Carrot Vada

 

 

 

క్యారెట్‌ తురుముతో గారెలు..

 


కావలసిన పదార్థాలు:

* మినపప్పు: ఒక కప్పు

* శెనగపప్పు: ఒక కప్పు

* క్యారెట్‌ తురుము: ఒక కప్పు

* అల్లం, పచ్చిమిర్చి తరుగు: 1/4 కప్పు

* నూనె: తగినంత

తయారీ విధానం:

* ముందుగా మినపప్పు, శెనగపప్పులను ఓ గంట పాటు నానబెట్టుకోవాలి.

* ఇప్పుడు మిక్సీలో మినపప్పు, శెనగపప్పు అందులో పచ్చిమిర్చి, క్యారెట్, అల్లం చేర్చి గారెలకు చేసే మిశ్రమంలా చేసుకోవాలి.

* ఆ పిండితో గారెల్లా తట్టుకుని నూనెలో వేయించి, బ్రౌన్ కలర్‌గా వచ్చేశాక దించండి. ఈ గారెలకు చిల్లీ సాస్, టమోటో సాస్ , గ్రీన్ చట్నీతో తింటే బావుంటది.