Read more!

పెసరపప్పు సూప్

 

పెసరపప్పు సూప్

కావాల్సిన పదార్థాలు:

పెసరపప్పు- పావు కప్పు

నీళ్లు - రెండు కప్పులు

నెయ్యి - ఒక టేబుల్ స్పూన్

జీలకర్ర- అర టేబుల్ స్పూన్

తురిమిన అల్లం- అర టేబుల్ స్పూన్

క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు - అర కప్పు

మిరియాలు - పావు కప్పు

అల్లం పొడి - చిటికెడు

వాము - చిటికెడు

ఉప్పు - రుచికి సరిపడా

మెంతి కూర - కొద్దిగా

తయారీ విధానం:

ముందు పెసరపప్పును అరగంట నానబెట్టాలి. తర్వాత అందులో నీళ్లన్నీ వంపేయాలి. స్టవ్ పై కుక్కర్ పెట్టి అందులో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడి అయిన తర్వాత అందులో జీలకర్ర, తురిమిన అల్లం వేయాలి. తర్వాత పెసరపప్పును వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్, గుమ్మడికాయ ముక్కలు వేసి కలపాలి. కొద్దిగా వేగిన తర్వాత అందులో కొన్ని నీళ్లు పోసి మరోసారి కలిపి కుక్కర్ మూత పెట్టాలి. ఇప్పుడు స్టవ్ ను చిన్న మంటపై ఉంచి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అయితే సూప్ మెత్తాగా రావాలంటే ఇంకో విజిల్ వరకు ఉడికించుకోవచ్చు.

ఉడికిన తర్వాత అందులో మిరియాలు, వాము, ఉప్పు, అల్లంపొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత దానిపై కాస్త మెంతికూర వేసి గార్నిష్ చేసుకోవాలి. అంతే ఎంతో టేస్టిగా ఉండే పెసరపప్పు సూప్ రెడీ అయినట్లే. దగ్గు, జ్వరం, జలుబు ఉన్నప్పుడు దీన్ని తింటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.