రోజ్ మిల్క్ షేక్!
రోజ్ మిల్క్ షేక్!
కావలసిన పదార్థాలు :
రోజ్ సిరప్ - ఒక కప్పు
పాలు - ఒకటిన్నర కప్పు
చక్కెర - ఒక కప్పు
క్రీం - ఒక కప్పు
గుడ్డు - ఒకటి
రోజ్ పెటల్స్ - కొన్ని
తయారుచేసే పద్ధతి :
ముందుగా కాచి చల్లార్చిన పాలు ఓ గిన్నెలోకి తీసుకుని అందులో క్రీం, చక్కెర వేసి బాగా కలపాలి.
ఆ తర్వాత గిలక్కొట్టిన గుడ్డు సొనతో , రోజ్ సిరప్ వేసి బాగా కలపాలి .తరువాత ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో గంటసేపు పెట్టాలి.
ఇప్పుడు పొడవాటి గాజు గ్లాసు తీసుకుని అందులో రోజ్ మిల్క్ షేక్ పైన రోజ్ పెటల్స్ వేసి చల్ల చల్లగా సర్వ్ చేసుకోవాలి...