Pudina Tomato Sauce

 

 

 

పుదీనా టమాటో సాస్

 

ఈ పుదీనా టమాటా పేస్ట్ పరోతాలతో, ఇడ్లిలతో, దోసలతో ఇంకా చెప్పాలంటే అన్ని రకాల టిఫిన్స్ లోకి మంచి కాంబినేషన్. దీనిని ఒకసారి తయారుచేసుకుంటే చాలు చాలా రోజులు నిలవ ఉంటుంది. మరి దీనికి కావలసినవి ఏంటో ఎలా తయారుచెయ్యాలో చూద్దాం.

 

కావాల్సిన పదార్థాలు:
పండు టమాటోలు - అరకేజీ
ఎండబెట్టిన పుదీనా పొడి - 1 కప్పు
కారం - 1/4 చెంచా
పంచదార - 1/4 కప్పు
వెనిగర్ - 1/4 చెంచా
ఉప్పు - తగినంత

 

తయారి విధానం:
దీనికోసం ముందుగా టమాటాల మీద తొక్క తీసి మధ్యకి కోసి అందులో ఉండే గింజలను తీసెయ్యాలి. ఒక కడాయిలో 2 చెంచాల నూనే వేసి ఆ టమాటా ముక్కల్ని వేయాలి. అవి కాస్త మగ్గాకా అందులో పుదీనా పొడి, పంచదార, ఉప్పు కారం, వెనిగర్ వేసి ఆ మిశ్రమం మొత్తం చిక్కబడేదాకా కలుపుతూ ఉండాలి. మొత్తం దగ్గర పడ్డాక తీసి చల్లార్చి ఏదైనా సీసాలో భద్రపరుచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు దీనిని అన్ని రకాల టిఫిన్స్ లో నంచుకుని తినచ్చు. కాస్త పుల్లగా, కాస్త కారంగా మధ్యలో పుదీనా వాసన తగులుతూ భలే టేస్టీ టేస్టీ గా ఉంటుంది.

-కళ్యాణి