English | Telugu

TOLLYWOOD IN 2024: కేసులే కేసులు.. అరెస్టులే అరెస్టులు!

Publish Date:Dec 24, 2024

వందేళ్ళ చరిత్రలో ఎన్నడూ లేని పరిస్థితుల్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటోంది. అంతేకాదు, ఏ చిత్ర పరిశ్రమలోనూ సంభవించని ఘటనలు ఇక్కడ చోటు చేసుకోవడం అందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది. చిన్న చిన్న స్టార్సే కాదు, పెద్ద స్టార్స్‌, ఎంతో అనుభవమున్న సినీ ప్రముఖులు సైతం వివాదాల్లో ఇరుక్కోవడం, పోలీసుల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగడం చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ పెద్ద సంక్షోభంలో ఇరుక్కోబోతోందా అనే సందేహం కలుగుతోంది. 2024 సంవత్సరం ద్వితీయార్థం నుంచి ఇప్పటివరకు ఒకదాని తర్వాత మరొకటి అన్నట్టు సీరియల్‌గా వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక పక్క తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచం నలుమూలలా విస్తరిస్తుంటే.. ఇక్కడ మాత్రం రకరకాల వివాదాలు, ఎఫైర్స్‌, దాడులు, స్టార్స్‌ వల్ల అనుకోని మరణాలు సంభవిస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే.. ఒక దశలో తీవ్రస్థాయిలో మీడియాలో చర్చలు జరిగిన వివాదాలు సైతం ఏదైనా కొత్త వివాదం వెలుగులోకి రాగానే పాత దాని గురించి కనీసం ప్రస్తావించడం కూడా మానేస్తున్నారు. దీంతో మీడియాలో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌ న్యూస్‌లు, ఫ్రెష్‌ కాంట్రవర్సీలు దర్శనమిస్తున్నాయి. అసలు 2024లో ఏయే వివాదాలు తెరపైకి వచ్చాయి. వాటికి ఎలాంటి పరిష్కారాలు లభించాయి అనేది చూద్దాం.  ఈ ఏడాది మొదటి 5 నెలలు టాలీవుడ్‌లో ఎలాంటి వివాదాలు లేకుండా ప్రశాంతంగానే గడిచింది. జూన్‌లో బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీలో నటి హేమ పాల్గొంది అనే వార్త ఒక్కసారిగా టాలీవుడ్‌లో సంచలనం సృష్టించింది. ఆ కేసు ఎన్నో మలుపు తిరిగింది. కొందర్ని అరెస్ట్‌ చేశారు. హేమను కూడా అరెస్ట్‌ చేసి ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ వార్త కొన్నాళ్ళు సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. ఇది జరిగిన నెలరోజులకే మరో వార్త వెలుగులోకి వచ్చి టాలీవుడ్‌ని ఎలర్ట్‌ చేసింది. హీరో రాజ్‌తరుణ్‌ తనని పెళ్లి చేసుకున్నాడని, ఇప్పుడు తనను వదిలేసి మరో హీరోయిన్‌తో సహజీవనం చేస్తున్నాడని లావణ్య అనే యువతి రాజ్‌తరుణ్‌పై కేసు ఫైల్‌ చేసింది. ఈ కేసు మీడియాలో ఎంతో ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మీడియాలో ఎక్కడ చూసినా వీరిద్దరి వార్తలే కనిపించాయి. ఈలోగా కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ కేసు వెలుగులోకి రావడంతో రాజ్‌తరుణ్‌, లావణ్య కేసు మరుగున పడిపోయింది. ఒక్క మీడియా సంస్థ కూడా ఆ వైపు మళ్ళీ వెళ్ళలేదు. జానీ మాస్టర్‌ తనను కొన్నాళ్ళుగా లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, 17 సంవత్సరాల వయసులోనే తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది అతని అసిస్టెంట్‌ శ్రష్టి వర్మ. దీనిపై స్పందించిన పోలీసులు జానీ మాస్టర్‌ని అదుపులోకి తీసుకొని రిమాండ్‌కి తరలించారు.  ఇదిలా ఉంటే.. ఓ తమిళ చిత్రంలో జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేసిన పాటకు నేషనల్‌ అవార్డు వరించింది. అతను అవార్డు అందుకోవడం కోసం తనకు మధ్యంతర బెయిల్‌ కావాలని అడగడం, కోర్టు మంజూరు చేయడం జరిగింది. అయితే ఫోక్సో చట్టం కింద నమోదైన కేసులో జానీ ముద్దాయిగా ఉండడంతో అతనికి వచ్చిన నేషనల్‌ అవార్డును తాత్కాలికంగా రద్దు చేసింది కేంద్రప్రభుత్వం. దీంతో మళ్ళీ జానీ మాస్టర్‌ని జైలుకి తరలించారు. అలా 36 రోజుల పాటు జైలులో ఉన్న తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు