Ragi Poori Recipe
రాగి పూరీలు
కావలసిన పదార్థాలు:
రాగిపిండి - ఒక కప్పు
గోధుమపిండి - ఒక కప్పు
నెయ్యి - రెండు చెంచాలు
ఉప్పు - తగినంత
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం:
ఓ బౌల్ లో రాగిపిండి, గోధుమ పిండి వేసి బాగా కలపాలి. దీనిలో తగినంత పు్పు, నెయ్యి వేసి కలపాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తుకోవాలి. ఈ పూరీల్ని నూనెలో వేయించుకోవాలి.
- Sameera