Read more!

Egg Mutton Biryani

 

 

 

ఎగ్ మటన్ బిర్యానీ

 

 

 

 

కావలసినవి:
గుడ్లు - ఎనిమిది 
బియ్యం - రెండు కప్పులు
ఉల్లిపాయలు - నాలుగు 
కారం - ఒక స్పూన్
ఉప్పు - సరిపడా
పుదీనా - కొద్దిగా 
నూనె - రెండు స్పూన్లు 
నెయ్యి - మూడు స్పూన్లు
అల్లం,వెల్లుల్లి పేస్ట్ - మూడు స్పూన్లు
యాలకులు - నాలుగు
లవంగాలు - ఐదు 
షాజీరా - ఒక స్పూన్
బిర్యానీ ఆకులు - రెండు
జీడిపప్పు - కొద్దిగా 
పచ్చిమిర్చి - నాలుగు 
కొత్తిమీర - కొద్దిగా 

 

 

తయారుచేసే విధానం:
వంట పేరులో మటన్ వుంటుందిగానీ, వంటలో మటన్ వుండదు.. కాకపోతే మటన్ తిన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అదే ఈ వంటలో స్పెషాలిటీ. ఈ స్పెషల్ వంట ఎలా చేయాలంటే...

 

 

ముందుగా గుడ్లు తీసుకుని పగలకొట్టి ఒక గిన్నెలో వెయ్యాలి. అందులో కొంచం కారం కొంచం  ఉప్పు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక చిన్న గిన్నె  తీసుకుని అందులో నూనె వేసి ఈ మిశ్రమాన్ని వేసేసి మూతపెట్టాలి. ఆ మిశ్రమం బాగా పొంగి మందంగా తయారవుతుంది. ఇలా తయారైన ఆమ్లెట్‌ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి కట్ చేసిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కట్ చేసిన ముక్కల్ని కూడా వేసి ఒక పదిహేను నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి. అప్పుడు ఆ ఎగ్ ముక్కలన్నీ మటన్ ముక్కల మాదిరిగా అవుతాయి. ఇప్పుడు వేరొక స్టౌ  మీద వెడల్పాటి గిన్నె పెట్టి నెయ్యివేసి అందులో షాజీరా, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, గుండ్రంగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పుదీనా, జీడిపప్పు  వేసి నాలుగు కప్పుల నీళ్ళు పోసి కొంచం మరిగాక కడిగి పెట్టుకున్న బియ్యం వేసి మూతపెట్టాలి.  రైస్ కొంచం ఉడికిన తర్వాత ముందు తయారుచేసి పెట్టుకున్న ఎగ్ మటన్ కర్రీ వేసి కలిపి ఇంకో పది నిమిషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టౌ  పై నుంచి దించి కొత్తిమీర వేసుకోవాలి. అంతే టేస్టీ అండ్ వెరైటీ ఎగ్ మటన్ బిర్యానీ రెడీ.