జానీ మాస్టర్‌. ఈ గొడవను పక్కన పెడుతూ వెంటనే మరో వివాదం తెరపైకి వచ్చింది. యూట్యూబ్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ హర్షసాయిపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. బిగ్‌బాస్‌ ఫేమ్‌, నటి, నిర్మాత మిత్రశర్మ.. నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో హర్షసాయిపై ఫిర్యాదు చేసింది. తనపై అత్యాచారం చేశాడని, తనను న్యూడ్‌గా షూట్‌ చేసి ఆ వీడియాలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని తన ఫిర్యాదులో పేర్కొంది. ఇది కొన్నాళ్ళు మీడియాలో సందడి చేసింది. ఇక ఆ తర్వాత చడీ చప్పుడు లేదు.  ఈ కేసుల పరంపర ఇలా జరుగుతుండగానే అక్కినేని నాగార్జునకు సంబంధించిన ఎన్‌ కన్వెన్షన్‌ అక్రమ నిర్మాణమని భావించిన హైడ్రా.. దాన్ని కూల్చివేసింది. ఇది కొన్నిరోజులపాటు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇది ముగిసిన కొన్నిరోజులకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ.. అక్కినేని నాగార్జున ఫ్యామిలీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో నాగార్జున ఆమెపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు చాలా రోజులు మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతూనే ఉంది.  ఈ వివాదాలన్నీ ఎంత వేగంగా వచ్చాయో అంతే వేగంగా అందరి దృష్టి నుంచి దూరమైపోయాయి. ఏడాది చివరికి వచ్చేసరికి ఆ ఉధృతి బాగా పెరిగిపోయింది. డిసెంబర్‌ 4న పుష్ప2 ప్రీమియర్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌ దగ్గర జరిగిన తొక్కిసలాట కేసు ఇప్పుడు రాష్ట్రానే కాదు, దేశాన్ని కూడా కుదిపేస్తోంది.  ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ తీవ్రంగా గాయపడి ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు బాధ్యుడు అల్లు అర్జునేనని రేవతి భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో భాగంగానే అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్‌ చేయడం, ఎన్నో నాటకీయ పరిణామాల తర్వాత మధ్యంతర బెయిల్‌పై విడుదల కావడం జరిగింది. ఇప్పుడీ కేసు రాజకీయ రంగు పులుముకోవడంతో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. రోజుకో కొత్త మలుపుతో మీడియాలో ప్రధానాంశంగా మారిపోయింది. గత 20 రోజులుగా ఏ మాధ్యమంలో చూసినా సంధ్య థియేటర్‌ ఘటనపైనే చర్చ జరుగుతోంది. ఫైనల్‌గా ఈ కేసు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వర్సెస్‌ అల్లు అర్జున్‌గా మారిపోయింది. సంధ్య థియేటర్‌ కేసు ఓ పక్క జరుగుతుండగానే టాలీవుడ్‌ సీనియర్‌ నటుడు మంచు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కింది. మోహన్‌బాబు కుమారులు విష్ణు, మనోజ్‌ల మధ్య రాజుకున్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. ఆరోపణలతోనే సరిపెట్టుకోకుండా ప్రత్యక్ష దాడులకు కూడా పాల్పడడంతో ఈ వివాదం మరింత జఠిలంగా మారింది. ఈ నేపథ్యంలోనే మంచు మోహన్‌బాబు దూకుడుగా వ్యవహరించి ఓ మీడియా రిపోర్టర్‌పై దాడి చేయడంతో క్రిమినల్‌ కేసుగా మారింది. మోహన్‌బాబును అరెస్ట్‌ చేయాలనే నినాదాలు వెల్లువెత్తాయి. అయితే మోహన్‌బాబు మాత్రం పోలీసులకు అందుబాటులో లేరు. ఏ క్షణం ఏం జరుగుందోననే ఉత్కంఠ ఈ కేసులో నెలకొంది.  ఇలా ఈ ఏడాది ద్వితీయార్థం నుంచి ప్రారంభమైన పలు రకాల వివాదాలు టాలీవుడ్‌ని కుదిపేస్తున్నాయి. ఇప్పటికే ఇలాంటి కేసులతో టాలీవుడ్‌ తన ప్రతిష్టను కోల్పోయింది. ముందు ముందు ఇంకెన్ని కేసులు వెలుగులోకి వస్తాయో.. ఇది వచ్చే ఏడాది కూడా కొనసాగుతుందా అనే సందేహం అందరిలోనూ ఉంది. వీటికి ఫుల్‌స్టాప్‌ ఎక్కడ అనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఏ వివాదానికి పరిష్కారం లభించకపోవడం గమనార్హం.

