1969

Akhanda 2

Publish Date:Dec 31, 1969

Revolver Rita

Publish Date:Dec 31, 1969