Carrot Kheer Recipe
క్యారెట్ ఖీర్ రెసిపి
కావలసిన పదార్థాలు :
క్యారెట్ - పావు కిలో
చిక్కటి పాలు - లీటరు
పంచదార - పావు కిలో
జీడిపప్పు - వంద గ్రాములు
యాలకులు - 4 (పొడిచేసుకోవాలి)
తయారీ విధానం :
క్యారెట్‌ని ముక్కలుగా కోసి కుక్కర్‌లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.
తరువాత ఈ ఉడికిన ముక్కలు, జీడిపప్పు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి.
పాలు కాచి, పొంగువచ్చే సమయంలో ఈ ముద్ద, యాలకుల పొడి వేయాలి.
సన్నని సెగపై అడుగు అంటకుండా కలయతిప్పుతూ ఉండాలి.
ఇలా పదినిమిషాల పాటు తిప్పి పంచదార వేయాలి.
దీంతో క్యారెట్ ఖీర్ తయారయినట్టే. ఈ ఖీర్‌ను వేడి వేడిగా తీసుకుంటే భలే రుచిగా ఉంటుంది.
చల్లారాక కూడా దీని రుచిలో మార్పేమి ఉండదు.
ఇది చాలా బలవర్థకమైన ఆహారం.