Mexican Sharbat
మెక్సికన్ షర్బత్
ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చాకా ఒక గ్లాస్ తో చల్లటి జ్యూస్ తాగితే ఆ హాయే వేరబ్బా. ఎప్పుడూ తాగే ఆపిల్, మాంగో, గ్రేప్, వాటర్ మిలాన్ ఇలాంటి వాటికన్నా కాస్త వెరైటీ జ్యూస్ ట్రై చేస్తే ఎలా ఉంటుంది. మెక్సికన్లు ఎండా కాలంలో ఎక్కువగా ఈ షర్బత్ తాగుతారు. బియ్యం నానబెట్టి తయారుచేసే ఈ షర్బత్ వేసవి ఎండలకి చాలా మంచిదట.
కావలసిన పదార్థాలు:
బియ్యం - 1 కప్పు
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
నిమ్మకాయ తొక్క - ఒకటి (పై తొక్క మాత్రమే)
నీళ్ళు - తగనన్ని
ఐస్ క్యూబ్స్ - కొన్ని
తయారి విధానం:
ఈ షర్బత్ తయారుచేయటానికి బియ్యాన్ని, బాదం పప్పుని నానబెట్టుకోవాలి. బియ్యం నానిన తరువాత మిక్సిలో మెత్తగా రుబ్బుకోవాలి. అలాగే బాదం పప్పులు తొక్కు తీసి వాటిని, దాల్చిన చెక్క, నిమ్మ తొక్కలను కూడా మిక్సిలో మెత్తగా పొడి చేసి ఆ పొడిని బియ్యంపిండి మిశ్రమంలో వేసి అందులో వేసి నీళ్ళు పోసి ఒక రోజు రాత్రంతా నాననివ్వాలి. మర్నాడు ఆ నానిన మిశ్రమాన్ని మళ్లీ మరో సారి మిక్సిలో వేసి తిప్పి తీయాలి. అందులో రెండు కప్పుల నీళ్ళు పోసి ఆ నీటిని వడకట్టాలి. ఆ నీటిలో పంచదార వేసి మరో రెండు కప్పుల నీళ్ళు కలిపి ఐస్ క్యూబ్స్ తో చల్ల చల్లగా తాగటమే. కాస్త వెరైటీ టేస్ట్ తో ఉండే ఈ మెక్సికన్ షర్బత్ టేస్ట్ చేసి చూడండి.
- కళ్యాణి