Masala Vada

 

 

 

మసాలా వడ

 

 

 

ఎప్పుడూ చేసుకునే గారెల కంటే బొబ్బర్ల తో వెరైటీగా వుండే ఈ మసాలా వడ ఒకసారి ట్రై చేసి చూడండి. రుచిగా వుంటుంది . ఆరోగ్యం కూడా . చేయటానికి పట్టే సమయం కూడా తక్కువ .

 

కావాల్సిన పదార్దాలు :

మినప్పప్పు                       - 1 కప్పు

పచ్చి శనగపప్పు                 - 1 కప్పు

పెసరపప్పు                         -  1/2 కప్పు

బొబ్బర్లు                            - 1/2 కప్పు

పెద్దఉల్లిపాయ                     - ఒకటి

పచ్చిమిర్చి                         - ౩

కొత్తిమీర                            - 1 కట్ట

అల్లం                                - తగినంత 

లవంగాలు                          - ౩

జీలకర్ర                              - కొద్దిగా

నూనె                                -- వడలు వేయించటానికి సరిపడా 

 

తయారుచేయు విధానం;

* పప్పులన్నీకలిపి  నాలుగు గంటలు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. ఆతర్వాత కడిగి  అల్లం , జీలకర్ర, లవంగాలు వేసి  మిక్సీలో గట్టిగా కచ్చాపచ్చగా అంటే బాగా మెత్తగా అవకుండా పలుకుగా ఉండేలా రుబ్బుకోవాలి .

* తర్వాత కొత్తిమీర ,ఉల్లిపాయ, పచ్చిమిర్చి లని  సన్నగా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి పిండిలో కలపాలి.


* అరచేతిలో కి పిండి తీసుకుని  అంచులు  కొంచెం పలుచగా మధ్యలో కొంచెం ఉబ్బెత్తుగా ఉండేలా చేసి, పైన పెసర పప్పు అద్ది కాగిన నూనెలో వేసి ఎర్రగా వేగనిచ్చి తీయాలి. తరువాత వాటిని డబల్ టిష్యు పేపర్ ఉన్న గిన్నె లోకి  తీసుకోవాలి.

* బొబ్బర్ల తో  మసాలా వడ రెడీ.

 

టిప్; సెనగ పప్పు పడని  వారు సోంపు గింజలు పిండిలో కలిపి వడలు వేసుకోవచ్చు. ఇలా చేయడం వలన త్వరగా జీర్ణం అవుతుంది.