Pizza Paratha Recipe
పరాటా పిజ్జా
పిజ్జా పేరు వింటే చాలు పిల్లలకి ఎంత ఆనందమో చెప్పలేం. వాళ్ళని అనుకోవటం దేనికి పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య దీనికి బాగానే అలవాటు పడ్డారు. అలాంటి పిజ్జాని కాస్త హేల్తి వెజిటబుల్స్ తో స్టఫ్ చేసి పరాటా పిజ్జాలా వాళ్ళ ముందు ఉంచితేనో, ఆహా భలే ఉంటుంది కదూ.
కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి - 2 కప్పులు
పంచదార - 1 చెంచా
ఈస్ట్ - 1 చెంచా
ఉప్పు, నూనె - తగినంత
స్టఫ్ఫింగ్ కోసం:
సన్నగా తరిగిన కొత్తిమీర - 3 చెంచాలు
సన్నగా తరిగిన క్యాబేజ్ - 1/2 కప్పు
సన్నగా తరిగిన స్వీట్ కార్న్ - 1/2 కప్పు
వెన్న - 50 గ్రా
మిరియాలపొడి - 1/2 చెంచా
పచ్చిమిర్చి చీలికలు - 2 చెంచాలు
తురిమిన అల్లం - 1 చెంచా
నెయ్యి - 3 చెంచాలు
తయారి విధానం:
ఇది తయారుచేయటానికి ఒక బౌల్ లో మైదా, ఉప్పు, ఈస్ట్, పంచదార, కాస్త నూనే వేసి చపాతి ముద్దలా కలిపి రెండు గంటలు నాననివ్వాలి. అప్పుడు అది చక్కగా రెండింతలు ఉబ్బుతుంది. ఈ లోపు ఇంకొక బౌల్ తీసుకుని అందులో క్యాబేజ్ తురుము, బేబీ కార్న్, వెన్న వేసి అన్నిటిని కలపాలి. అందులోనే కాస్త నూనె మిరియాలపొడి, అల్లం తురుము, పచ్చిమిర్చి చీలికలు ఉప్పు వేసి బాగా కలపాలి. కార్న్ లో ఉన్న నీటి వల్ల ఆ మిశ్రమం అంతా ముద్దగా అవుతుంది. ఇప్పుడు నానిన మైదా ముద్దని చపాతిల వట్టి అందులో కార్న్ మిశ్రమాన్ని ఉంచి మళ్లీ మెల్లిగా చేత్తో వత్తుకోవాలి. అలా తయారయిన వాటిని పెనం మీద వేసి నేతితో అటు ఇటు ఎర్రగా కాల్చి టమాటో సాస్ తో తింటే హేల్తీ పరాటా పిజ్జా భలే యమ్మీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి మరి.
- కళ్యాణి