Egg Masala Fry

 

ఎగ్ మసాలా ఫ్రై

కావాల్సిన పదార్ధాలు:

ఉడికించిన గుడ్లు - 4

ఉల్లిపాయలు - 3

పచ్చిమిర్చి - 4

ఉప్పు - తగినంత

కారం - 1 టీస్పూన్

పసుపు - 1/4 టీస్పూన్

పుదీనా – కొద్దిగా

కొత్తిమీర – కొద్దిగా

నూనె - నాలుగు టీస్పూన్స్

మసాలా పొడి కోసం:

ధనియాలు - రెండు టీస్పూన్స్

గసగసాలు - రెండు టీస్పూన్స్

ఎండుకొబ్బరి - 1/4 కప్పు

అనాసపువ్వు - 1

దాల్చిన చెక్క - 1

యాలకులు - 3

లవంగాలు - 4

తయారీ విధానం:

సన్నని సెగ మీద మసాలా దినుసులు అన్నీ ఒక్కోటిగా మంచి సువాసన వచ్చేదాక వేపుకోవాలి.వేపుకున్న మసాలాలని చల్లార్చి మెత్తని పొడి చేసుకోండి. స్టౌ మీద కడాయి పెట్టి నూనె వేడి చేసి ఉడికించిన గుడ్లు వేసి మూత పెట్టి కాస్త ఎర్రబడే దాకా వేపుకుని తీసుకోవాలి. అదే నూనెలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే దాకా వేపుకోవాలి. తరువాత వేగిన ఉల్లిపాయల్లో పసుపు, కారం అల్లం వెల్లులి ముద్ద వేసి 2 నిమిషాలు వేపుకోవాలి ఉడికించిన గుడ్లని అంగుళం సైజ్ ముక్కలుగా కోసి కూరలో వేసుకోండి ఇంకా మెత్తగా పొడి చేసుకున్న మసాలా కూడా వేసి 2 నిమిషాలు వేపి, పైన కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలిపి దింపేసుకోండి. అంటే ఎగ్ మసాలా ఫ్రై రెడీ.