corn cutlet
కార్న్ కట్లెట్
కావలసిన పదార్థాలు :
మొక్కజొన్న గింజలు : 2 కప్పులు,
శనగపిండి : కప్పు.
పచ్చిమిర్చి : 5,
నూనె : సరిపడా
కొబ్బరి తురుము : కప్పు,
బ్రెడ్ పొడి : 100 గ్రాములు
కొత్తిమీర : అరకప్పు,
అల్లంవెల్లులి పేస్టు : టేబుల్ స్పూన్,
తయారుచేసే పద్ధతి :
ముందుగా మొక్కజొన్న గింజలు, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులో శనగపిండి, అల్లంవెల్లులి పేస్టు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఆ పేస్ట్ ను ముద్దలా తీసుకుని గుండ్రం గా చేసి ఒత్తి వీటిని బ్రెడ్ పౌడర్లో అద్దుకుని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి పెనం మీద కొద్దిగా నూనె వేసి కట్లెట్ను వేసి రెండు పక్కల బ్రౌన్ కలర్ వచ్చె వరకు కాల్చాలి. అంతే టేస్టీ కార్న్ కట్లెట్ రెడీ దీన్ని టమాటో సాస్ తో కానీ చిల్లి సాస్ తో తీసుకోవచ్చు..