Double Ka Meeta

 

 

 

డబల్ కా మీఠా  

 



 

కావలసిన పదార్ధాలు:

* బ్రెడ్ స్లైసస్  

* డ్రైయి ప్రూట్స్ (కిస్ మిస్, జీడిపప్పు, బాదమ్)  - 1/2 కప్పు

* కలర్                - చిటికెడు

* నెయ్యి               - తగినంత

* కండెన్స్ మిల్క్ - 1 కప్పు

* చెక్కర             - 1 కప్పు

* మిల్క్             - 2 కప్పులు

 

తయారుచేసే విధానం:


* ముందుగా స్టౌవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొంచం నెయ్యి వేసి అది వేడెక్కిన తరువాత బ్రెడ్ స్లైసస్ ను ఒక్కొక్కటిగా వేసి  గోలేడ్ బ్రౌన్ కలర్ వచేవరకు ఫ్రై  చేసి పక్కన పెట్టాలి.
* ఇప్పుడు పాన్ లో చక్కెర తీసుకొని అందులో నీరు పోసి స్టౌవ్ పై పెట్టి పాకం పట్టుకోవాలి.
* పాకం తయారు అయ్యే లోపులో ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్లైసస్ ను ఒక గిన్నెలో పెట్టుకొని.. వాటిపై కొంచం పాలు పోసి పెట్టుకోవాలి.
* చక్కెరలో ఫుడ్ కలర్ ను వేసి అది కొంచం తీగ పాకం వచ్చేంత వరకూ ఉంచి.. ఆ పాకాన్ని పక్కన పెట్టి ఉంచిన బ్రెడ్ స్లైసస్ పై పోయాలి.
* మరొక ప్యాన్ తీసుకొని కొంచం నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ ఫ్రై  చేసి బౌల్ లో వేసి  పక్కనపెట్టాలి. (అన్ని డ్రైయి ప్రూట్స్ తీసుకోవచ్చు).
* చివరగా గిన్నెలో పాలుపోసి వేడి చేసి అందులో కొద్దిగా కండెన్స్ మిల్క్ పాలు పోసి దగ్గరకి వచ్చిన తరువాత  స్టౌవ్ ఆఫ్ చేసి.. ఈ పాలను బ్రెడ్ స్లైసస్ లో పోసి కొంచెం ఇలాచి పౌడర్.. ఫ్రై చేసిన డ్రై ప్రూట్స్ అన్నీ వేయాలి.
* కొద్దిసేపటి తరువాత అంత గట్టి పడుతుంది. ఇది ఫ్రీస్ లో పెట్టవలసిన అవసరం లేదు. అంతే మనకి కావలసిన డబల్ కా మీఠా రెడీ.