రాగి అంబలి
రాగి అంబలి
రాగి పిండి, ఉల్లిపాయ, పెరుగు, ఉప్పు, కొత్తిమీరతో రాగి అంబలిని 10 నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు:
రాగి పిండి - 3 లేదా 4 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయలు తరిగినవి - 1/2 ఉప్పు - రుచికి సరిపడా
పెరుగు -1/2 కప్పు
కొత్తమీర- అలంకరించానికి
మంచి నీళ్లు - 2 కప్పులు
తయారీ విధానం:
1. రాగి పిండిని మీడియం మంట మీద సువాసన వచ్చే వరకు పొడిగా వేయించాలి.
2.కొద్దిగా ఉప్పు వేసి నీటిని మరిగించండి. మంచి జీర్ణక్రియ కోసం మీరు అందులో చిటికెడు ఇంగువను జోడించవచ్చు.
3.క్రమంగా రాగుల పిండిని వేసి ముద్దలు రాకుండా కలుపుతూ ఉండండి.
4.ఒక మృదువైన పేస్ట్ ఏర్పడే వరకు బాగా కలపండి. గ్యాస్ ఆఫ్ చేయండి.
5.ఇప్పుడు పెరుగును పలుచన చేయడానికి, అందులో కొంచెం నీరు చిలక్కొట్టండి.
6.ఒక గ్లాసులో రాగి ముద్దను తీసుకుని, అందులో పెరుగు, ఉల్లిపాయ వేసి బాగా కలపాలి.
7.పచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.