Read more!

Mutton Kurma Recipe

 

 

 

మటన్‌ కుర్మా రెసిపి

 

 

 

 

కావలసిన పదార్థాలు:

మటన్‌ - అరకేజీ,

ఉప్పు - తగినంత,

కారం - 4 టీ స్పూన్లు,

గరం మసాలా - 2 టీ స్పూన్స్

నూనె - తగినంత,

కొత్తిమీర - సరిపడగా

పెరుగు - కప్పు,

కొబ్బరి - సరిపడా

పల్లీలు - 40 గ్రాములు,

గరంమసాలా - టీ స్పూను,

నువ్వులు - 10 గ్రాములు

బాదంపప్పు - 20 గ్రాములు

 

తయారీ విధానం :

ఇలా ముందుగా , పల్లీలు, నువ్వులు, విడి విడి గా వేయించుకోవాలి.గరంమసాలా, ,కొబ్బరిపొడి బాదంపలుకులు వీటన్నిటిని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి.

ఇప్పుడు పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కాగిన తరవాత పేస్ట్ ను వేసి కొద్దిసేపువేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్‌, కారం వేసి కలపాలి.

ఇప్పుడు మటన్‌ వేయాలి. ముక్కలు మెత్తగా మగ్గిన , గరం మసాలా, ఉప్పు, పెరుగు, నీరు పోసి బాగా ఉడకనివ్వాలి.

పూర్తిగా నీరు మొత్తం ఇగిరిపోయాకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో డెకరేట్ చేసుకోవాలి.