Choco Banana Smoothie
Choco Banana Smoothie
కావాలసిన పదార్ధాలు :
అరటి పండ్లు - 2
పెరుగు - 1 కప్పు
పంచదర పొడి - 2 చెంచాలు
చాక్లెట్ ఐస్ క్రీమ్ - 1/2 కప్పు
తయారీ విధానం :
ముందుగా అరటి పండ్లు తొక్క తీసి దానిని చిన్న చిన్న ముక్కలుగా కోసి కొంచెం సేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
ఇప్పుడు కూల్ అయిన అరటి ముక్కలని తీసుకొని, అందులో పెరుగు, పంచదార పొడి వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
అలా మెత్తగా అయిన మిశ్రమంలో చాక్లెట్ ఐస్ క్రీమ్ వేసి మెత్తగా మరింత స్మూత్ అయ్యేంతవరకూ గ్రైండ్ చేసుకోవాలి.
అలా మెత్తగా అయిన జ్యూస్ ను గ్లాస్ లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే.
నోట్ :
ఈ స్మూదీ చల్లగా ఉండటానికి ఐస్ క్యూబ్స్ వాడటం కంటే.. అరటి పండ్ల ముక్కలే కొంచెం సేపు ఫ్రిజ్ లో ఉంచి తయారుచేసుకోవడం మంచిది
మామూలు చెక్కర వాడటం కంటే చెక్కర పొడిని వాడితే బెటర్. ఎందుకంటే పొడి స్మూదీలో బాగా కలుస్తుంది కాబట్టి.