Rava vada Recipe
రవ్వ వడలు
కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - 1 కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అరకప్పు
తురిమిన కొత్తిమీర - పావుకప్పు
తురిమిన కరివేపాకు - 2 చెంచాలు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి - 2 చెంచాలు
పెరుగు - అరకప్పు
జీలకర్ర - అర చెంచా
అల్లం తురుము - పావు చెంచా
వంట సోడా - చిటికెడు
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
ఓ బౌల్ లో రవ్వ, పెరుగు వేసి బాగా కలపాలి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, సోడా వేసి గారెల పిండి మాదిరిగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే కొద్దిగా నీళ్లు కూడా చేర్చుకోవచ్చు.
ఈ మిశ్రమాన్ని అరగంట పాటు పక్కన పెట్టాలి. ఆ తరువాత స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. కాగిన తర్వాత రవ్వ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, వడల్లాగా వత్తి నూనెలో వేయాలి. బాగా వేగిన తరువాత దించేసుకుని కొబ్బరి చట్నీతో కానీ పుదీనా చట్నీతో కానీ వడ్డించాలి.