Mutton Keema

 

 

మటన్ కీమా

 

 

కావలసిన పదార్థాలు:

మటన్ కీమా -  ½ kg
టొమాటో - 1/4 kg
ఎండుకొబ్బరి తురుము - ఒక కప్పు
ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు
కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - ఒక కట్ట   
అల్లం వెల్లుల్లి పేస్టు - 2 టేబుల్ స్పూన్లు
కారం - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - ½ టీ స్పూన్
ధనియాల పొడి - 2 టేబుల్ స్పూన్లు
గరం మసాలా - 1 టీ స్పూన్
ఉప్పు - తగినంత
నూనె -  2 టేబుల్ స్పూన్లు


తయారుచేసే విదానం:

ముందుగా మటన్ కీమాలో పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలిపి ప్రక్కన పెట్టాలి. ఒక గిన్నెలో నూనె తీసుకొని ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత, మసాలాలు కలిపిన కీమా వేసి కలపాలి. 5 నిముషాలు మగ్గిన తరువాత సన్నగా తరిగిన టొమాటో ముక్కలు వేసి కలపాలి. ఒక కప్పు నీళ్ళు పోసి, మూట పెట్టి 10 నిముషాలు ఉడకనివ్వాలి. ఎండుకొబ్బరి తురుముని పొడిగా వేపుకొని, మెత్తని పేస్టు చేయాలి. ఈ పేస్టుని ఉడుకుతున్న కీమాలో వేసి కలపాలి. మంట తగ్గించి ఇంకొక 10 నిముషాలు ఉడకనివ్వాలి. కీమా నుండి నూనె వేరుపడినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, కొత్తిమీర తరుగు వేయాలి. ఇది చపాతీలోకైనా అన్నంలోకైనా బాగుంటుంది.