Cauliflower kurma kura
కాలీఫ్లవర్ కుర్మాకూర
కావలసిన పదార్థాలు:
కాలీఫ్లవర్ మొగ్గలు - 1 కప్పు
ఉల్లిపాయముక్కలు - అర కప్పు
టమాటాలు - 2
చింతపండురసం - పావు కప్పు
కారం - 2 చెంచాలు
ఉప్పు - 1 చెంచా
అల్లం వెల్లుల్లి - 1 చెంచా ముద్ద
పచ్చిమిర్చి - 2
కరివేపాకు - 10 ఆకులు
ఆవాలు - అర చెంచా
జీలకర్ర - అర చెంచా
నూనె - సరిపడ
కొత్తిమీర - కొద్దిగా
తయారు చేయు విధానం:
కాలీఫ్లవర్ కడిగి, శుభ్రపరచి మొగ్గలుగా తుంచుకుని.. నూనెలో వేయించి ప్రక్కన పెట్టుకోవాలి. మూకుడులో పోపుకి నూనె వేడిచేసుకుని ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపువేసి వేగుతుండగా ఉల్లి ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు వేసి చిన్న మంటపై బాగా గుజ్జులా ఉడికేలా మూతపెట్టి మగ్గించుకోవాలి. మూత తీసి చింతపండురసంపోసి కారంవేసి.. ఉడికాక కాలీఫ్లవర్ ముక్కలు కలిపి మరికొంచెంసేపు ఉడికించి.. కొత్తిమీరతో అలంకరించుకోవాలి. ఈ పులుసు పుల్లగా... కారంగా ఉంటుంది. అన్నంతో చాలా రుచిగా ఉంటుంది.
- భారతి