Barroz 3D Movie Review 

Publish Date:Dec 25, 2024

Cast: Mohanlal, Maya Rao West, Cesar Lorente Raton, Ignacio Mateos, Kallirroi Tziafeta, Nerea Camacho Ramos, Daniel Caltagirone Crew:  Based on Barroz: Guardian of D'Gama's Treasure by Jijo Punnoose Cinematography by Santosh Sivan  Editing by B. Ajith Kumar  Music by Lydian Nadhaswaram, Fernando Guerreiro, Miguel Guerreiro, Mark Killian (Background Score)  Produced by Antony Perumbavoor Directed by Mohanlal  Mohanlal, one of the legends of Indian Cinema, debuted as a director with the film, Barroz. The movie is shot in 3D cameras and presents a different story from regular commercial formula films with International cast in leading roles besides Mohanlal. Movie released on 25th December for Christmas season worldwide. Let's discuss about this different attempt from a Superstar.  Plot:  Barroz(Mohanlal) wakes up in a treasure room in the basement of Da Gama palace in Goa, preventing a theft attempt. He realises that he is a ghost and governed by an African Voodoo Doll. Being in shackles, he waits patiently for 389 years for the legitimate heir of Da Gama treasure to be free and hand it over to the rightful owners.  Isabella(Maya Rao West), a highly spoilt brat, gets suspended from her school and her father has plans to demolish Da Gama palace and convert it into a luxury casino, according to Goa government plans. But she is opposite to that idea. She finds out that she is the legitimate heiress of Da Gama's kin. What will she do to free Barroz? Will it be easy as many other tryants have plans to steal the treasure? Watch the movie to know more.  Analysis:  Mohanlal has a performer is no doubt a great actor. He did a good job in this film too but direction seems to have weighed on his shoulders. At places, he did try something new with his performance but it felt slightly artificial and without context.  International actors, mainly, Maya Rao West looked clueless at important places and her performance doesn't really add to the film's emotional core. Which in-turn keeps us away from investing into her story and entire screenplay. All others either overact or be too dramatic.  Melodrama done well isn't an issue but when it looks forced upon and slightly artificial, then you have issues. Unfortunately, this film's core is surrounded around surrealistic elements from different ethnic beliefs and values. They all needed to sit together but Mohanlal tried to space them out in a narrative that doesn't flow like a river.  It is more like a stop-go motion. It tries to hang a bit too long for 3D effect to take over and you can see that the ambition of director Mohanlal to make a stunning 3D film has taken over his narrative. While the 3D is crafty and passionately brought to life, each shot being constructed for depth effect and prolonged for the desired wow factor slowed down the movie further which already lacks in powerful emotional connect.  Santosh Sivan's camera work, VFX and 3D work are exceptional but they cannot suffice for the lack of proper story, strong emotional core, unintentionally funny songs and performances. If you wish to watch the movie for 3D effect, maybe you can give it a try.  In Conclusion:  Isabella's treasure cannot just be 3D gimmick!  Rating: 2/5

శత వసంతాలు పూర్తి చేసుకున్న ‘మనదేశం’ నిర్మాత సి.కృష్ణవేణి!

