మ్యాంగో ఫలూడా!

 

మ్యాంగో ఫలూడా! 

 

కావలసిన పదార్థాలు:

మ్యాంగో ముక్కలు  - ½ కప్పు

పాలు - 1 కప్పు

చక్కెర - 2 టేబుల్ స్పూన్లు

ఫలూదా (రైస్ నూడుల్స్) - 2 టేబుల్ స్పూన్లు

సబ్జా గింజలు - 1 టేబుల్ స్పూన్

రూఆఫ్జా - 1 టేబుల్ స్పూన్

ఐస్ క్రీం - 2 టేబుల్ స్పూన్లు

కాజు బాదం ముక్కలు - 1 టేబుల్ స్పూన్

 

తయారుచేసే విధానం:

ముందుగా ఫలూదాని వేడి నీళ్ళల్లో వేసి కాసేపు వుంచి, తరువాత చల్లని నీళ్ళల్లో వేసి తీసి పక్కనపెట్టుకోవాలి. సబ్జా గింజలను నీళ్ళలో నానబెట్టుకోవాలి. తరువాత మిక్సీలో మామిడి పండు ముక్కలు, చక్కెర, పాలు వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాసులో సబ్జా గింజలు వేసి దానిపైన ఫలూదా వేయాలి. తరువాత సన్నగా తరిగిన మామిడి పండు ముక్కలు వేయాలి. తరువాత మిక్సిలో బ్లెండ్ చేసుకున్న పాలు పోయాలి. దానిమీద ఐస్ క్రీం వేసి, కాజు బాదం, రూఆఫ్జా తో అలంకరించాలి.