సేమియా ఊతప్పం
సేమియా ఊతప్పం
కావాల్సిన పదార్ధాలు:
పెరుగు - ఒక కప్పు
రవ్వ - ఒక కప్పు
సేమియా - ఒక కప్పు
వంట సోడా - అర కప్పు
అల్లం - చిన్న ముక్క
పచ్చిమిర్చి - మూడు
నూనె - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - 1 1/4 కప్పులు
తాలింపు కొరకు:
నూనె - అర టేబుల్ స్పూన్
ఉల్లిపాయ తరుగు - పావు కప్పు
జీలకర్ర - అర టీ స్పూన్
తయారీ విధానం:
* అల్లం, పచ్చిమిర్చిని మెత్తగా దంచుకోవాలి.
*పెరుగులో, వంట సోడా కలిపి 30 సెకన్లు పక్కన పెట్టుకోవాలి. అలా కలపడం వలన పెరుగు పొంగుతుంది.
* పొంగిన పెరుగులో, రవ్వ, సేమియా, ఉప్పు, నీరు, దంచిన అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలిపి కనీసం 30 నిమిషాల వరకు అలానే వుంచాలి.
* నూనె వేసి, ఉల్లిపాయ, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక నిమిషం వేపి, పులిసిన పిండిలో కలిపేయాలి.
* పెనంని వేడి చేసి, గరిటితో పిండిని పెనం మీద పోసి నెమ్మదిగా తడుతూ వుంటే పిండి కాస్త స్ప్రెడ్ అవుతుంది.
* పిండి అంచుల వెంట నూనె వేసి మీడియం ఫ్లేమ్ మీద ఎర్రగా కాల్చుకోవాలి. తరువాత తిరగేసి మళ్ళీ ఇంకో 2 నిమిషాలు కాల్చి వేడి వేడిగా నచ్చిన పచ్చడితో సర్వ్ చేసుకోవడమే.