Publish Date:Dec 24, 2024

ఆమె పేరు సి.కృష్ణవేణి.. ఒక మహోన్నత వ్యక్తి. తెలుగుజాతికి ఒక మహానటుడిని, ఒక గానగంధర్వుడ్ని పరిచయం చేసిన ఘనత ఆమె సొంతం. బాలనటిగా చిత్ర రంగ ప్రవేశం చేసి నటిగా, గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న ఆమె ఆ తర్వాత మీర్జాపురం రాజాను వివాహం చేసుకొని నిర్మాతగా కూడా మారారు. ఆమె నిర్మించిన తొలి చిత్రం ‘మనదేశం’ ఈ చిత్రం ద్వారా మహానటుడు, ఆంధ్రుల ఆరాధ్యదైవం నందమూరి తారక రామారావును పరిచయం చేశారు. అలాగే మధురగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుకు సంగీత దర్శకుడిగా తొలి అవకాశం ఇచ్చి తెలుగు సినిమా పురోగతికి తనవంతు కృషి చేశారు. కృష్ణవేణి సినీ ప్రస్థానం, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితం గురించిన విశేషాలు ఏమిటో తెలుసుకుందాం.  1924 డిసెంబర్‌ 24న రాజమహేంద్రవరంలో వైద్యుల ఇంట జన్మించారు కృష్ణవేణి. నాలుగేళ్ళ వయసులోనే ‘రామదాసు’ అనే నాటకంలో కమల పాత్ర ధరించి అందర్నీ మెప్పించారు. అది చూసిన దర్శకుడు సి.పుల్లయ్య ‘సతీ అనసూయ’ చిత్రంలో బాలనటిగా అవకాశం ఇచ్చారు. అలా సినీరంగంలోకి ప్రవేశించారు కృష్ణవేణి. ఆ తర్వాత 13 ఏళ్ళ వయసులో కథానాయికగా నటించారు. మీర్జాపురం రాజా నిర్మించిన ‘భోజ కాళిదాసు’ చిత్రంలో రెండవ కథానాయికగా అవకాశం లభించింది. ఆ సమయంలో రాజావారితో పరిచయం పెళ్ళి వరకు వెళ్లింది. కృష్ణవేణికి రంగస్థలంలో ఉన్న అనుభవం, పుస్తక పఠనం, సంగీతంపై పట్టు రాజావారి సినీ వ్యాపారానికి బాగా ఉపయోగపడిరది. తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో 15కి పైగా సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు కృష్ణవేణి. కొన్ని సినిమాల్లో పాటలు కూడా పాడి గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు.  బెంగాలీ నవల విప్రదాస్‌.. కృష్ణవేణికి బాగా నచ్చడంతో దాన్ని సినిమాగా నిర్మించాలన్న ఆలోచన వచ్చింది. అదే విషయాన్ని భర్తతో చెప్పారు. ఆ సమయంలో మీర్జాపురం రాజా ‘జస్టిస్‌’ పార్టీలో ఉన్నారు. ఆ పార్టీ బ్రిటీష్‌ వారికి అనుకూలంగా వుండేది. కృష్ణవేణి చెప్పిన కథ దేశభక్తితో కూడుకున్నది కావడం, బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా ఉండడంతో ఆయన సినిమాగా నిర్మించేందుకు ఒప్పుకోలేదు. అయితే కృష్ణవేణి మాత్రం పట్టుదలగా ఆ సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అందుకే కుమార్తె అనురాధ పేరుతో ఎం.ఆర్‌.ఎ. ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి ‘మనదేశం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కు అప్పగించారు. ఈ సినిమాలోని సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ పాత్ర కోసం ఎన్‌.టి.రామారావును ఎంపిక చేశారు. సంగీత దర్శకుడిగా ఘంటసాలకు తొలి అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఎన్‌.టి.రామారావు పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో ఎంతటి ఘనకీర్తిని సాధించారో అందరికీ తెలిసిందే. ఒక మహానటుడ్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన వ్యక్తిగా కృష్ణవేణి పేరు దేశమంతా మారుమోగిపోయింది.  ఎన్టీఆర్‌, ఘంటసాలనే కాకుండా ఎస్‌.వి.రంగారావు, అంజలీదేవి, సంగీత దర్శకుడు రమేష్‌నాయుడు, జూనియర్‌ శ్రీరంజనిని పరిచయం చేసిన ఘనత కూడా కృష్ణవేణిదే. మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతులు ఎన్నో చిత్రాలను నిర్మించారు. అక్కినేని నాగేశ్వరరావుతో 11 సినిమాలు నిర్మించడం విశేషం. భర్త మరణం ఆమెను మానసికంగా క్రుంగదీసింది. అక్కినేని నాగేశ్వరరావు సలహా మేరకు మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చి ఫిలింనగర్‌లో నివాసం ఏర్పరుచుకున్నారు. కుమార్తె అనురాధ నిర్మాతగా చిత్ర నిర్మాణం చేపట్టారు. కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌తో చేసిన ‘భక్త కుంబార’ అనూహ్య విజయాన్ని సాధించింది. శ్రీవారి ముచ్చట్లు, రాముడు కాదు కృష్ణుడు వంటి ఎన్నో సినిమాలను నిర్మించారు కృష్ణవేణి. ఎన్టీఆర్‌ వంటి మహానటుడిని పరిచయం చేసిన వ్యక్తిగా ఆమెను అందరూ గౌరవిస్తారు. ఆమె చేతి నుంచి డబ్బు తీసుకుంటే తమకు కలిసి వస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే కొందరు కొత్త నిర్మాతలు ఆమె నివాసానికి వెళ్లి పలకరిస్తుంటారు. నటిగా, నిర్మాతగా, గాయనిగా ఆరోజుల్లో మంచి పేరు తెచ్చుకున్న కృష్ణవేణి.. రఘుపతి వెంకయ్యనాయుడు, ఎన్టీఆర్‌ అభినయ పురస్కారాలను అందుకున్నారు. డిసెంబర్‌ 24తో 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణవేణికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తోంది తెలుగువన్‌.

