Poha Pudding Recipes
పోహా పుడ్డింగ్
కావలసిన పదార్థాలు:
అటుకులు - ఒక కప్పు
పాలు - మూడు లీటర్లు
చక్కెర - రెండు కప్పులు
బియ్యప్పిండి - నాలుగు చెంచాలు
యాలకుల పొడి - ఒక చెంచా
ఉప్పు - చిటికెడు
కుంకుమపువ్వు - చిటికెడు
జీడిపప్పు, బాదంపప్పు, కిస్ మిస్ - కావలసినన్ని
నెయ్యి - నాలుగు చెంచాలు
తయారీ విధానం:
రెండు చెంచాల నేతిలో జీడిపప్పు, బాదం పప్పు, కిస్ మిస్ లను వేయించి పక్కన పెట్టుకోవాలి. అటుకుల్ని నీటిలో వేసి, రెండు క్షణాలు ఉంచి తీసేయాలి. నీరు లేకుండా బాగా పిండేయాలి. తరువాత వీటిని ఓ కప్పు పాలలో నానబెట్టి ఉంచాలి. మరో కప్పు పాలలో బియ్యప్పిండిని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. మరికొన్ని పాలలో కుంకుమపువ్వు కలిపి పక్కన పెట్టాలి. మిగిలిన పాలలో యాలకుల పొడి వేసి స్టౌ మీద పెట్టాలి. పాలు కాగిన తరువాత బియ్యప్పిండి కలిపి పెట్టిన పాలను వేయాలి. ఉండలు కట్టకుండా సన్నని మంటమీద ఉడికించాలి. చిక్కగా అయ్యిన తరువాత పాలలో నానబెట్టిన అటుకులు కూడా వేయాలి. పది నిమిషాల పాటు ఉడికించాక చక్కెర వేయాలి. చక్కెర బాగా కరిగి, మిశ్రమం దగ్గరగా అయ్యేవరకూ ఉడికించి వేయించి పెట్టుకున్న బాదం, జీడిపప్పు, కిస్ మిస్ వేయాలి. చివరగా కుంకుమపువ్వు కలిపిన పాలు, నెయ్యి కూడా వేసి బాగా కలిపి దించేయాలి.
- sameera