Ravva Cake
రవ్వ కేక్
సాధారణంగా రవ్వతో చేసే ఉప్మా అంటే పెద్దగా ఇష్టపడరు ఎవరూ. అదే రవ్వతో కొంచం ఆలోచించి వెరైటీస్ చేస్తే బానే అనిపిస్తుంది. దానిలో భాగంగానే రవ్వకేక్ ను ఒకసారి ట్రై చేయండి.
కావాలసిన పదార్ధాలు
* ఉప్మారవ్వ - ఒక కప్పు
* క్యారెట్లు - రెండు
* ఉల్లిపాయ - ఒకటి
* ఉప్పు - తగినంత
* కారం - ఒక స్పూన్
* నూనె - తగినంత
* పెరుగు - ఒక కప్పు
* జీలకర్ర - 1/4 స్పూన్
* ఆవాలు - 1/4 స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఉప్మారవ్వని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ను తురుముకోవాలి. ఒక చిన్న గిన్నెలో రవ్వని తీసుకొని దానిలో క్యారెట్ తురుముని, ఉల్లిపాయముక్కలు, ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ఇందులో కొంచెం పెరుగు వేసి మరీ జోరుగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె తీసుకొని దానిలో జీలకర్ర, ఆవాలు పోపు చేయాలి. ఈ పోపును కలిపి ఉంచుకున్న రవ్వలో వేసుకొని చివరిగా బేకింగ్ పొడి కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి మిశ్రమాన్ని కేక్ ప్యాన్ లోకి తీసుకొని అవన్ (oven) ని 180C ఉష్ణోగ్రత వద్ద ఉంచి ఉడికే వరకూ బేక్ చేసుకోవాలి. ఉడికిన తరువాత దీనిని బయటకు తీసి పీసెస్ లా కట్ చేసుకొని తినవచ్చు. కావాలంటే ఏదైనా పచ్చడితోనైనా తినవచ్చు.