ఆస్కార్‌పై ఇండియా పెట్టుకున్న ఆశలు అడియాసలేనా.. అయినా కొంత సంతోషమే!

Publish Date:Dec 18, 2024

గత ఏడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ఆస్కార్‌ అవార్డు సాధించడంతో అందరూ పండగ చేసుకున్నారు. వరసగా రెండో సంవత్సరం కూడా ఆస్కార్‌ అవార్డును సొంతం చేసుకోవాలనే ప్రయత్నం నార్త్‌ ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో జరిగింది. ఈ సంవత్సరం కూడా ఏదో ఒక విభాగంలో ఆస్కార్‌ అవార్డు వస్తుందని అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే ఒక అద్భుతమైన సినిమాను భారత దేశం తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ చేశారు. ఆమిర్‌ఖాన్‌ మాజీ భార్య కిరణ్‌రావు దర్శకత్వంలో రూపొందిన ‘లాపతా లేడీస్‌’ చిత్రాన్ని బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో ఆస్కార్‌కు అధికారికంగా పంపారు. అయితే ఈ చిత్రానికి నిరాశే ఎదురైంది. అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ చేసిన షార్ట్‌ లిస్టు నుంచి ఈ సినిమా తప్పుకోవాల్సి వచ్చింది.  లాపతా లేడీస్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అయిన తర్వాత సినిమా టైటిల్‌ను ‘లాస్ట్‌ లేడీస్‌’ గా మార్చారు. లాస్ట్‌ అంటే మిస్సింగ్‌ అనే అర్థం వస్తుంది. నిజానికి ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లో చోటు సంపాదించుకోలేకపోవడం ఈ సినిమాకి మిస్సింగ్‌ అనే చెప్పాలి. ఇండియాలో ‘లాపతా లేడీస్‌’ చిత్రం చాలా పెద్ద హిట్‌ అయింది. దీంతో ఈ సినిమాను ఆస్కార్‌కి పంపారు. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలో 85 సినిమాలు ఉండగా వాటిని షార్ట్‌ ఔట్‌ చేస్తే 15 సినిమాలు మిగిలాయి. అందులో లాపతా లేడీస్‌ లేకపోవడం యూనిట్‌ని ఎంతో బాధించింది.  ఇదిలా ఉంటే.. మరో హిందీ సినిమా ఈ షార్ట్‌ లిస్ట్‌లోకి వచ్చింది. బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ కేటగిరిలోనే ఆ సినిమా కూడా ఉండడం విశేషం. ఆ సినిమా పేరు ‘సంతోష్‌’. అయితే ఈ సినిమా యూకే నుండి నామినేట్‌ అయింది. నార్త్‌ ఇండియాలోని గ్రామీణ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రానికి సంధ్య సూరి దర్శకత్వం వహించారు. షహానా గోస్వామి ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు. తమ సినిమా ష్టార్ట్‌ లిస్ట్‌లో ఉండడంతో ‘సంతోష్‌’ యూనిట్‌ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. మరి ఆ 15 సినిమాల్లో ఏ సినిమాకి ఆస్కార్‌ దక్కుతుందో చూడాలి. 

