Mango Sabja Pudding (Summer Special)
మ్యాంగో-సబ్జా పుడ్డింగ్
కావలసిన పదార్థాలు:
మామిడి ముక్కలు - అరకప్పు
కొబ్బరిపాలు - ఒక కప్పు
పెరుగు - అరకప్పు
సబ్జా గింజలు - మూడు చెంచాలు
కొబ్బరి తురుము - రెండు చెంచాలు
చక్కెర - రెండు చెంచాలు
వెనిల్లా ఎసెన్స్ - అర చెంచా
తయారీ విధానం:
సబ్జాగింజల్ని అరగంట పాటు నానబెట్టాలి. తరువాత నీళ్లు ఒంపేసి పక్కన పెట్టాలి. పెరుగును బాగా చిలకాలి. ఓ బౌల్ లో కొబ్బరిపాలు తీసుకోవాలి. ఇందులో చక్కెర వేసి కరిగే వరకూ కలపాలి. తరువాత ఇందులో పెరుగు, సబ్జా గింజలు, వెనిల్లా ఎసెన్స్ వేసి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టాలి. పది నిమిషాల తరువాత తీసి, మరోసారి బాగా కలిపి ఫ్రిజ్ లో పెట్టేయాలి. సర్వ్ చేసేటప్పుడు ఓ గ్లాస్ కానీ కప్ కానీ తీసుకుని... అందులో మామిడి ముక్కలు వేసి, దాని పైన ఫ్రిజ్ లోంచి తీసిన మిశ్రమాన్ని వేయాలి. పైన కొబ్బరి తురుము, కొన్ని మామిడి ముక్కలు వేసి అందించాలి.
- Sameera