గుండెల్ని పిండేసిన అత్తాకోడళ్లు.. తను ఆ వ్రతం జరగనిస్తుందా!

Publish Date:Dec 25, 2024

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -37 లో... భద్రవతికి రామరాజు సారీ చెప్పినందుకు బాధపడుతుంటే వేదవతి వస్తుంది. ఇంట్లో ఏం జరుగుతుంది అసలు నువ్వు ముగ్గు వేయకుండా ఆ పిల్ల ఎందుకు వేసిందని భద్రావతి పైన కోప్పడతాడు రామరాజు. ఇక ఇంట్లో ఏ గొడవ జరగకుండా చూడు.. అన్ని నువ్వు చూసుకో అని వేదవతికి చెప్తాడు. దాంతో కోపంగా నర్మద దగ్గరికి వెళ్తుంది వేదవతి. నర్మద కూడా వేదవతి కోసం వస్తుంటుంది. నీ వల్లే ఈ గొడవలు.. నీకు ఇవన్నీ పనులు చెయ్యమని నేను చెప్పానా.. ఎందుకు అన్నింట్లో పెద్దరికం చేస్తున్నావని నర్మదపైన కోప్పడుతుంది వేదవతి. దాంతో వేదవతిని నర్మద హగ్ చేసుకొని.. మీరు చాలా గ్రేట్ అత్తయ్య మా అమ్మనాన్నలకి దూరంగా ఉండి రెండు రోజులు అవుతుంది.. నాకే ఏదోలా బాధగా ఉంది కానీ మీరు ఇన్ని సంవత్సరాలుగా మీ వాళ్ళకి దూరంగా ఉంటూ ఎంత బాధని అనుభవిస్తున్నారని నర్మద ఎమోషనల్ అవుతుంది. దంతో వేదవతి అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటుంది. ఆ తర్వాత వేదవతి గుడికి వెళ్తుంది. అక్కడ కొంతమంది వేదవతి తన కొడుకు కోడలు చేత సత్యనారాయణ వ్రతం చేయించలేదంటూ మాట్లాడుకుంటారు. అది విని రామరాజుకి చెప్పి పూజ జరిపిద్దామని తనే అనేలా చేస్తుంది వేదవతి. అది చూసి చూసావా వదిన మా అమ్మ పూజ జరిపించడానికి ఎలా నరక్కుంటూ వస్తుందోనని నర్మదతో ధీరజ్ అంటాడు. ఆ తర్వాత నర్మద, ధీరజ్ లు పూజకి కావలిసినవి కొనడానికి వస్తారు. అక్కడికి ప్రేమ వస్తుంది. మళ్ళీ ఎప్పటిలాగే ధీరజ్, ప్రేమలకి గొడవ అవుతుంది. ఆ తర్వాత ప్రేమ మా ఇంట్లో పూజ ఉంది రావాలనంటుంది. ఆ మాటలు తన అన్న విశ్వ విని దగ్గరికి వచ్చి నర్మద పైన కోప్పడి.. ప్రేమని ఇంటికి తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత విశ్వ ఇంటికి వెళ్లి.. ఆ నర్మద మన ప్రేమతో పూజకి రమ్మని చెప్తుందని భద్రవతికి చెప్తాడు. ఆ పూజ ఎలాగైనా ఆపాలని భద్రవతి అంటుంది. ఎలా అని విశ్వ అనగానే.. నేను చూసుకుంటానని ప్రసాదరావుకి ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది భద్రవతి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Nazeeruddin Shaik wins aha Telugu Indian Idol 3

Publish Date:Sep 23, 2024

In a thrilling grand finale streamed on aha OTT, 19-year-old Nazeeruddin Shaik from Andhra Pradesh emerged victorious as the winner of aha Telugu Indian Idol Season 3. His captivating performances throughout the competition earned him both the prestigious title and a cash prize of Rs. 10 lakh. Recently clearing his CA intermediate examinations, Nazeeruddin also received the exciting opportunity to lend his voice to the highly anticipated upcoming film starring Pawan Kalyan, OG. His remarkable journey to victory was characterised by consistent excellence, which endeared him to both the audience and the judges. Anirudh Suswaram secured second place, winning Rs. 3 lakh, while GV Shri Kerthi claimed third place with a prize of Rs. 2 lakh. The show, which concluded after nearly 26 weeks of fierce competition, was judged by the esteemed Thaman S, Geetha Madhuri, and Karthik, all of whom noted that this season showcased extraordinary talent. Judge Geetha Madhuri said, "aha Telugu Indian Idol Season 3 was an incredible experience filled with talented contestants. It truly felt like a celebration of music. Choosing the finalists was extremely challenging, and every elimination was painful." Nazeeruddin was born on November 2, 2004, in Tadepalligudem to Shaik Baji, a motor mechanic, and Madeena Beebi, who passed away a year ago. His sister, Vahida Rehman, has stepped in to support him after their mother's passing. He completed his schooling at Vignana Vikas E.M School and continued his education at GSR E.M School. He pursued his Junior College and CA Intermediate at Sri Medha Commerce College in Guntur, aspiring to become a Chartered Accountant while nurturing his passion for music. Nazeeruddin's musical journey has been profoundly shaped by his maternal grandparents, Kasim Saheb and Fatima Bee. His maternal grandmother, a Carnatic music guru, played a pivotal role in cultivating his talent. Growing up listening to the iconic songs of Ghantasala ignited his dedication to music. Reflecting on his victory, Nazeeruddin shared, "My journey with music began when I was just four years old. It was my grandfather, Kasim garu, and his sister whom I affectionately call Nani, who introduced me to this world. She enrolled me in Carnatic music lessons, while my grandfather taught me the nuances of cinematic music. Having sung for Ghantasala garu, his admiration for him has never wavered. For 47 years, he has honored Ghantasala's memory by observing his death anniversary in our village, Tadepalligudem. Thanks to my grandfather's efforts, a statue of Ghantasala garu stands in our village." "Winning the title of Telugu Indian Idol Season 3 is a key milestone for me. Performing in front of Thaman sir, Geetha Madhuri ma’am, and Karthik sir was an honor. Their feedback, along with lessons from my fellow contestants, has shaped my growth as a singer. Moving forward, I aim to be a leading musician in the industry while pursuing a career in finance, " he added. The competition began with over 15,000 aspiring singers, showcasing immense talent throughout the season. Initial auditions took place on May 4, 2024, in New Jersey and Hyderabad. The top 12 finalists included Bharat Raj, Keerthana, Keshav Ram, Hari Priya, GV Shri Kerthi, Nazeeruddin, Skanda, Duvvuri Sridhruthi, Rajani Sree, Sai Vallabha, Khushal Sharma, and Anirudh Suswaram. After rigorous eliminations and public voting across 28 episodes, the competition culminated in a final showdown featuring the top five contestants: Anirudh Suswaram, Skanda, Keerthana, Sri Keerthi, and Nazeeruddin. The finalists dazzled in vibrant attire during the blockbuster finale, which included special performances from the judges and contestants. Judge Geetha Madhuri, in a striking red outfit, captivated the audience with her exceptional performance. The Judges Thaman and Karthik also presented outstanding performances during the blockbuster finale episode. The blockbuster finale, streamed on September 20-21, 2024, celebrated the remarkable journeys of these talented singers. If you missed the thrilling finale episode, catch it now only on aha.

జనసేనలో చేరుతున్న మంచు మనోజ్ అండ్ మౌనిక రెడ్డి?

Publish Date:Dec 16, 2024

1993 లో విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన'మేజర్ చంద్ర కాంత్' చిత్రం ద్వారా బాలనటుడుగా సినీ ఆరంగ్రేటం చేసిన నటుడు మంచు మనోజ్.ఆ తర్వాత కూడా బాలనటుడుగా తన తండ్రి మోహన్ బాబు నటించిన పలు సినిమాల్లో చేసిన మనోజ్ 2005 లో 'సంతోషం' మూవీ ఫేమ్ దశరధ్ దర్శకత్వంలో వచ్చిన 'శ్రీ' అనే మూవీతో సోలో హీరోగా మారాడు.బిందాస్, మిస్టర్ నూకయ్య,వేదం,రాజుభాయ్,గుంటూరోడు,కరెంటు తీగ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాడు. మనోజ్తన భార్య మౌనికరెడ్డి తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో చేరబోతున్నట్టుగా  వార్తలు వస్తున్నాయి.వాటిల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గాని మనోజ్ అండ్ మౌనికజనసేన లో చేరడం పక్కా అని అంటున్నారు. మనోజ్ కి గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, విష్ణు ల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన లో చేరే వార్త హాట్ టాపిక్ గా మారింది.  పవన్, మనోజ్ మధ్య ఎప్పటినుంచో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయాన్ని  మనోజ్ చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది.ఇక మౌనిక రెడ్డి కూడా మొదటి నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన ఆవిడే.  

Sudha Kongara & Hombale project is going to be Biggest Multistarrer

Publish Date:Jul 12, 2022

Even though it came before 'KGF,' Hombale Films became well-known with that film. The films are being announced, completed, and ready for release as a result of the momentum created by that film. Production is currently working on 'Salaar' in Telugu and 'Tyson' in Malayalam. Other pan-India films have also just been announced.   However, a film directed by Sudha Kongara was recently announced. Except for the fact that they stated that it will be a big film, they did not mention the casting. There are some new rumours floating around about this. If those rumours are true, this combination will be spectacular. According to sources, Sudha Kongara project is going to be multi starrer.  Furthermore, the names of those heroes are currently being spread.   According to the latest rumours, this film would star Suriya and Dulquer Salman, who have established as star heroes in the South with a string of superhits. According to industry reports, Surya, who has become acquainted of Sudha Kongara's direction in 'Akaasham Nee Haddura,' responded OK without even hearing the story. It is stated that discussions about this film are ongoing, and that full details will be released soon. Pre-production work will begin soon.   Hombale is synonymous with big-budget films. This film is expected to be in the same budget range as the previous one. Suriya's film is also popular in Telugu. Dulquer films have a cult following in the South. This combination is surely going to be crazy.

Ranbir and Alia in love

Publish Date:May 10, 2018

విడుదలై 2 

Publish Date:Dec 20, 2024

యూఐ

Publish Date:Dec 20, 2024

పుష్ప 2

Publish Date:Dec 5, 2024

Bachhala Malli

Publish Date:Dec 20, 2024

Mufasa: The Lion King

Publish Date:Dec 20, 2024

Viduthalai Part 2

Publish Date:Dec 20, 2024

UI

Publish Date:Dec 20, 2024

Pushpa 2

Publish Date:Dec 5, 2024